సాక్షి, మాదాపూర్(హైదరాబాద్): పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్న మాదాపూర్ శిల్పారామం వివాహాది శుభకార్యాలకు వేదికగా కూడా నిలుస్తోంది. మొత్తం 45 ఎకరాల్లో శిల్పారామం విస్తరించి ఉంది. కేవలం సందర్శకులు తిలకించేందుకే కాకుండా వివాహాది శుభకార్యాలు చేసుకొనేందుకూ అధికారులు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక ప్రదేశాలను శిల్పారామంలో అందుబాటులో ఉంచారు.
శిల్పారామంలోని వేదికలు ఇవే..
► శిల్పారామంలో వివాహాది శుభకార్యాల కోసం ఈ కింది వేదికలు ఇస్తారు.
► ఏ ప్రదేశాన్ని బుకింగ్ చేసుకున్నా.. తప్పనిసరిగా రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
సందర్శకులను ఆకట్టుకొనేందుకు...
► చిన్నపిల్లలు, తల్లిదండ్రులు సరదాగా గడిపేందుకు ఉయ్యాలలు, పిల్లలకు మేధాశక్తి పెరిగేందుకు ఉపయోగపడే ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు.
► కోనసీమ, బోటింగ్, బ్యాటరీకారు, ఎడ్లబండి వంటివి ఆకట్టుకునేలా ఉంటాయి.
గ్రీనరీ, పూలమొక్కలు, ఆకర్షణీయమైన చెట్లు
ఇక్కడి ప్రత్యేకతలు:
► సందర్శకులకు మరింత ఆకట్టుకునేలా రకరకాల పక్షులను పెంచుతున్నారు.
► వివిధ రకాల పక్షుల కోసం 12 కేవ్‌లు ఏర్పాటు చేశారు.
► రాతితో తయారు చేసిన సందేశాత్మక విగ్రహాలు ఏర్పాటు చేశారు.
► సందర్శకులు వీటి వద్ద ఫొటోలకు ఫోజులిస్తూ సరదాగా గడుపుతుంటారు.
► వీకెండ్స్‌లో ఆంపీ థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఏటా మేళాల నిర్వహణ ...
► ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు నిర్వహించే మేళాలో దాదాపు 550 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
► దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.
విద్యార్థులు, దివ్యాంగులకు రాయితీ..
► 10వ తరగతి వరకు చదివేవారికి 50 శాతం రాయితీ ఇస్తున్నారు.
► పాఠశాల నుంచి లేఖ తీసుకొచ్చి కార్యాలయంలో అందజేయాలి.
► దివ్యాంగులు, స్వచ్చంద సంస్థల వారికి కూడా 50 శాతం రాయితీ ఇస్తారు.
ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు..
శిల్పారామం అంటే కేవలం సందర్శకులకే కాకుండా శుభకార్యాలను నిర్వహించుకునేందుకు కూడా అవ కాశం కల్పిస్తున్నాం. వీటి కోసం ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేశాం. ఇక్కడ తరచూ శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ వేదిక కోసం ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లోనూ ముందుగా బుక్ చేసుకోవాలి.
– జి.అంజయ్య, శిల్పారామం జనరల్ మేనేజర్
చదవండి: వినూత్న ఆలోచనలను ఆవిష్కరించండి