తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు కనిపించని కష్టకాలంలో స్వాతి తన ఎంట్రీతో ఇండస్ట్రీకి పండగ తెచ్చింది!ఇప్పుడీ ‘పండగ’ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.పెళ్లయ్యాక వచ్చిన మొదటి సంక్రాంతి ఇది. ఈ పండగని స్వాతిఎలా సెలబ్రేట్ చేసుకోబోతోంది?పెళ్లి జీవితం ఎలా ఉంది?మన సినిమాకి మళ్లీ తెలుగు కళను తెస్తుందా?చదవండి.. ‘సాక్షి’కి స్వాతి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ.
మీ పెళ్లయ్యాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతి... స్పెషల్ ఏంటి?
స్వాతి: స్పెషల్ అంటే అమ్మానాన్న నా దగ్గరకు రావడమే. ప్రస్తుతం వికాస్ (స్వాతి భర్త)తో జకార్తాలోనే ఉంటున్నాను. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ ‘నా ఇల్లు’ చూడటానికి అమ్మానాన్న వచ్చారు. ఇంటిని ఎలా సెటప్ చేసుకున్నామో చూశారు. వాళ్లకు నా ఇంటిని చూపించడం హ్యాపీ. పండగ అంటే వాళ్లకు వండిపెట్టడమే స్పెషల్. హైదరాబాద్‌లో అంటే వంట చేసి పెట్టడానికి ఎవరో ఒకరుంటారు. ఇక్కడ నా పని నేనే చేసుకోవాలి.
కూతురి కొత్త ఇల్లు మీ పేరెంట్స్‌కి నచ్చిందా?
వాళ్లకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇల్లు ఇరుకు ఇరుకుగా ఉండదు. చాలా విశాలంగా ఉంటుంది. అలాగే ఇంటి ముందు ఖాళీ స్థలంలో పచ్చని చెట్లతో చాలా కూల్‌గా అనిపిస్తుంది. వాళ్లు చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నారు.
ఇంతకీ పండగకి కొత్త అల్లుడు తన అత్తమామలకు పెట్టిన డిమాండ్స్ ఏంటి?
వికాస్ వాళ్లది కేరళ. మనలా వాళ్లకు సంక్రాంతి పెద్ద పండగ కాదు. అందుకని పండగకు డిమాండ్ చేయాలని తనకు తెలియదు. కానీ మా ఆయనకు ఓ తెలుగు పైలట్ ఫ్రెండ్ ఉన్నారు. ‘నువ్వు కొత్త అల్లుడివి. పండగకు ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేయాలి’ అని ఆ ఫ్రెండ్ చెప్పారు. కానీ మా ఆయన అలాంటివేం పట్టించుకోడు. నవ్వేసి ఊరుకున్నాడు. చాలా సింపుల్ వ్యక్తి. అత్తింటివాళ్లతో బాగా కలిసిపోయాడు. మేం కంఫర్ట్‌బుల్‌గా ఉండాలనుకుంటాడు.
మరి మీ అమ్మావాళ్లు ఏమైనా తీసుకొచ్చారా?
అలాంటివేం లేదు. వాళ్లు తెస్తేనే అన్నట్లు లేదు కదా. మా పెళ్లయ్యాక అమ్మానాన్న మాతో ఎక్కువ రోజులు ఉండలేదు. ఇప్పుడు మెయిన్‌గా మాతో ఉండాలని వచ్చారు. ఇందాక ‘నా ఇల్లు చూడ్డానికి వచ్చారు’ అన్నాను. ఏదో మాటకి అలా అన్నాను కానీ ఇంకా ‘నా ఇల్లు.. మీ ఇల్లు’ అనే ఫీల్ రావడంలేదు.
ఇంతకీ వంట మనదేనా? వికాస్‌తో చేయిస్తున్నారా?
