స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర | Colours Swathi's Tripura Release Date | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర

Published Mon, Oct 26 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర

స్క్రీన్‌ప్లే హైలైట్...త్రిపుర

స్వాతి టైటిల్ రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘త్రిపుర’. క్రేజీ మీడియా పతాకంపై ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది. తమిళంలో ‘తిరుపుర సుందరి’గా వస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అనుకున్న కథను రాజకిరణ్ అద్భుతంగా తెరకెక్కించారు. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ అందించిన స్క్రీన్‌ప్లే ఓ హైలైట్. ‘స్వామి రారా, కార్తికేయ’ వంటి విజయాల తర్వాత స్వాతి నటించిన మరో తెలుగు చిత్రమిది. ఆ కోవలోనే ఇదీ హిట్టవు తుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు.

‘‘త్రిపుర ఏం చేస్తుంది? ఆమె కథేంటి అనేది సస్పెన్స్. స్వాతి అద్భుతంగా నటించింది. నవీన్‌చంద్ర చేసిన పాత్ర అదనపు ఆకర్షణ. సప్తగిరి కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. హార్రర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెల 29న పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాజా, ఛాయాగ్రహణం: రవికుమార్ సానా, సంగీతం: కమ్రాన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement