naresh murder
-
వీడని నరేష్ కేసు మిస్టరీ
♦ బైక్ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు..? ♦ ఇప్పటికీ వివరాలు వెల్లడించని పోలీసులు సాక్షి, యాదాద్రి : కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేష్ హత్య కేసులో న్యాయం కోసం కుటుంబ సభ్యులు, అఖిలపక్ష ప్రజాసంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. నరేష్ హత్య వెనుక ఉన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నరేష్ హత్య జరిగిన రోజు అతన్ని వాహనంపై ఎక్కించుకునిపోయిన మరో యువకుడి ఆచూకీ ఇంత వరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. అలాగే నరేష్ హత్య అనంతరం అతడి శవాన్ని కాల్చి బూడిద చేసి మూసీలో కలిపిన అస్థికలకు సంబంధించిన నివేదిక ఇంకా బయటపెట్టలేదు. ఒక దశలో హత్యకు గురైంది నరేష్ అవునా.. కాదా..? అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోందని ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తానే నరేష్‌ను చంపానని స్వాతి తండ్రి పోలీసు విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే. నరేష్, స్వాతి ప్రేమ వివాహం అనంతరం ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఆత్మహత్య చేసుకోగా నరేష్ మిస్టరీని హత్యకు గురయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు మరణాల వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని సీబీఐ చేత విచారణ చేయించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నరేష్, స్వాతి మరణాల వెనుక స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరి హస్తం ఉందని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్, స్వాతిలు మే 2న ముంబాయి నుంచి భువనగిరికి వచ్చారు. అదే రోజు నరేష్ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తమ కుమారుడు కనిపించకుండాపోయాడని మే 5న భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 6వ తేదిన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నరేష్ హత్య అనంతరం నిజనిర్ధారణ కమిటీ గ్రామానికి చేరుకుని పలు అంశాలను సేకరించారు. ఆత్మహత్య చేసుకున్న స్వాతి అంత్యక్రియలు జరిగిన చోట నరేష్ అంత్యక్రియలు జరిగిన ఆనవాళ్లు లేవని నిజనిర్ధారణ కమిటీ తేల్చలేదు. కనీసం శవం కూడా దొరక్కకుండా చేశారని ఆరోపించారు. బైక్‌పై పల్లెర్లకు... నరేష్, స్వాతిని భువనగిరి బస్టాండ్‌లో ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించిన అనంతరం మరో వ్యక్తితో కలిసి బైక్‌పై నరేష్ పల్లెర్ల గ్రామానికి వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. అయితే నరేష్‌ను వాహనంపై తీసుకుపోయింది ఎవరన్నది ఇంత వరకు తేలలేదు. మే 2న నరేష్ సోదరి సెల్ఫోన్లో మాట్లాడినప్పుడు అతను ఎల్బీనగర్ వెళ్తున్నట్లు నరేష్ చెప్పాడు. రాత్రి 11 గంటల తర్వాత ఫోన్ పనిచేయకపోవడంతో నరేష్ కుటుంబ సభ్యుల్లో అనుమానం పెరిగింది. మరో వైపు పోలీసులు సేకరించిన ఆధారాల వివరాలు వెల్లడించాలని నరేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నరేష్‌ను హత్య చేశారా లేక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హత్య కథనం సృష్టించారా అన్నది తేల్చాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు కులసంఘాలు, ప్రజాసంఘాలు సీఎంను కలిసే ఆలోచనలో ఉన్నాయి. కేసు ఇలా... మే 2న ముంబాయి నుంచి భువనగిరికి వచ్చారు. అదే రోజు స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి నరేష్, స్వాతిని అప్పగించారు. ఆ రోజు నుంచి నరేష్ కనిపించకుండాపోయాడు. మే 5న తన కుమారుడు కనిపించడం లేదని నరేష్ తండ్రి వెంకటయ్య భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 6న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 16వ తేదీన స్వాతి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. మే 27న ఎల్బీనగర్ పోలీసుల విచారణలో నరేష్‌ను తానే హత్య చేశానని స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. కేసు నమోదు చేశారు. మే 30న నిజనిర్ధారణ కమిటీ నరేష్, స్వాతిల స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలను సందర్శించి హత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. జూన్ 9న భువనగిరిలో నరేష్ హంతకులను శిక్షించాలని అఖిలపక్షాల సమావేశం జరిగింది. మే 12న సీఎంను కలవాలని అఖిలపక్ష ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు ప్రయత్నించి విఫలమయ్యారు. జూన్ 16న సీఎస్‌ను కలిశారు. జూన్ 22న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసి నరేష్, స్వాతి హత్యోదంతంలో నిజనిజాలు తేల్చాలని విజ్ఞప్తి చేశారు -
నరేశ్‌ను చంపింది అక్కడ కాదా..?
