struggled
-
డబ్బుల కోసమే నటించా.. నాలా చాలామంది ఉన్నారు: నటి
ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కింది. పాయల్ కపాడియా ఈ చిత్రాన్ని తెరకెకక్కించారు. అయితే ఈ సినిమాలో మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించింది. తాను సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించింది. కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన కని కస్రుతి పుచ్చకాయను పోలి ఉన్న హ్యండ్బ్యాగ్తో కనిపించిన అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా ఇంటర్వ్యూలో తాను పడిన కష్టాలను పంచుకుంది.కని కుస్రుతి మాట్లాడుతూ..'నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. తనకు జీవనోపాధి కోసం మాత్రమే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2020లో నేను నటించిన మలయాళ చిత్రం "బిరియాని"కి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నా. కానీ అంతకుముందు నా జీవితమంతా కన్నీళ్లతో పోరాటమే. నా దగ్గర డబ్బు లేని సమయంలో సజిన్ (సజిన్ బాబు) నన్ను సంప్రదించాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయనతో ఓకే మాట చెప్పా. ఇందులో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ క్యారెక్టర్ నేను చేయలేను అని చెప్పా. మరొకరిని వెతకండి సలహా ఇచ్చా. ఆ సమయంలో నాకు డబ్బు అవసరం ఉన్నప్పటికీ సినిమా చేయాలని అనిపించలేదని చెప్పింది. మూడు నెలల తర్వాత చిత్రనిర్మాత మళ్లీ నన్ను సంప్రదించారని' కుస్రుతి తెలిపింది.బిరియానీకి రూ.70,000 ఆఫర్కుస్రుతి మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమా చేయడానికి ఆసక్తి లేదు. కానీ నా దగ్గర డబ్బు లేదని చెప్పా. నాకు దాదాపు రూ.70 వేల ఆఫర్ ఇచ్చారు. అది నాకు చాలా పెద్ద మొత్తం. అప్పుడు నా ఖాతాలో కేవలం రూ.3 వేలు మాత్రమే ఉంది.' తన కన్నీళ్ల బాధను పంచుకుంది. కాగా..ఒకవేళ తాను థియేటర్‌కే పరిమితమైన ఉంటే.. బాగా సంపాదించగలిగితే సినిమాల్లోకి రాకపోవచ్చని ఆమె అన్నారు. భవిష్యత్తులో జీవనోపాధి పొందే పరిస్థితులు లేకుంటే.. నాకు ఇష్టం లేని పనులు చేయవలసి రావొచ్చని.. అలాంటి వారు చాలా మంది ఉన్నారని' ఆమె చెప్పింది. -
అంబేద్కర్‌కు యూపీ సీఎం నివాళులు!
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సందేశంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారన్నారు. షెడ్యూల్డ్ కులాల విభాగంతో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం అంబేద్కర్ పోరాడారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగుస్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. వివక్ష లేని, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని సీఎం యోగి పేర్కొన్నారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్ నగరంలో జన్మించారు. ఆయన రాజ్యాంగ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. -
కల్లోల కడలి తరంగం
ఇరోమ్ ఛాను షర్మిల! మణిపూర్ ఉక్కు మహిళ. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను (ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్స్) రద్దు చేయాలంటూ 16 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు నిరాహారదీక్ష చేసిన యువతి, పౌరహక్కుల కార్యకర్త, రాజకీయ నాయకురాలు, కవయిత్రి ఇలా భిన్న భూమికలు పోషించిన వ్యక్తి. ఇప్పుడు సామాజిక సేవ చేసేందుకు జమ్మూ, కశ్మీర్‌కు పయనమవుతామంటున్నారు. అక్కడ మహిళా సాధికారత సాధన కోసం కృషి చేస్తామంటున్నారు. మళ్లీ నిరాహారదీక్ష జోలికి వెళ్లనని, దానికి బదులు మహిళలను చేరుకుని, సమకాలీన ప్రాముఖ్యం ఉన్న అంశాలపై చర్చలు కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇప్పుడిక భారత్ బోర్డర్‌కి మణిపూర్‌లో మాదిరిగానే కశ్మీర్‌లోనూ భద్రతాదళాల ప్రత్యేక చట్టాలు అమలవుతున్నాయి. అందువల్లే అక్కడకు వెళ్లి కశ్మీర్ మహిళలకు వారి హక్కుల పట్ల అవగాహన, చైతన్యాన్ని కలిగించి ఈ నిరంకుశచట్టాలపై గళమెత్తేలా చేస్తానంటున్నారు షర్మిల. ‘‘కశ్మీర్లో వివిధ వయసుల్లోని మహిళలను కలుసుకుని వారి సమస్యలేమిటో తెలుసుకుంటాను. వాటికి పరిష్కారాలేమిటన్న దానిపై చర్చిస్తాను’’ అని ఆమె అంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని, కేవలం ప్రజలనే కలుసుకుంటానని కూడా ఆమె స్పష్టం చేశారు. తన ఉద్యమం ద్వారా అక్కడి మహిళలు ప్రభుత్వాన్ని సరైన దిశలో కదిలించగలగాలన్నదే తన ఆశ, తాపత్రయమని అన్నారు.