అఫ్‌కోర్స్ నాదే. తను అప్పుడప్పుడు చేయందిస్తాడు. చిన్నప్పటి నుంచి అన్ని దేశాలు తిరుగుతున్నాడు. అందుకని వంట నేర్చుకున్నాడు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ‘వంట రాదు’ అని ఒక వయసు తర్వాత చెప్పుకోవడానికి బాగోదు. వంట అనేది మన సర్వైవల్ కోసమే. వంట చేయడం, వేరే దేశంలోనో, రాష్ట్రంలోనో ఉండాలన్నప్పుడు అక్కడి భాష, డ్రైవింగ్... ఇలాంటివన్నీ నేర్చుకుంటే మన కే మంచిది. వికాస్‌కి వంట వచ్చు. కానీ నేను వంట చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ల కోసం చేయడం ఇంకా మజా వస్తుంది.
వికాస్ తెలుగు వంటలను ఇష్టపడతారా?
తనకి చికె¯Œ బిర్యానీ అంటే చాలా ఇష్టం. రీసెంట్‌గా చేశాను. వంట ఇక్కడికి వచ్చి నేర్చుకోవడమే. ఏదైనా డౌట్ వస్తే అమ్మకు ఫో¯Œ చేస్తా. ఇప్పుడు అమ్మ వాళ్లు మనం గరిటె తిప్పుతున్న స్టైల్ చూసి ఆశ్చర్యపోతున్నారు (నవ్వుతూ). ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు.. బయట మిమ్మల్ని ఇష్టపడేవాళ్లు ఉండే ఉంటారు. ఫైనల్లీ కేరళ అబ్బాయిని పెళ్లాడారు. ఎవరు ఎవర్ని పడేశారు?
నేను పడేయలేదు. నన్నే పడేశాడు. తెలుగువాళ్లు ‘కలర్స్ స్వాతి’, హీరోయి¯Œ అన్నట్లుగానే చూశారు తప్పితే నన్ను నన్నుగా చూడలేదు. నావైపు ఆశ్చర్యంగా చూసినవాళ్లే తప్ప మామూలుగా చూసినవాళ్లు లేరు. వాళ్లల్లో ఆ ఎగై్జట్‌మెంట్ చాలా క్లియర్‌గా కనిపించేది.
ఇక సినిమా తప్ప వేరే సంభాషణలే ఉండేవి కాదు. వికాస్ అలా కాదు. నేను పరిచయమైనప్పడు నన్ను ఓ మామూలు అమ్మాయిలానే చూశాడు. తన జాబ్ (పైలట్) అంటే తనకు చాలా ఇష్టం. సినిమాలు కూడా తక్కువగా చూసేవాడట. తన క్లాస్‌మేట్‌తో నేను రెండు తమిళ సినిమాల్లో యాక్ట్ చేశాను. అతని ద్వారానే మా ఫ్యామిలీకి వికాస్ పరిచయం. మేమేదో డేటింగ్ చేసుకొని పెళ్లి చేసుకోలేదు. యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ కాదు. అరేంజ్డ్ మ్యారేజ్. ఫిల్మ్ హీరోయిన్, గ్లామర్ ఇండస్ట్రీ అని అంతగా ఆశ్చర్యపడడు. అదీ ఓ ప్రొఫెష¯Œ అన్నట్టుగా చూస్తాడు. నాకది బాగా నచ్చింది.
సినిమాలకు బ్రేక్ అనుకోవచ్చా. వికాస్ బైబై చెప్పమన్నారా?
ఛా.. ఊర్కోండి (నవ్వుతూ). మనం 2019లోఉన్నాం. ఇంకా భార్యని ఉద్యోగం మానేయమని చెప్పే మగవాళ్లు ఉంటారనుకోను. ఉన్నా చాలా చాలా తక్కువ ఉండొచ్చు. వికాస్‌ది ఆ మెంటాలిటీ కాదు. తను చాలా దేశాలు ట్రావెల్ చేశాడు. బ్రాడ్‌మైండెడ్. నా ఫ్రెండ్స్ అందర్నీ కలిశాడు. హీరోయిన్లని, డైరెక్టర్లని పరిచయం చేసినప్పుడు ఎగై్జట్ అయిపోతాడని అనుకున్నాను. కానీ చాలా మామూలుగా మాట్లాడాడు. వేరే ప్రొఫెష వాళ్లను కలిశాం అనుకున్నాడు.
