శ్రేయాస్ శ్రీనివాస్
‘‘థియేటర్లు తాత్కాలికంగా మూతబడటంతో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తోంది. తాజాగా మేం ప్రవేశపెడుతున్న ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) ప్లాట్‌ఫామ్‌కు కూడా ప్రేక్షకాదరణ ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రేయాస్ శ్రీనివాస్. శ్రేయాస్‌ఈటీ అనే యాప్ ద్వారా ఏటీటీ (ఎనీటైమ్ థియేటర్) అనే ఆన్‌లైన్ థియేటర్ మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశారు శ్రీనివాస్. ఈ సందర్భంగా శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ – ‘‘ఏటీటీలో కొన్ని స్క్రీన్స్ ఉంటాయి. ఇటీవలే ఓ స్క్రీన్ (ఆర్‌జీవీవరల్డ్)లో రామ్‌గోపాల్‌వర్మగారి ‘క్లైమాక్స్’ చిత్రం విడుదలైంది.
కంటెంట్ క్రియేటర్స్‌కు, చిన్న సినిమాల నిర్మాతలకు ఈ ఏటీటీ ప్లాట్‌ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి మా ఏటీటీ ప్లాట్‌ఫామ్‌లో పది నుంచి 15 స్క్రీన్స్‌ను తెలుగుకి, పది స్క్రీన్స్‌ను కన్నడ, మలయాళం, తమిళ చిత్రాలకు ఐదు చొప్పున కేటాయించాం. వచ్చే ఏడాది మార్చికల్లా యాభై స్ట్రయిట్ సినిమాలను మా ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయాలన్నదే మా టార్గెట్. థియేటర్‌లో చూసే పెద్ద సినిమాల ఎక్స్‌పీరియన్స్‌లో ఉండే కిక్కే వేరు. ఇదివరకు మా గుడ్‌సినిమాస్ గ్రూప్ బ్యానర్‌లో ‘ఈ రోజుల్లో’ , ‘రోజులుమారాయి’, ‘రొమాన్స్’, ‘వెంకటాపురం’ వంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఐదు సినిమాలు మా ప్రొడక్షన్‌లో ఉన్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment