
సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని సుశాంత్ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది.. గేర్ మార్చి బండి తియ్’ (షూటింగ్ మొదలుపెడుతున్న విషయాన్ని ఉద్దేశిస్తూ) అని ట్వీట్ చేశారు సుశాంత్. హీరో సుమంత్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆప్యాయత నిండిన అన్ని జ్ఞాపకాలు ఈ రోజు ఎక్కువగా మెదులుతున్నాయి తాతా.. మీ జీవితంలో ఒక చిన్న భాగమైనందుకు జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞుడనై ఉంటాను’ అని భావోద్వేగపూరితంగా రాసుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్.
Comments
Please login to add a commentAdd a comment