ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కింది. పాయల్ కపాడియా ఈ చిత్రాన్ని తెరకెకక్కించారు. అయితే ఈ సినిమాలో మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించింది. తాను సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించింది. కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన కని కస్రుతి పుచ్చకాయను పోలి ఉన్న హ్యండ్‌బ్యాగ్‌తో కనిపించిన అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా ఇంటర్వ్యూలో తాను పడిన కష్టాలను పంచుకుంది.
కని కుస్రుతి మాట్లాడుతూ..'నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. తనకు జీవనోపాధి కోసం మాత్రమే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2020లో నేను నటించిన మలయాళ చిత్రం "బిరియాని"కి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నా. కానీ అంతకుముందు నా జీవితమంతా కన్నీళ్లతో పోరాటమే. నా దగ్గర డబ్బు లేని సమయంలో సజిన్ (సజిన్ బాబు) నన్ను సంప్రదించాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయనతో ఓకే మాట చెప్పా. ఇందులో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ క్యారెక్టర్ నేను చేయలేను అని చెప్పా. మరొకరిని వెతకండి సలహా ఇచ్చా. ఆ సమయంలో నాకు డబ్బు అవసరం ఉన్నప్పటికీ సినిమా చేయాలని అనిపించలేదని చెప్పింది. మూడు నెలల తర్వాత చిత్రనిర్మాత మళ్లీ నన్ను సంప్రదించారని' కుస్రుతి తెలిపింది.
బిరియానీకి రూ.70,000 ఆఫర్
కుస్రుతి మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమా చేయడానికి ఆసక్తి లేదు. కానీ నా దగ్గర డబ్బు లేదని చెప్పా. నాకు దాదాపు రూ.70 వేల ఆఫర్ ఇచ్చారు. అది నాకు చాలా పెద్ద మొత్తం. అప్పుడు నా ఖాతాలో కేవలం రూ.3 వేలు మాత్రమే ఉంది.' తన కన్నీళ్ల బాధను పంచుకుంది. కాగా..ఒకవేళ తాను థియేటర్‌కే పరిమితమైన ఉంటే.. బాగా సంపాదించగలిగితే సినిమాల్లోకి రాకపోవచ్చని ఆమె అన్నారు. భవిష్యత్తులో జీవనోపాధి పొందే పరిస్థితులు లేకుంటే.. నాకు ఇష్టం లేని పనులు చేయవలసి రావొచ్చని.. అలాంటి వారు చాలా మంది ఉన్నారని' ఆమె చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment