
జన నీరాజనం
భరతజాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్ 125వ జయంతిని గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా యుగ పురుషుడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలుచోట్ల అన్నదానాలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- సాక్షి, సిటీబ్యూరో