occation
-
స్వేచ్ఛ కోసం విప్లవించి...
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ పంథాలో పనిచేసి దేశానికి ప్రాణాలు అర్పించినవారిలో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. 1906 జూలై 23న మధ్యప్రదేశ్ లోని బాబానగర్‌లో ఆయన జన్మించారు. అయితే ఆయన పూర్వీకులు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు కావడంతో తల్లిదండ్రులు కాశీ విద్యా పీఠంలో సంస్కృత విద్యను అభ్యసించడానికి ఆయన్ని చేర్చారు.అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమానికి ఆకర్షితుడై 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తాను చదువుకుంటున్న సంస్కృత విద్యాపీఠం ముందే ధర్నా చేశాడు. పోలీ సులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ‘నీ పేరేమిటి?’ అన్న జడ్జి ప్రశ్నకు ఆ 15 ఏళ్ల బాలుడు ‘ఆజాద్’ (స్వేచ్ఛ) అని సమాధానం ఇచ్చాడు. అప్పటి నుంచి అతడి పేరులో ఆజాద్ భాగమయ్యింది. ఇటువంటి సమాధానాలకు అతడికి 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు జడ్జి.పెద్దవాడవుతున్న కొద్దీ అహింసా మార్గంలో దేశా నికి స్వాతంత్య్రం రాదని ఆయన నమ్మాడు. భగత్‌సింగ్, రాంప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లాఖాన్లతో మైత్రి ఏర్పడింది. వీరంతా కలిసి ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్’ అనే విప్లవ సంస్థను స్థాపించారు. వారి పోరాటానికి అవసరమైన వనరులను సమకూర్చు కోవడానికి 1925లో కకోరి వద్ద బ్రిటిష్ ప్రభుత్వ ధనాన్ని తరలిస్తున్న రైలును ఆపి దోపిడీ చేశారు.ఈ కేసులో అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ లాంటివారిని పట్టు కుని ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆజాద్ అజ్ఞాతంలోకి వెళ్లి పనిచేయ సాగాడు. 1931 ఫిబ్రవరి 27 ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఆల్ఫ్రెడ్ పార్కు’లో ఆజాద్ ఉన్నాడని తెలిసిన పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్ తన తుపాకితో వీరోచి తంగా పోరాడి చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకొని పోలీసులకు ప్రాణా లతో చిక్కకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాడు. అలా స్వతంత్ర భారత యజ్ఞంలోస్వీయ సమిధయ్యాడు. – ఛత్రపతి చౌహాన్, ఏబీవీపీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు -
సెకండ్ డోస్‌లో వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: పండుగలు, శుభకార్యాల పేరుతో జనం సాధారణ జీవనంలో నిమగ్నమయ్యారు. కరోనా వైరస్ వెళ్లిపోయిందన్న భ్రమలో ఉండిపోయారు. దీంతో కరోనా జాగ్రత్తలను చాలామంది పక్కనపెట్టేశారు. మాస్క్‌లను ధరించడానికి అయిష్టత చూపుతున్నారు. భౌతికదూరం మరిచిపోయారు. కరోనా థర్డ్‌వేవ్‌పై హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్నిచోట్ల సాగదీత ధోరణిలో కొనసాగుతోంది. మొదటి డోస్ వేసుకున్నవారితో పోలిస్తే, రెండో డోస్ వేసుకున్నవారు చాలా తక్కువగా ఉన్నారు. నారాయణపేటలో సెకండ్ డోస్ 14 శాతమే... తెలంగాణలో ఈ ఏడాది జనవరి 16 నుంచి ఈ నెల 7 వరకు జరిగిన కరోనా వ్యాక్సినేషన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం మొదటి డోస్ టీకా తీసుకున్నవారు 70 శాతం మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 110 శాతం ( ఇతర రాష్ట్రాలవారితో కలిపి) జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 91 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 81 శాతం మొదటి డోస్ టీకా పొందారు. కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యంత తక్కువగా 45 శాతం మంది మొదటి డోస్ టీకా తీసుకున్నారు. ఇంత తక్కువ శాతం మొదటి డోస్ టీకా వేశారంటే అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థమవుతుందని అంటున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 46 శాతం, నాగర్‌కర్నూలు 50 శాతం మంది అర్హులు టీకా పొందినట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలావుంటే సెకండ్ డోస్ తీసుకున్నవారు కేవలం 38 శాతమే ఉన్నారు. సెకండ్ డోస్ తీసుకున్నవారు హైదరాబాద్‌లో 51శాతం ఉండగా, నారాయణపేట జిల్లాలో అత్యంత తక్కువగా14 శాతమే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 18 శాతం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 19 శాతం మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. చదవండి: బీసీ కులాలవారీగా జనగణన -
Shilpa Ramam: ‘శిల్పారామం’లో శుభకార్యాలకు ధరలు ఎంతో తెలుసా..
