ప్రేమిస్తే ప్రాణమిస్తా! | Pranamista love! | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తే ప్రాణమిస్తా!

Published Mon, Jul 27 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

ప్రేమిస్తే ప్రాణమిస్తా!

ప్రేమిస్తే ప్రాణమిస్తా!

ఒక్కసారి ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, ప్రాణాన్ని సైతం లెక్కచేయనని ఓ యువకుడు తన మనసుకు నచ్చిన అమ్మాయికి మాట ఇస్తాడు. మరి ఆ మాటను ఆ అమ్మాయి నమ్మిందా? ఆమె ప్రేమను ఆ కుర్రాడు గెలుచుకున్నాడా? లేదా అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీ శంకర్, జయంతి జంటగా పొందూరి రామ్మోహనరావు, పొందూరి లక్ష్మీదేవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘అందమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లక్ష్మణసాయి, సహనిర్మాత: పి.సాయి మురళీకృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement