నరేశ్‌ను చంపింది అక్కడ కాదా..?
► ఇంటి వద్దనే పట్టుకుని చంపి కాల్చేశారా.. లేక మరోచోట చంపి శవం దొరకకుండా చేశారా?
► నరేశ్, స్వాతి కేసులో కొత్త కోణాలు
సాక్షి, యాదాద్రి: కులాంతర వివాహం చేసుకున్న నరేశ్ హత్యపై కొత్త కోణాలు వెలుగు చూస్తు న్నాయి. నరేశ్ హత్యకు గురైతే, స్వాతి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, ఈ రెండు విషయాల్లో స్పష్టత లేదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. నరేశ్, స్వాతి హత్యల వెనుక శ్రీనివాస్‌రెడ్డి తోపాటు మరికొంత మంది పెద్దలు ఉన్నారని వారందరినీ గుర్తించి శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తన కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో నరేశ్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి హత్య చేశా డని పోలీసులు తెలిపారు.
నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మంగళవారం గ్రామంలో సందర్శిం చినప్పుడు పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. మే 2న ముంబై నుంచి వచ్చిన నరేశ్, స్వాతిని ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగిం చాడు. ఆ సమయంలో నరేశ్‌తో అతని సోదరి సెల్‌ఫోన్‌లో మాట్లాడినప్పుడు తాను ఎల్‌బీనగర్ వైపు వెళ్తున్నానని చెప్పాడు. 11 గంటల తర్వాత ఆ సెల్‌ఫోన్ పనిచేయలేదు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మాత్రం స్వాతి అంత్యక్రియలు నిర్వ హించిన ప్రాంతంలో నరేశ్ అంత్యక్రియలు జరగలేదని చెబుతున్నారు. నరేశ్‌ను ఇక్కడే కాల్చి చంపిన ఆధారాలు లేవని గ్రామస్తులంటున్నారు. పోలీసుల ప్రకారం నరేశ్‌ను శ్రీనివాస్‌రెడ్డి మరో వ్యక్తితో కలసి వాహనంపై తీసుకుపోయి తన వ్యవసాయ పొలంలో చంపి కాల్చివేసి బూడి దను మూసీలో కలిపాడని చెప్పారు.
ఇదంతా కట్టు కథ అని నరేశ్ శవం కూడా దొరకకుండా శ్రీనివాస్‌రెడ్డే మాయం చేశాడని కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నరేశ్ మరణం విషయం తెలిసినప్పటికీ చాలామంది భయంతో బయటకు చెప్పలేకపోయారని తెలుస్తోంది. దీంతో పాటు నరేశ్‌ను చంపేశామన్న సంతోషంలో రెండుసార్లు గ్రామంలో విందు భోజనాలు ఏర్పాటుచేశారు. నరేశ్‌ను నిజంగా ఇంటి వద్దనే పట్టుకుని చంపి కాల్చేశారా.. లేక మరోచోట చంపి శవం దొరక కుండా చేశారా? అన్నది తాజాగా చర్చనీ యాంశంగా మారింది. నరేశ్ మరణం విషయం తెలిసిన స్వాతి కోర్టులో నిజం చెబితే తనకు శిక్ష పడుతుందన్న భయంతోనే శ్రీనివాస్‌రెడ్డి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
కొనసాగుతున్న విచారణ
నరేష్, స్వాతి మరణాలపై ఆందోళన లు జరుగుతున్నందున రాచకొండ పోలీసు లు విచారణ ముమ్మరం చేశారు. సోమవా రం చౌటుప్పల్ ఏసీపీ స్నేహిత, రామన్నపేట సీఐ శ్రీనివాస్‌తో కలిసి స్వాతి తల్లి పద్మను ఆమె ఇంటిలో కలిసి విచారించారు. ఈ మొత్తం కేసులో స్వాతి తల్లిని ఇంతవరకు ఎవరూ ప్రశ్నించలేదు. మరోవైపు ఆత్మకూరు (ఎం) ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ను హైదరాబాద్‌కు పిలిపించి విచారించారు. ఈ కేసులో పోలీసులపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులు నిజనిజాలు తేల్చాలని విచారణ ముమ్మరం చేశారు. మరోవైపు శ్రీనివాస్‌రెడ్డిని రిమాండ్ నుంచి మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు చర్యలు ప్రారంభించారు.