okkasari Premisthe
-
ప్రేమలో పడితే...
యువత ప్రేమలో పడ్డాక వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీశంకర్ , జయంతి జంటగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో పొందూరి రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ ప్రేమకథ ల్లోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి లక్ష్మణ్, సహ నిర్మాత: పొందూరి సాయిమురళీకృష్ణ. -
స్వచ్ఛమైన ప్రేమ
స్వచ్ఛమైన ప్రేమకు అంతం ఉండదని, అది ఏడు జన్మల బంధం అవుతుందనే కథాంశంతో చిత్తజల్లు ప్రసాద్నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీశంకర్, జయంతి జంటగా పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పొందూరి రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమకు సరైన అర్థం తెలియకుండా యువతరం తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? అని చెప్పే చిత్రం ఇదని దర్శకుడు అన్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లక్ష్మణసాయి, ఘంటాడి కృష్ణ, నిర్మాణ సారథ్యం: సాయి మురళీకృష్ణ, సహనిర్మాత: పంటా సుబ్బారావు. -
ఏడు జన్మల బంధం
జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడనివాళ్లుండరు. ఆ ఇద్దరికీ కూడా అది తొలి ప్రేమ. ఆ ప్రేమను పండించుకోవడానికి ఆ అమ్మాయీ, అబ్బాయీ ఏం చేశారు? అనే కథాంశంతో మురళి మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. ఏడు జన్మల బంధం అనేది ఉపశీర్షిక. పొందూరు లక్ష్మీదేవి సమర్పణలో పొందూరు రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భవానీశంకర్, జయంతి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: లక్ష్మణ్సాయి, నిర్మాణ నిర్వహణ: కన్నా రవి దేవరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పొందూరు సాయిమురళీ కృష్ణ, సహనిర్మాత: పంటా సుబ్బారావు.