► ఇంటి వద్దనే పట్టుకుని చంపి కాల్చేశారా.. లేక మరోచోట చంపి శవం దొరకకుండా చేశారా? ► నరేశ్, స్వాతి కేసులో కొత్త కోణాలు సాక్షి, యాదాద్రి: కులాంతర వివాహం చేసుకున్న నరేశ్ హత్యపై కొత్త కోణాలు వెలుగు చూస్తు న్నాయి. నరేశ్ హత్యకు గురైతే, స్వాతి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, ఈ రెండు విషయాల్లో స్పష్టత లేదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. నరేశ్, స్వాతి హత్యల వెనుక శ్రీనివాస్‌రెడ్డి తోపాటు మరికొంత మంది పెద్దలు ఉన్నారని వారందరినీ గుర్తించి శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తన కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో నరేశ్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి హత్య చేశా డని పోలీసులు తెలిపారు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మంగళవారం గ్రామంలో సందర్శిం చినప్పుడు పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. మే 2న ముంబై నుంచి వచ్చిన నరేశ్, స్వాతిని ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగిం చాడు. ఆ సమయంలో నరేశ్‌తో అతని సోదరి సెల్ఫోన్లో మాట్లాడినప్పుడు తాను ఎల్బీనగర్ వైపు వెళ్తున్నానని చెప్పాడు. 11 గంటల తర్వాత ఆ సెల్‌ఫోన్ పనిచేయలేదు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మాత్రం స్వాతి అంత్యక్రియలు నిర్వ హించిన ప్రాంతంలో నరేశ్ అంత్యక్రియలు జరగలేదని చెబుతున్నారు. నరేశ్‌ను ఇక్కడే కాల్చి చంపిన ఆధారాలు లేవని గ్రామస్తులంటున్నారు. పోలీసుల ప్రకారం నరేశ్‌ను శ్రీనివాస్‌రెడ్డి మరో వ్యక్తితో కలసి వాహనంపై తీసుకుపోయి తన వ్యవసాయ పొలంలో చంపి కాల్చివేసి బూడి దను మూసీలో కలిపాడని చెప్పారు. ఇదంతా కట్టు కథ అని నరేశ్ శవం కూడా దొరకకుండా శ్రీనివాస్‌రెడ్డే మాయం చేశాడని కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నరేశ్ మరణం విషయం తెలిసినప్పటికీ చాలామంది భయంతో బయటకు చెప్పలేకపోయారని తెలుస్తోంది. దీంతో పాటు నరేశ్‌ను చంపేశామన్న సంతోషంలో రెండుసార్లు గ్రామంలో విందు భోజనాలు ఏర్పాటుచేశారు. నరేశ్‌ను నిజంగా ఇంటి వద్దనే పట్టుకుని చంపి కాల్చేశారా.. లేక మరోచోట చంపి శవం దొరక కుండా చేశారా? అన్నది తాజాగా చర్చనీ యాంశంగా మారింది. నరేశ్ మరణం విషయం తెలిసిన స్వాతి కోర్టులో నిజం చెబితే తనకు శిక్ష పడుతుందన్న భయంతోనే శ్రీనివాస్‌రెడ్డి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. కొనసాగుతున్న విచారణ నరేష్, స్వాతి మరణాలపై ఆందోళన లు జరుగుతున్నందున రాచకొండ పోలీసు లు విచారణ ముమ్మరం చేశారు. సోమవా రం చౌటుప్పల్ ఏసీపీ స్నేహిత, రామన్నపేట సీఐ శ్రీనివాస్‌తో కలిసి స్వాతి తల్లి పద్మను ఆమె ఇంటిలో కలిసి విచారించారు. ఈ మొత్తం కేసులో స్వాతి తల్లిని ఇంతవరకు ఎవరూ ప్రశ్నించలేదు. మరోవైపు ఆత్మకూరు (ఎం) ఎస్ఐ శివనాగప్రసాద్‌ను హైదరాబాద్‌కు పిలిపించి విచారించారు. ఈ కేసులో పోలీసులపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులు నిజనిజాలు తేల్చాలని విచారణ ముమ్మరం చేశారు. మరోవైపు శ్రీనివాస్‌రెడ్డిని రిమాండ్ నుంచి మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు చర్యలు ప్రారంభించారు. -
ముంబై నుంచి వెంటనే రావాలి
స్వాతితో ఫోన్లో ఎస్సై.. సాక్షి, యాదాద్రి: నరేశ్ హత్య ఉదంతంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మకూరు(ఎం) ఎస్సై శివనాగ ప్రసాద్.. స్వాతితో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆదివారం వాట్సాప్‌లో వైరల్ అయింది. నరేశ్‌ను హత్య చేశానని స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఒప్పుకున్న తర్వాత ఇది వెలుగు చూసింది. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకూరు (ఎం) పోలీస్‌స్టేషన్‌లో ‘మిస్సింగ్’ కేసు పెట్టారు. దీంతో ఎస్సై శివనాగప్రసాద్.. నరేశ్ చిన్నాన్నతోపాటు మరికొందరిని స్టేషన్‌కు తెచ్చి స్వాతితో మాట్లాడారు. ‘ మీరు రావాల్సిందే లేకపోతే వీళ్ల పని ఇక్కడ అయితది. భువనగిరిలో డీఎస్పీ ఆఫీస్ ఉంటది. నువ్వు డైరెక్ట్‌గా ఆడికి వచ్చి ‘మేం బతికే ఉన్నాం సార్..’ అని చెప్పి అట్నుంచి అటే వెళ్లొచ్చు. లేదంటే ఇక్కడ వీళ్లకు ఇబ్బంది అవుతుంది’’ అని అన్నారు. -
నరేష్-స్వాతిని ఎందుకు రప్పించారు?
