
సుశాంత్ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చిలసౌ’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమాను జాతీయ అవార్డు వరించింది. ఇక సుశాంత్ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, హరీష్ కోయిలగుండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.
Comments
Please login to add a commentAdd a comment