మనసున్న మారాజుకు ఆత్మీయ నివాళి
జిల్లాలో విస్తృతంగా వైఎస్ జయంతి వేడుకలు
తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. వైఎస్‌ఆర్‌సీపీ ఎ మ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేత లు ఘనంగా కార్యక్రమాలు నిర్వహిం చారు. వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకా లు, అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో జరిగా యి. ఈ సందర్భంగా ప్రజలు జయంతి కార్యక్రమాలకు తరలివచ్చారు. ముఖ్యమంత్రిగా వైఎస్ చేసిన సేవలు, జన సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను స్మరించుకున్నారు. వైఎస్‌ఆర్ అమర్ రహే అంటూ నినదించారు.
తిరుపతిలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాలుగు ప్రధాన కూడళ్లలో 10వేల మందికి అన్నదానం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అధ్వర్యంలో 250 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో టవర్‌క్లాక్ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. భారీ కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం తిరుచానూరు సమీపంలోని దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయంలో నిర్వహించిన జయం తి వేడుకలకు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరై వైఎస్‌ఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం నిర్వహించి, నివాళులర్పించారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూతలపట్టులో జిల్లా కార్యదర్శి రాజారత్నంరెడ్డి అన్నదానం చేశారు.
పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పార్టీ శ్రేణులు రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశాయి. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి తన కార్యాలయంలో వైఎస్‌ఆర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.షమీంఅస్లాం వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుంగనూరులో పార్టీ నేతలు ఎన్.రెడ్డెప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం, రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పలమనేరులో టీవీ కుమార్, హేమంత్‌కుమార్‌రెడ్డి, బాలాజీనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. చిత్తూరులో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జ్ఞాన జగదీష్, నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ డీసీసీబీ, అనుప్పల్లె, జిల్లా పరిషత్ దగ్గర వైఎస్‌ఆర్ విగ్రహాలకు పాలతో అభిషేకం చేసి, అమ్మఒడి ఆశ్రమంలో పాలు, పండ్లు అందించారు. నగరిలో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేజే కుమార్ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చే శారు. నిండ్రలో రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిరెడ్డి వైఎస్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలోని మండలాల్లో పార్టీ ఇన్‌చార్జ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు, అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్వేటినగరంలో మానసిక వికలాంగులకు నిత్యాసవరాలను అందించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనంలో సమన్వయ కర్త ఆదిమూలం ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయుంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యుపు వుధుసూదన్‌రెడ్డి 66 కిలోల కేక్ కట్‌చేసి పంచి పెట్టారు. అన్నదానం చేశారు. పేద వుహిళలకు చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లు అందించారు. రేణిగుంటలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏర్పేడులో ఆటో డ్రైవర్లకు యుూనిఫాం పంపిణీ చేశారు.