సాక్షి, మాదాపూర్(హైదరాబాద్): పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్న మాదాపూర్ శిల్పారామం వివాహాది శుభకార్యాలకు వేదికగా కూడా నిలుస్తోంది. మొత్తం 45 ఎకరాల్లో శిల్పారామం విస్తరించి ఉంది. కేవలం సందర్శకులు తిలకించేందుకే కాకుండా వివాహాది శుభకార్యాలు చేసుకొనేందుకూ అధికారులు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక ప్రదేశాలను శిల్పారామంలో అందుబాటులో ఉంచారు. శిల్పారామంలోని వేదికలు ఇవే.. ► శిల్పారామంలో వివాహాది శుభకార్యాల కోసం ఈ కింది వేదికలు ఇస్తారు. ► ఏ ప్రదేశాన్ని బుకింగ్ చేసుకున్నా.. తప్పనిసరిగా రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సందర్శకులను ఆకట్టుకొనేందుకు... ► చిన్నపిల్లలు, తల్లిదండ్రులు సరదాగా గడిపేందుకు ఉయ్యాలలు, పిల్లలకు మేధాశక్తి పెరిగేందుకు ఉపయోగపడే ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. ► కోనసీమ, బోటింగ్, బ్యాటరీకారు, ఎడ్లబండి వంటివి ఆకట్టుకునేలా ఉంటాయి. గ్రీనరీ, పూలమొక్కలు, ఆకర్షణీయమైన చెట్లు ఇక్కడి ప్రత్యేకతలు: ► సందర్శకులకు మరింత ఆకట్టుకునేలా రకరకాల పక్షులను పెంచుతున్నారు. ► వివిధ రకాల పక్షుల కోసం 12 కేవ్లు ఏర్పాటు చేశారు. ► రాతితో తయారు చేసిన సందేశాత్మక విగ్రహాలు ఏర్పాటు చేశారు. ► సందర్శకులు వీటి వద్ద ఫొటోలకు ఫోజులిస్తూ సరదాగా గడుపుతుంటారు. ► వీకెండ్స్‌లో ఆంపీ థియేటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా మేళాల నిర్వహణ ... ► ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు నిర్వహించే మేళాలో దాదాపు 550 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. విద్యార్థులు, దివ్యాంగులకు రాయితీ.. ► 10వ తరగతి వరకు చదివేవారికి 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ► పాఠశాల నుంచి లేఖ తీసుకొచ్చి కార్యాలయంలో అందజేయాలి. ► దివ్యాంగులు, స్వచ్చంద సంస్థల వారికి కూడా 50 శాతం రాయితీ ఇస్తారు. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.. శిల్పారామం అంటే కేవలం సందర్శకులకే కాకుండా శుభకార్యాలను నిర్వహించుకునేందుకు కూడా అవ కాశం కల్పిస్తున్నాం. వీటి కోసం ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేశాం. ఇక్కడ తరచూ శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ వేదిక కోసం ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లోనూ ముందుగా బుక్ చేసుకోవాలి. – జి.అంజయ్య, శిల్పారామం జనరల్ మేనేజర్ చదవండి: వినూత్న ఆలోచనలను ఆవిష్కరించండి -
వైభవంగా జగన్నాథుని రథ యాత్ర
ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రగా పేరొందిన పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ శుక్ల విదియ బుధవారం నాడు అట్టహాసంగా ప్రారంభమైన రథయాత్ర 9 రోజులపాటు కొనసాగుతుంది. భక్తజన వల్లభుడు పూరీ జగన్నాధుడు దేశ ప్రజలందరినీ చల్లాగా చూసి కాపాడాలని ప్రధాని ఈ సందర్భంగా కోరుతూ ట్వీట్ చేశారు. పూరీ జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రథయాత్ర నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. జగన్నాథుని ఆశీస్సులతో గ్రామాలు అభివృద్ధి చెందాలని, పేద ప్రజలు, రైతులు మంచి ఫలితాలను సాధించి భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగగలదని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసింది. జగన్నాథుని భారీ రథయాత్రకు లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం పూరీ ప్రాంతంలో భద్రతా చర్యలను పటిష్టం చేసింది. బుధవారం ఉదయం 4 గంటలకు మంగళహారతి అనంతరం గోపాల వల్లభ సేవతో పూరీ శ్రీ క్షేత్రంలో జగన్నాథుని రథయాత్రను ప్రారంభించారు. రథయాత్ర జరిగే ప్రాంతమైన బొడోదండో జగన్నాథస్వామి నామస్మరణతో మారుమోగుతోంది. May the blessings of Lord Jagannath lead to development of villages, well-being of poor & farmers and take India to new heights of progress. — Narendra Modi (@narendramodi) 6 July 2016 On the occasion of Rath Yatra, my warmest greetings to you all. May Lord Jagannath continue to shower his blessings on everyone. — Narendra Modi (@narendramodi) 6 July 2016