బాహుబలి 2 ఖాతాలో మరో 25.5 కోట్లు
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పెట్టిన బాహుబలి 2.. తన హవా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా వసూళ్ల లిస్ట్ లో మరో 25.5 కోట్లు చేరాయి. తాజాగా సినిమా థియట్రికల్, శాటిలైట్ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ కూడా భారీ ధర పలుకుతున్నాయి. డిజిటల్ మీడియా అభివృద్ధి చెందుతుండటంతో అదే స్థాయిలో పోటి పెరుగుతోంది.
తాజాగా ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టిన కంటెంట్ స్ట్రీమింగ్ వెబ్ సైట్ నెట్ ఫ్లిక్స్ కన్ను బాహుబలి మీద పెడింది. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ కస్టమర్లు ఉన్న ఈ సంస్థ బాహుబలి సినిమా డిజిటల్ రైట్స్ ను 25.5 కోట్ల వెచ్చించి సొంతం చేసుకుంది. ఇప్పటికే బాహుబలి 2 హిందీ, మలయాళ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో మిగతా భాషల్లో కూడా బాహుబలి 2 అందుబాటులోకి రానుంది. అమెజాన్ నుండి పోటీ తట్టుకొని మరీ నెట్ ఫ్లిక్స్ చాలా భారీ మొత్తానికి ఈ సినిమాను సొంతం చేసుకుంది.