ఘనంగా జ్యోతిబా పూలే జయంతి
Published Tue, Apr 11 2017 5:11 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హైదరాబాద్: జ్యోతిబా పూలే 191వ జయంతి సందర్భంగా ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ నాయకులు పూలే చిత్రపటానికి పూల మాలవేసి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ మంత్రి వర్గంలో సామాజిక సమతుల్యత లోపించిందని, మైనార్టీలకు, గిరిజనులకు ప్రాతినిద్యమే లేదని, మహిళా ప్రాతినిద్యం కేవలం 8 శాతమేనని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాసు కృష్ణా రెడ్డి, డాక్టర్ శైలజానాధ్, డాక్టర్ తులసిరెడ్డి, సూర్యానాయక్, గిడుగు రుద్రరాజు, జంగాగౌతమ్, రవిచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement