
లండన్ నగరంలోని ఈస్ట్ హామ్‌లో జులై 8న వైఎస్‌ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ గారిని అభిమానించే యువకులు, పిల్లలు,పెద్దలు, మహిళలు లండన్ నుండే కాకుండా యూకేలోని ఇతర నగరాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ గారిని స్మరించుకుంటూ మళ్ళీ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవస్యకత గురించి యూకే వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా గారు ప్రసంగించారు. మలిరెడ్డి కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ కమిటీ సభ్యులు పీసీ రావు, కిరణ్ పప్పు, ఓబుల్ రెడ్డి పాతకోట, మనోహర్ నక్క, బీ నారాయణరెడ్డి, భాస్కర్ మాలపాటి , ఎన్‌ఆర్ నందివెలుగు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహానేత వైఎస్సార్‌కు ఘనంగా స్మృత్యంజలి
Comments
Please login to add a commentAdd a comment