‘‘భారత్–పాకిస్తాన్ల మధ్య సుదీర్ఘకాలం పాటు ఘర్షణలు కొనసాగడం బాధాకరం. పొరుగు దేశాలుగా స్నేహసంబంధాలుంటే బావుంటుంది. ఈ రెండుదేశాల మధ్య శాంతిస్థాపనకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధమే’’నని కూడా ఇరోమ్ ప్రకటించారు! ఓటమి మంచి అనుభవం! ప్రత్యేక అధికారాల పేరిట సైనిక దళాలు ప్రజల హక్కులు హరించడాన్ని ఎలుగెత్తి చాటి, విస్తృత అధికారాలు కల్పించే ఈ చట్టాల రద్దు కోసం పోరాడిన ధీర వనితగానే షర్మిల గుర్తిండిపోయారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం నిరాహారదీక్ష చేసిన వ్యక్తిగా (ముక్కుకు అమర్చిన గొట్టం ద్వారా ఆహారం ) అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నా, రాజకీయ నాయకురాలిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి! ఈ ఎన్నికల ఫలితం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయడం తప్పిదం కాదని, అదో మంచి అనుభవం కింద గుర్తుంచుకుంటానని షర్మిల అంటున్నారు. ‘నా రాష్ట్ర, దేశ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకుని వారిని నేరుగా కలుసుకునేందుకు ఇదొ సువర్ణావకాశం’ అంటారు తన ఈ రెండో ప్రస్థానం గురించి. ‘ఓ మనిషిగా జీవించేందుకు, నేను కోరుకున్న హక్కుల సాధనకు కట్టుబడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాను. అందువల్లే నా మనుషులను, నా బంధువులను కాదని, నేను పుట్టిన నేల, సొంత ప్రాంతాన్ని విడిచి వచ్చేశాను’ అంటారు షర్మిల. అంతేకాదు, ఇక ప్రతీరోజు నేను పాటలు పాడుతూ, కూనిరాగాలు తీస్తూ, స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం ప్రార్థిస్తాను అని కూడా ప్రకటించేశారు ఇరోమ్ షర్మిలా! ప్రస్తుతం ఆమె తరచు మణిపూర్, కశ్మీర్‌ల మధ్య ప్రయాణిస్తున్నారు. అన్నీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలే! 2000 నవంబర్‌లో భద్రతాదళాల కాల్పులకు 10 మంది అమాయకులు బలికావడాన్ని నిరసిస్తూ అనూహ్యంగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నట్టు ప్రకటించి, పదహారేళ్ల పాటు కొనసాగించడం.. ఈ దీక్ష సందర్భంగా కన్నతల్లిని సైతం ఒకే ఒకసారి కలుసుకోవడం ఒక ఆశ్చర్యం! మాతృమూర్తిని పదే పదే కలిస్తే నిరాహారదీక్షపై తన ధృఢచిత్తం ఎక్కడ సడలుతుందోననే ఆమె భయం. అలాగే.. ఎంత సుదీర్ఘకాలం దీక్షలో కూర్చున్నా.. అంతే అకస్మాత్తుగా దీక్ష విరమించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించడం, అందుకోసం రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం మరో ఆశ్చర్యం. పుట్టినగడ్డ అయిన మణిపూర్‌లో స్థానికుల హక్కుల పరిరక్షణకు వీరోచితంగా పోరాడి, ఆ నేలను విడిచిపెట్టి తమిళనాడులోని కొడైకెనాల్కి వచ్చి స్థిరపడాలని అనుకోవడం, అదీ కూడా.. గోవా మూలాలున్న బ్రిటిష్–భారత సంతతికి చెందిన డెస్మండ్ కౌటిన్హొతో లేఖల ద్వారా ప్రేమలో వాళ్లిద్దరూ ప్రేమలో పడి అది పెళ్లికి దారితీయడం వరకు.. ఇలా షర్మిల జీవితంలోని ప్రతి మలుపు, ప్రతి నిర్ణయం ఆశ్చర్యం గొలిపేదే. – కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సమస్యలపై పోరాడేది ఐఎన్‌టీయూసీనే
యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు రుద్రంపూర్: సింగరేణిలో కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసేది సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) మాత్రమేనని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు అన్నారు. ఆదివారం స్థానిక ఐఎన్టీయూసీ కార్పొరేట్ బ్రాంచి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ సోమిరెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్యూన్ డిజిగ్నేషన్ మార్చి ఆఫీస్ సబార్డినేట్ ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గత నెల చివరివారంలో అన్ని జాతీయ కార్మిక సంఘాలతో కలిసి సీఎంను కలిసి సకలజనుల సమ్మె కాలపు వేతనం, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అమలుపై విజ్ఞప్తి చేశామన్నారు. కొత్త బావులు ఏర్పడిన తరువాత డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చెప్పారని, ప్రస్తుతం కొత్త గనులు వచ్చినందున వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. లేకపోతే జాతీయ కార్మిక సంఘాలను కలుపుకుని సమ్మె చేస్తామన్నారు. ఇన్‌కంటాక్స్ శ్లాబ్‌ను పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. ఎస్అండ్పీసీ క్యాడర్ స్కీం కోసం యాజమాన్యంతో మాట్లాడతామని, 5 గనులను ప్రైవేటుపరం చేయాలనే యాజమాన్య ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తెలిపారు. బ్రాంచి సెక్రటరీ సలస కుమార్, ఆర్.రాజేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి, బండి కృష్ణ, జె.శ్రీనివాస్, కె.రామలక్ష్మారెడ్డి, పి.శ్రీనివాస్, సలీం, మొగల్ సాహెబ్, బాబూరావు, జగన్నాధం, జావెద్, బండ కోటి, సాధిక్‌పాషా తదితరులు పాల్గొన్నారు.