
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు.
సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సందేశంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారన్నారు.
షెడ్యూల్డ్ కులాల విభాగంతో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం అంబేద్కర్ పోరాడారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగుస్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. వివక్ష లేని, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని సీఎం యోగి పేర్కొన్నారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్ నగరంలో జన్మించారు. ఆయన రాజ్యాంగ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.