అలాంటి మెంటాలిటీ ఉన్నతను సినిమాలు మానేయమనడు.యాక్చువల్లీ ఏ సినిమాలోనూ మీరు గ్లామరస్‌గా కనిపించలేదు. కానీ ఇటీవల ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ సూట్‌లో కనిపించడం ఆశ్చర్యం అనిపించింది?బికినీ సీన్స్ చేయాలంటే ఎప్పుడో చేసేదాన్ని కదా. ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా వల్గర్‌గా అనిపించలేదు. తెలుగమ్మాయిలంటే సిమ్మింగ్ చేయరా? నేను ఎప్పటినుంచో స్విమ్మింగ్ చేస్తున్నాను. కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిని కదా... జాగ్రత్తగా ఉన్నాను. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయం. ఇప్పుడు పెళ్లి తర్వాత నాకు ఫ్రీడమ్ వచ్చినట్లనిపిస్తోంది.
అంటే.. స్విమ్మింగ్ పూల్ విజువల్స్‌కి వికాస్ ఏమీ అనలేదన్నమాట?
అవును. తను కూడా చూశాడు. పైగా ఆ ఇంటర్వ్యూ అప్పుడు ‘నీ నెక్స్›్ట సినిమా ఎప్పుడు?’ అని ఏడిపించాడు. ‘ఇంకేదైనా అడగొచ్చు కదా.. ఆ ప్రశ్న ఎందుకు అడిగావు’ అని ఆ తర్వాత అంటే, ‘స్వాతీ.. నీకు సినిమాలు చేయాలని ఉంటే నిన్ను నేను ఆపను. ఆ విషయం నీకు తెలియజేయడం కోసమే అలా అడిగాను’ అన్నాడు.
ఇంతకు ముందు మాట్లాడుతూ పెళ్లి తర్వాత ఫ్రీడమ్ వచ్చినట్లు ఉందన్నారు. అంటే.. అంతకు ముందు ఎలా ఉండేది?
ఇప్పుడు ఒకలాంటి నెమ్మదితనం, ఒకలాంటి ప్రశాంతత అనిపిస్తోంది. పెళ్లికి ముందు వరకు లైఫ్ అంతా హడావుడి. టీవీ షోలు, సినిమాలు అంటూ బిజీ. ఇప్పుడు ఆ హడావుడి నుంచి బయటకు వచ్చాను కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుంది. హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను. మనసంతా తేలికగా అనిపిస్తోంది. ఏదో విముక్తి లభించిన ఫీలింగ్. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నాను. పెళ్లయింది. మనకేం భయం లేదనే భరోసా. జనరల్‌గా చుట్టూ ఉన్నవాళ్లు పెళ్లంటే అదీ ఇదీ అని భయపెడతారు. కానీ నాకేం భయం లేదు. చక్కగా సెటిల్ అయ్యాను అనిపిస్తోంది. ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను.. కానీ ధైర్యంగా ఉంటున్నాను. ఆ ఫీలింగ్‌ని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనెలా ఉన్నా ఫర్వాలేదు అనిపిస్తోంది.
చాలా హ్యాపీగా ఉన్నారని అర్థమవుతోంది. అది సరే... మీ మాటల్లో వెటకారం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరి మీద సెటైర్లు వేస్తున్నారు?
సందర్భాన్ని బట్టి ఒకరిపై ఒకరం పంచ్‌లు వేసుకుంటాం. అందరం ఫన్ లవ్వింగే. అయితే వికాస్ చాలా కామ్‌గా ఉంటాడు. అయినా ఎప్పుడూ గడగడా మాట్లాడేవాళ్లది ఏం ఉండదు. అంతా తుస్సే. కామ్‌గా ఉండేవాళ్లు పంచ్‌లేస్తేనే ఇంకా నవ్వొస్తుంది. తక్కువ మాట్లాడేవాళ్లు ఎక్కువ గమనిస్తుంటారు. వాళ్లు వేసే జోక్స్ వర్కౌట్ అవుతాయి. వికాస్ పంచ్‌లన్నీ అలా వర్కౌట్ అవుతాయి. మా అత్తామామలు కూడా చాలా కూల్. మా విషయాల్లో ఎక్కువ తలదూర్చరు. అలాగని పూర్తిగా వదిలేయరు. వాళ్లి ద్దరూ కేరళలోనే ఉంటారు.
చిచ్చరపిడుగులా ఉండే స్వాతి పెళ్లయ్యాక ఏమైనా మారిందా? కొంచెం నెమ్మదస్తురాలైందా?
బాగా నెమ్మదితనం అయితే వచ్చింది. అది కూడా చాలా బావుంది. హడావుడి పడటం తగ్గింది. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పక్కవాళ్లు ఏం చేస్తారు? ఎవరేమంటారు? అనే టెన్ష¯Œ ఉండేది. ఇప్పుడా భయం లేదు. పెళ్లి చేసుకుని ఇక్కడికొచ్చాక నాకు చాలా టైమ్ దొరుకుతోంది. లైఫ్‌ని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నాను. ఒక్కో దశలో జీవితం ఒక్కోలా కొనసాగుతుంది. వాటి నుంచి నేర్చుకోవాలి. అన్నింటినీ తలుచుకుంటే జరిగిందంతా మంచికే అనే నమ్మకం వచ్చేసింది.
పైలట్ కాబట్టి వికాస్ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు. మీకు ఇంట్లో బోర్ అనిపించదా?
ఒక్కోసారి వారంలో నాలుగు రోజులు వెళ్లిపోతాడు. కొన్నిసార్లు పొద్దున్నే వెళ్లి ఈవెనింగ్ వచ్చేస్తాడు. ముందు నాకు అర్థం అయ్యేది కాదు. రెండు మూడు రోజులే కదా.. ఒక్కదాన్నే రిలాక్స్ అయిపోవచ్చు అనుకునేదాన్ని. కానీ మెల్లిగా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇంటిపట్టున ఉంటే బావుండు అనిపిస్తుంది. అంటే.. ఓన్లీ రొమాంటిక్ రీజన్స్ కోసమే కాదు. అలాగని రోజంతా కబుర్లు చెప్పుకుంటాం అని కాదు. ఇద్దరం కలిసి టీవీ చూస్తుంటాం. ఇష్టమైన ఇంకో మనిషి దగ్గర ఉంటే అదో ఆనందం.
అవునూ.. పెళ్లికి పెద్దగా ఎవర్నీ పిలవనట్లుంది?
చాలా క్లోజ్ సర్కిల్‌లో పెళ్లి చేసుకోవాలనిపించింది. అందుకని కొంతమందినే పిలిచాను. అందర్నీ పిలిస్తే వాళ్లకు వచ్చే వీలుండకపోవచ్చు. ఎవరి షూటింగ్స్‌తో వాళ్లు బిజీగా ఉంటారు. పైగా వచ్చాక వాళ్లకు అసౌకర్యంగా ఉండకూడదు. మన పెళ్లి మంటపాల్లో నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఇవన్నీ ఆలోచించుకుని సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాను. పెళ్లిని దాచేద్దాం అని కాదు. చేసుకున్న తర్వాత చెబుదాంలే అనుకున్నాను. మాకో క్లోజ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో పెళ్లి విషయం పెట్టాను. అది ఎవరో లీక్ చేశారు. అలా బయటకి వచ్చింది. ఎవర్నీ పిలవకూడదనే అభిప్రాయం అయితే లేదు. చిన్నగా చేసుకుందాం అని. కొందరైతే మీడియా వాళ్లను పిలవలేదని విమర్శించారు. కేవలం తక్కువమంది మధ్యలో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనే ఎవర్నీ పిలవలేదు.
ఫైనల్లీ మళ్లీ అడుగుతున్నాం.. సినిమాలకు దూరం అవ్వరు కదా?
నా వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. అవకాశాలు వస్తే యాక్ట్ చేస్తా. ఒక్కసారి యాక్టింగ్ చేసిన తర్వాత దాన్ని వదల్లేం.
మీ చిన్నప్పటి సంక్రాంతి గురించి?
గాలిపటాలంటే ఇష్టమే. కానీ నాకు ఎలా ఉండేదంటే మా అన్నయ్య, వాళ్ల ఫ్రెండ్స్ మా మేడ మీద ఎక్కువగా ఆడేవారు. వాళ్లందరికీ చిన్న సైజ్ అసిస్టెంట్‌ని నేను. కింద నుంచి తినడానికి ఏదైనా తీసుకురా. నీళ్లు అయిపోయాయి బాటిల్ తీసుకురా. ఇది పట్టుకో అంటూ ఆర్డర్లు. వాళ్లందరికీ నేనే అసిస్టెంట్‌ని. ఎప్పుడైనా ౖకైట్ ఇచ్చి ఎగరేయమన్నా కింద పడిపోయేది. ఎలా ఎగరేయాలో అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు వికాస్ గాలికి వ్యతిరేక దిశలో ఫ్లైట్ వెళ్లాలి అని చెబుతుంటే గాలిపటానిది కూడా సేమ్ కాన్సెప్ట్ కదా అనిపించింది. అప్పుడు అది తెలియక మా అన్నకు అసిస్టెంట్‌గా ఉండిపోయా
(నవ్వుతూ).
ఇంతకీ అమ్మానాన్న∙ఎప్పుడు అవ్వాలని?
అయ్య బాబోయ్. అప్పుడే? జీవితం అంటే చిన్న చిన్న ఆనందాలు కూడా ఉండాలని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నాకు పప్పుచారు టేస్ట్ సరిగ్గా కుదిరితే ఆ రోజంతా హ్యాపీగా అనిపిస్తోంది. మా ఇంటి ముందు ఉన్న చెట్టుకి పువ్వు పూచినా, గడ్డి మీద వాటర్ బబుల్స్ చూసినా పిచ్చ హ్యాపీగా ఉంటోంది. వేసవి కాలంలో మంచి మామిడి పండుని ఎలా ఆస్వాదిస్తామో ఇప్పుడు జీవితాన్ని నేనలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఫేజ్ చాలా బాగుంది. అలా అని ఈజీ అనడం లేదు. అనను కూడా. హైదరాబాద్‌లో ఉంటే వంట చేసేవాళ్లు, కారు డ్రైవ్ చేసేవాళ్లు ఉంటారు. అందుకే ఎక్కువ టైమ్ ఉన్నట్టు అనిపించేది. లేనిపోని ఆలోచనలు వచ్చేవి. ఇక్కడ ఆకలేస్తే నేనే లేవాలి, వండుకుని తినాలి. దాంట్లో వచ్చే ఆనందం బావుంది. ఇండిపెండెంట్‌గా
ఫీల్ అవుతున్నాను.
పెళ్లయిపోతే అంతే సంగతులని కొందరు అంటుంటారు.. మీరేమంటారు?
చాలా మంది అమ్మాయిలకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. మనం పెళ్లి మీద జోక్స్ చేస్తుంటాం. భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదర్ అని. కానీ అలా ఏం ఉండదు. మంచి మ్యారేజ్‌లో ఫ్రీడమ్ చాలా ఉంటుంది. కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది అనే హోప్ ఉంటుంది. నాకైతే నా మ్యారీడ్ లైఫ్ అలానే అనిపిస్తోంది. ఫ్రీడమ్ స్టార్ట్స్ విత్ ఏ గుడ్ రిలేష¯Œ షిప్. పెళ్లనేది స్వతంత్రానికి శుభం కార్డ్ మాత్రం కాదు. ఇంట్రడక్ష¯Œ సీనే అని నేనంటాను.
Comments
Please login to add a commentAdd a comment