గురుభ్యోనమః | Today Sarvepalli Radha Krishna Jayanti | Sakshi
Sakshi News home page

గురుభ్యోనమః

Published Fri, Sep 5 2014 2:02 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

గురుభ్యోనమః - Sakshi

గురుభ్యోనమః

 ఆదిలాబాద్ టౌన్ : గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర.. ఔను మరి గురువులకు   ఉన్న ప్రాధాన్యత అలాంటిది. తల్లిదండ్రుల తర్వాత పూజించబడేది గురువులే. గురువులు పరబ్రహ్మ స్వరూపంగా సంభోదించే సంప్రదాయం మనది.

తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు భవిష్యత్తుకు బాట చూపుతారు. అక్షర ఓనమాలు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. గురువులను గౌరవించనివారి భవిష్యత్తు అంధకారమే అని చెప్పవచ్చు.. దేశ ప్రథమ పౌరుడైన.. ఎంతటి స్థాయిలో ఉన్నా.. గురువు లేనిదే ఆ వ్యక్తి అంతటి గమ్యానికి చేరుకోలేరు. క్రమ శిక్షణ, సమయ పాలన, విధి నిర్వహణలో నిబద్ధతకు నిదర్శనం ఉపాధ్యాయ వృత్తి.

విద్యార్థులకు అలాంటి ఉత్తమ విద్యనందించిన వారే ఉత్తములు అవుతారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉత్తమ గురువులు అవార్డులను అందుకోనున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిలో మన ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది.

 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ సన్మానించనున్నారు. జాతీయ స్థాయిలో ఒకరు, రాష్ట్రస్థాయిలో ఐదుగురు, జిల్లా స్థాయిలో 22 మంది ఈ అవార్డులను అందుకోనున్నారు. అంతటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడానికి వారి కృషి అంతాఇంతా కాదు. వారు పడుతున్న శ్రమ అలాంటిది కూడా..! నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డులు సాధించిన ఉపాధ్యాయుల కథనాలు..

 ‘స్వర్ణ’కుమారికి రాష్ట్రస్థాయిలో ఖ్యాతి
 ఆదిలాబాద్ టౌన్ : స్వర్ణ కుమా రి.. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె 1980లో ఉపాధ్యా య వృత్తిలో చేరారు. 2009లో అప్పటి కలెక్టర్ వెంకటేశ్వర్లు చే తుల మీదుగా జిల్లా ఉత్తమ ఉ పాధ్యాయురాలిగా అవార్డు పొం దారు. డీపీఈపీ ప్రాజెక్టు ఉన్న సమయంలో బాలికాభివృద్ధి అధికారిగా పనిచేశారు. దహెగాం, భీమిని, నెన్నెల మండలాల్లోని మహిళల్లో 4 శాతం ఉన్న అక్షరాస్యతను 22 శాతానికి పెంచేందు కు కృషి చేశారు. బాలికాభివృద్ధికి పాటుపడ్డారు.

చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటాపాటలు నేర్పించడం, తదితర కార్యక్రమాలను చేపట్టారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి చేతుల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకోనున్నారు.
 
 నిబద్ధతకు నిదర్శనం.. ఈ మాస్టారు
 ఆదిలాబాద్ టౌన్ : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధన కల్పిస్తూ సర్కారు బ డుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా సంతోష్‌కుమార్ కృషి చేశారు. ఈయన ఆది లాబాద్ మండలంలోని అంకోలి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1987 ఫిబ్రవరిలో ఉపాధ్యాయునిగా నియామకమ య్యారు. గతంలో అంకోలి పాఠశాలలో వంద మం ది సంఖ్యను 230కి పెంచారు.

చదువుతోపాటు ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు రా ణించేలా కృషి చేశారు. దాతల సహాయ సహకారాలతో పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఎస్‌ఎంసీ కమిటీలు సక్రమంగా నిర్వహించడం, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడంతో ఈయన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement