వైభవంగా నృసింహ జయంతి
ఆళ్లగడ్డ : అహోబిల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు శనివారం నుంచి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మమార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తిరమంజనం నిర్వహించి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ ఉత్సవాలు రోజుకో రకంగా ఈ నెల 9 వరకు వైభవోపేతంగా నిర్వహిస్తామని ఆలయ వర్గాలు తెలిపాయి.