ప్రేమజంటకు పెద్దల భయం.. | Elderly couple in love is to fear .. | Sakshi
Sakshi News home page

ప్రేమజంటకు పెద్దల భయం..

Published Sat, Jun 25 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

ప్రేమజంటకు పెద్దల భయం..

ప్రేమజంటకు పెద్దల భయం..

ఒంటిపై కిరోసిన్ పోసుకొని పోలీసులను ఆశ్రయించిన ప్రేమికులు

 

రసూల్‌పురా: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట పెద్దలకు భయపడి  ఒంటిపై కిరోసిన్ పోసుకుని పోలీసులను అశ్రయించింది. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. బోయిన్‌పల్లి ఆర్యసమాజ్ వద్ద నివాసముండే కీర్తిరెడ్డి, బాపూజీనగర్‌కు చెందిన భవానిశంకర్ (22) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం కీర్తిరెడ్డి మేజర్ కావడంతో కూకట్‌పల్లిలోని  ఆర్యసమాజ్‌లో ఈ నెల 21న వివాహం చేసుకున్నారు.


రెండు రోజుల క్రితం బోయిన్‌పల్లి పోలీసుల వద్దకు వచ్చి పెళ్లి విషయం చెప్పారు. అయితే కీర్తిరెడ్డి తల్లిదండ్రుల కోరిక మేరకు మాట్లాడేందుకు వారిని శుక్రవారం పీఎస్‌కు పిలిపించారు. రెండు రోజులుగా బెదిరింపుకాల్స్ చేస్తుండడం, పోలీసులు రమ్మని చెప్పడంతో స్టేషన్ వద్దకు చేరుకునే ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకుని చేరుకున్నారు. దీంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ చేసి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement