స్వచ్ఛమైన ప్రేమ | okkasari premisthe movie releases on Diwali | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమ

Published Sat, Sep 6 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

స్వచ్ఛమైన ప్రేమ

స్వచ్ఛమైన ప్రేమ

 స్వచ్ఛమైన ప్రేమకు అంతం ఉండదని, అది ఏడు జన్మల బంధం అవుతుందనే కథాంశంతో చిత్తజల్లు ప్రసాద్‌నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీశంకర్, జయంతి జంటగా పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పొందూరి రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమకు సరైన అర్థం తెలియకుండా యువతరం తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? అని చెప్పే చిత్రం ఇదని దర్శకుడు అన్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లక్ష్మణసాయి, ఘంటాడి కృష్ణ, నిర్మాణ సారథ్యం: సాయి మురళీకృష్ణ, సహనిర్మాత: పంటా సుబ్బారావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement