నేడు 'చంద్రశేఖర్ ఆజాద్' జయంతి..
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ పంథాలో పనిచేసి దేశానికి ప్రాణాలు అర్పించినవారిలో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. 1906 జూలై 23న మధ్యప్రదేశ్ లోని బాబానగర్‌లో ఆయన జన్మించారు. అయితే ఆయన పూర్వీకులు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు కావడంతో తల్లిదండ్రులు కాశీ విద్యా పీఠంలో సంస్కృత విద్యను అభ్యసించడానికి ఆయన్ని చేర్చారు.
అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమానికి ఆకర్షితుడై 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తాను చదువుకుంటున్న సంస్కృత విద్యాపీఠం ముందే ధర్నా చేశాడు. పోలీ సులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ‘నీ పేరేమిటి?’ అన్న జడ్జి ప్రశ్నకు ఆ 15 ఏళ్ల బాలుడు ‘ఆజాద్’ (స్వేచ్ఛ) అని సమాధానం ఇచ్చాడు. అప్పటి నుంచి అతడి పేరులో ఆజాద్ భాగమయ్యింది. ఇటువంటి సమాధానాలకు అతడికి 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు జడ్జి.
పెద్దవాడవుతున్న కొద్దీ అహింసా మార్గంలో దేశా నికి స్వాతంత్య్రం రాదని ఆయన నమ్మాడు. భగత్‌సింగ్, రాంప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లాఖాన్‌లతో మైత్రి ఏర్పడింది. వీరంతా కలిసి ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్’ అనే విప్లవ సంస్థను స్థాపించారు. వారి పోరాటానికి అవసరమైన వనరులను సమకూర్చు కోవడానికి 1925లో కకోరి వద్ద బ్రిటిష్ ప్రభుత్వ ధనాన్ని తరలిస్తున్న రైలును ఆపి దోపిడీ చేశారు.
ఈ కేసులో అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ లాంటివారిని పట్టు కుని ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆజాద్ అజ్ఞాతంలోకి వెళ్లి పనిచేయ సాగాడు. 1931 ఫిబ్రవరి 27 ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఆల్ఫ్రెడ్ పార్కు’లో ఆజాద్ ఉన్నాడని తెలిసిన పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్ తన తుపాకితో వీరోచి తంగా పోరాడి చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకొని పోలీసులకు ప్రాణా లతో చిక్కకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాడు. అలా స్వతంత్ర భారత యజ్ఞంలోస్వీయ సమిధయ్యాడు. – ఛత్రపతి చౌహాన్, ఏబీవీపీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment