విశాఖపట్నం : జనం కోసం బతికావు..జనం గుండెల్లో నిలిచావు..జననేతవై దివికేగావు. రాజన్నా.. నీవు లేవంటే నమ్మలేమయ్యా..మా గుండె చప్పుడు నీవయ్యా..అంటూ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకుంటూ జిల్లా వాసులు నివాళులర్పించారు. వైఎస్ 67వ జయంతిని పార్టీలకతీతంగా జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్‌లో వైఎస్సార్ విగ్రహానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్‌నాథ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు జంక్షన్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మాడుగుల పాతబస్టాండ్ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. కె.కోటపాడులో జరిగిన వేడుకల్లో మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి జగన్‌మోహన్ పాల్గొన్నారు. అక్కడి మూడు రోడ్లు కూడలిలోని విగ్రహనికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. కేక్‌ను కట్ చేశారు. కోటవురట్ల మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ సెల్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. యలమంచిలి సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం అచ్యుతాపురం కూడలిలో విగ్రహానికి పూలమాల వేశారు. కోటవురట్లలో మాజీ ఎమ్మెల్సీ డీఎస్‌ఎన్ రాజు, నక్కపల్లి నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు,కార్యకర్తలు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని నర్సీపట్నం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. అబీద్‌సెంటర్‌లో ఉన్న వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పాయకరావుపేటల మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణలు పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు.
చోడవరంలో మాజీ ఎమ్మెల్యేకరణం ధర్మశ్రీ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలులు వేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యలమంచిలిలో అదనపు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో హరిపాలెం, తిమ్మరాజుపేట, జగ్గన్నపేట, మునగపాక గ్రామాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అరకులోయలో పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యురాలు కె.అరుణకుమారి, కొయ్యా రాజారావుమహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కశింకోటలోని ప్రధాన రహదారిలోని వైఎస్సార్ నిలువెత్తు విగ్రహానికి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దంతులూరి శ్రీధర్‌రాజు పూలమాల వేశారు. మండల కేంద్రం డుంబ్రిగుడలో ఎంపీపీ వంతల జమున,జెడ్పీటీసీఎం కుజ్జమ్మ వేడుకలను నిర్వహించారు.