
నా కూతురిది ముమ్మాటికీ హత్యే..
తన కూతురిది ముమ్మాటికీ హత్యేనని.. ఆత్మహత్య కాదని ఈనెల 4న అనుమానాస్పద స్థితిలో విషం తాగి మృతి చెందిన ...
మృతురాలు స్వాతి తండ్రి
ఉప్పల్: తన కూతురిది ముమ్మాటికీ హత్యేనని.. ఆత్మహత్య కాదని ఈనెల 4న అనుమానాస్పద స్థితిలో విషం తాగి మృతి చెందిన స్వాతి తండ్రి బండి చెన్నకేశవులు (60) ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడు నారాయణ (హోంగార్డు), అతడి ప్రియురాలితో కలిసి బలవంతంగా స్వాతితో విషం తాగించి హత్య చేసి ఉంటారన్నారు.
పురుగుల మందుల పేరు కూడా తెలియని తన కూతురు విషం కొని తాగడం అసాధ్యమన్నారు. పోలీసులు తన అల్లుడు నారాయణతో కుమ్మక్కై తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు తన అల్లుడు నారాయణను 4వ తేదీన అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడమే నిదర్శనమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.