
సాక్షి, తాడేపల్లి: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పూల మాలలు వేసి నివాళర్పించారు.
(అంబేడ్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి)
అనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందన్నారు. నేడు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలనుకున్నామని.. కానీ కరోనా వల్ల ఇళ్ల పట్టాల కార్యక్రమం చేయలేకపోయమని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. మహిళా సాధికారికతకు కూడా సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment