డీఈఓ వర్సెస్‌  ఉద్యోగులు | Teachers Protest In Adilabad | Sakshi
Sakshi News home page

డీఈఓ వర్సెస్‌  ఉద్యోగులు

Published Thu, Aug 9 2018 12:33 PM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

Teachers Protest  In Adilabad - Sakshi

డీఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, జనార్దన్‌రావు

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా విద్యాశాఖాధికారి, ఆ శాఖ సిబ్బంది మధ్య వివాదం ముదిరి పాకానపడింది. డీఈఓ జనార్దన్‌రావు జిల్లాలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొదలైన వివాదం తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ప్రతీ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆయనపై ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. ఈ విషయంలో డీఈఓ నోరు మెదపకపోవడం గమనార్హం. ప్రధానంగా జిల్లాలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక అంశంలో డీఈఓ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోవడంతోనే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదని కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఆయన ఏ జిల్లాలోనైనా పనిచేస్తారని.. ఇదివరకు విధులు, నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని, అలాంటప్పుడు జిల్లా విషయానికొచ్చేసరికి ఏకపక్షంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
 
గాడితప్పిన విద్యాశాఖ..
విద్యాశాఖలో కొంతకాలంగా పాలన గాడితప్పింది. జిల్లా ఉన్నతాధికారి, ఉద్యోగుల మధ్య పోరు నెలకొంది. ఏ పని చేసిన అధికారి అడ్డుపుల్ల వెస్తున్నారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. గత నెలలో జరిగిన బదిలీ సమయంలో డీఈఓ సెలవుపై వెళ్లడంతో బదిలీల్లో జాప్యం జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు డీఈవోకు వ్యతిరేకంగా అందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బదిలీ ప్రక్రియలో గందర గో ళం నెలకొనడంతో పలుసార్లు డీఈఓ కార్యాలయానికి కలెక్టర్‌ వచ్చి పరిశీలించిన విషయం తెలి సిందే. విద్యాశాఖ అధికారి తీరుతో ఉద్యోగులు కూడా పట్టిపట్టనట్లుగా వ్యవహరించడంతో ఏ పనులు కూడా ముందుకు సాగడంలేదని తెలు స్తోంది.

ఇటీవల నిర్వహించిన వీవీల ప్రక్రియ వారం రోజులపాటు ఆలస్యంగా జరిగింది. కేజీబీవీల్లో భోజన బిల్లులు గత ఫిబ్రవరి మాసం నుంచి జూన్‌ వరకు విడుదల చేయకపోవడంతో పిల్లలకు మోను ప్రకారం భోజనం అందలేదు. కేజీబీవీ ప్రత్యేక అధికారులు ఈ విషయం రాష్ట్ర మంత్రి వరకు తీసుకెళ్లారు. వచ్చిన కొత్తలో పాఠశాలలను ప్రతి రోజు తనిఖీలు చేపట్టిన ఆయన ఈ విద్యాసంవత్సరం పాఠశాలల తనిఖీ చేయలేదని తెలుస్తోంది. గత ఏడాది పాఠశాలలో తనిఖీ  సమయంలో ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్, మంత్రికి ఆయనపై ఫిర్యాదు చేశారు.

ఆందోళన బాట..
విధుల్లో చిన్నపాటి తప్పిదాలు జరిగినా ఉద్యోగులను బాధ్యులు చేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తోటి ఉద్యోగుల ముందు దూషించడంతో మానసకింగా ఆవేదనకు గురవుతున్నామని వాపోతున్నారు. ఇదివరకు పనిచేసిన అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించగా ప్రస్తుత అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. మానసికంగా వేధింపులకు పాల్పడడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా అంతర్గతంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం విధులు బహిష్కరించారు. కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓ ఇక్కడ పనిచేస్తే తాము విధులకు హాజరుకాబోమని కలెక్టర్‌కు విన్నవించారు. డీఈఓను సరెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గత మూడు నెలల క్రితం టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడికి కూడా ఉద్యోగులు తమ బాధలు చెప్పుకున్నారు. డీఈవో వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి జోగు రామన్న దృష్టికి సైతం పలు మార్లు తీసుకెళ్లినప్పటికీ వేధింపులు తప్పడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులకు గురిచేయడం లేదు..
ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేడయం లేదు. విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించడం తప్ప వారితో ఎలాంటి విభేదాలు లేవు. ఎవరి వి ధులు వారు బాధ్యతాయుతంగా నిర్వర్తించుకుం టే ఎలాంటి సమస్య ఉండదు. నేను వచ్చిందే ఇక్కడికి విద్యాశాఖను ముందుకు తీసుకెళ్లడానికి. నాపై ఉద్యోగులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం.  – జనార్దన్‌రావు, డీఈవో ఆదిలాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement