జననేతకు ఘన నివాళి
ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు
దివంగత నేత సేవలను గుర్తుచేసుకున్న నాయకులు
జిల్లావ్యాప్తంగా సేవాకార్యక్రమాలు
విశాఖపట్నం: జనం గుండెల్లో గూడుకట్టుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పరిధిలోని వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి, క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు.కేకులు కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. పేదలకు, పిల్లలకు, వద్ధులకు దుస్తులు, ప్లేట్లు, పండ్లు, పాలు, రొట్టెలు, దుస్తులు పంచిపెట్టారు. విశాఖ బీచ్‌రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం వారు నగరంలోని పలు వార్డుల్లో వైఎస్ విగ్రహాలకు దండలు వేసి, జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ సిటీ కమిటీ ఆధ్వర్యంలో 20వ వార్డులోని అమెరికన్ ఓల్డేజ్ హోమ్‌లో వృద్ధులకు అల్పాహారం అందించారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోల గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొన్నారు. నేవల్ డాక్‌యార్డ్‌లో ఈస్ట్రన్ నేవల్ కమాండ్ సివిల్ ఎంప్లాయిస్ యూనియన్(వైఎస్సార్ టియుసి) ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు జరిగాయి. 23వ వార్డులో వార్డు అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. 6వ వార్డు ప్రెసిడెంట్ సుంకరహరిబాబు, జిల్లా కార్యదర్శి గుడ్లపోలురెడ్డిలు ఎండాడ ప్రభుత్వ రెసిడెన్సియల్ అంధ బాలికల పాఠశాలలో కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనకాపల్లిలో కొణతాల మురళి ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. డుంబ్రిగుంటలో రొట్టెలు పంపిణీ చేశారు. చోడవరంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గోనూరీ మిలిట్రీ నాయుడులు ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ముద్దిర్తి గ్రామంలో 100మంది పేదలకు 5కేజీలు చొప్పున బియ్యం పంపిణీ చేశారు. గాజువాక 60వ వార్డులో వార్డు అధ్యక్షుడు ఉరుకూటి వెంకట అప్పారావు పేదలకు చీరలను పంచిపెట్టారు. 50వ వార్డు అధ్యక్షుడు ధర్మాన చిట్టి ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు అల్పాహారం, పండ్లు అందించారు. నక్కపల్లిలో సీజీసీ సభ్యుడు ఈసం రామకృష్ణ, పాయకరావుపేటలో జడ్పీ ఫ్లోర్ లీడర్,కోటవురట్లలో ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఆస్పత్రుల్లో రోగులకు పాలు, రొట్టెలు అందించారు. నర్శీపట్నంలో నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ ఆధ్వర్యంలో మాకవరపాలెం వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు వైఎస్ సంస్మరణ సభ నిర్వహించారు.ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు పాలు, రొట్టెలు పంపిపెట్టారు.పెందుర్తిలో నియోజకవర్గ కన్వీనర్ అదీబ్‌రాజు వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిపెట్టారు. వేపగుంట, ప్రహ్లాదపురం ప్రాంతాల్లో పార్టీ నేతలు దాసరి రాజు, ఎతిరాజుల నాగేశ్వరావుల ఆధ్వర్యంలో మహిళలకు చీరలు అందిచారు.
తరగపువలస జాతీయ రహదారి,అంబేద్కర్ జంక్షన్ల వద్ద భీమిలి పట్టణ అధ్యక్షుడు అక్కరమి వెంకటరావు ఆధ్వర్యంలో అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి,సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, నియోజకవర్గ కన్వీనర్ కర్రి సీతారంలు వైఎస్ విగ్రహాలకు పూలమాలవేశారు. పద్మనాభంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధురవాడలో పార్టీ నాయకుడు రోసిరెడ్డి ఆధ్వర్యంలో స్టీలు కంచాలు పంచిపెట్టారు. యలమంచిలిలో నియోజవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరావు, జిల్లా నేత లాలం రాంబాబులు ప్రేమ సమాజంలో అనాధలకు దుప్పట్లు పంచిపెట్టారు. పెదపల్లిలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.