వైభవంగా జగన్నాథుని రథ యాత్ర
ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రగా పేరొందిన పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ శుక్ల విదియ బుధవారం నాడు అట్టహాసంగా ప్రారంభమైన రథయాత్ర 9 రోజులపాటు కొనసాగుతుంది. భక్తజన వల్లభుడు పూరీ జగన్నాధుడు దేశ ప్రజలందరినీ చల్లాగా చూసి కాపాడాలని ప్రధాని ఈ సందర్భంగా కోరుతూ ట్వీట్ చేశారు.
పూరీ జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రథయాత్ర నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. జగన్నాథుని ఆశీస్సులతో గ్రామాలు అభివృద్ధి చెందాలని, పేద ప్రజలు, రైతులు మంచి ఫలితాలను సాధించి భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగగలదని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు.
దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసింది. జగన్నాథుని భారీ రథయాత్రకు లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం పూరీ ప్రాంతంలో భద్రతా చర్యలను పటిష్టం చేసింది. బుధవారం ఉదయం 4 గంటలకు మంగళహారతి అనంతరం గోపాల వల్లభ సేవతో పూరీ శ్రీ క్షేత్రంలో జగన్నాథుని రథయాత్రను ప్రారంభించారు. రథయాత్ర జరిగే ప్రాంతమైన బొడోదండో జగన్నాథస్వామి నామస్మరణతో మారుమోగుతోంది.
May the blessings of Lord Jagannath lead to development of villages, well-being of poor & farmers and take India to new heights of progress.
— Narendra Modi (@narendramodi) 6 July 2016
On the occasion of Rath Yatra, my warmest greetings to you all. May Lord Jagannath continue to shower his blessings on everyone.
— Narendra Modi (@narendramodi) 6 July 2016