హైదరాబాద్ : దారుణ హత్యకు గురైన నరేష్ కేసులో పోలీసులు వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోందని మృతుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేష్-స్వామిలను ముంబై నుంచి పిలిపించడం వెనుక పోలీసుల పాత్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. భువనగిరి పోలీసులే ఈ ఘోరానికి కారకులని, డీసీపీ రామచంద్రయ్య ఈ కేసులో ప్రేక్షక పాత్ర పోషించారని నరేష్ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. స్వాతి తండ్రే నరేష్‌ను చంపి ఉంటాడని తాము ముందు నుంచీ చెప్తున్నామని, అయితే కేసును పక్కదోవ పట్టించడానికి స్వాతిని కూడా తండ్రే హత్య చేశాడన్నారు. ఇద్దరి ప్రాణాలు తీసిన స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. కాగా పోలీసులు వ్యవహారశైలిపై ఇప్పటికే నరేష్ తల్లిదండ్రులు హైకోర్టుతో పాటు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. మేజర్ల వివాహంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారని, పెళ్లయిన వారానికే నరేష్-స్వాతిలను ఇక్కడకు ఎందుకు రప్పించారని, మళ్లీ రెండోసారి రప్పించడంలో పోలీసుల పాత్ర ఏంటని నరేష్ బంధువులు ప్రశ్నిస్తున్నారు. తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి! భువనగిరి పోలీసుల పాత్రపై విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ దారుణానికి భువనగిరి పోలీసులు బాధ్యులు కారా? అని ప్రశ్నలు సంధించారు. తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్‌ను పరువు కోసం హతమార్చినట్లు స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. -
తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి!
-
తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి!
తన భార్య కోసం వచ్చి.. మామ చేతిలో హత్యకు గురైన నరేష్ కేసు పలు మలుపులు తిరిగింది. పుట్టింట్లో ఉన్న తన భార్యను కలుసుకోడానికి వచ్చిన నరేష్.. అనుకోకుండా మామ శ్రీనివాసరెడ్డి కంట్లో పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. తమ ఇంటి దగ్గర తచ్చాడుతున్న నరేష్‌ను చూసిన శ్రీనివాసరెడ్డి.. అతడిని తమ పొలానికి తీసుకెళ్లి తల వెనుక భాగంలో ఇనుప రాడ్‌తో ఒక్కటే దెబ్బ కొట్టాడని, దాంతో నరేష్ అక్కడికక్కడే మరణించాడని ఆయన తెలిపారు. ముందు ఎలాగోలా శవాన్ని తగలబెట్టేద్దామని అనుకున్నా తర్వాత పెట్రోలు తీసుకొచ్చి శవానికి పైన, కింద కూడా టైర్లు పెట్టి పూర్తిగా కాలిపోయేలా చూశారన్నారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి... నరేష్ అదృశ్యంపై అతడి తండ్రి వెంకటయ్య కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాకలు చేయడంతో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు విచారణ ప్రారంభించామని, ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావును దర్యాప్తు అధికారిగా నియమించామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. జాయింట్ సీపీ తరుణ్ జోషి నేతృత్వంలో వేర్వేరు బృందాలను రూపొందించి ముంబై, షోలాపూర్ తదితర ప్రాంతాలకు పంపినట్లు చెప్పారు. నరేష్ సొంత ఊరు పల్లెర్ల, శ్రీనివాసరెడ్డి ఊరు లింగరాజపల్లి తదితర ప్రాంతాల్లో విచారణ జరిపినట్లు తెలిపారు. ముందు నుంచి శ్రీనివాసరెడ్డి మీద అనుమానం ఉండటంతో ఆయనను పిలిపించి, డీసీపీ ఆధ్వర్యంలో ఎస్ఓటీ బృందం విచారించిందన్నారు. చివరకు శ్రీనివాసరెడ్డి నుంచి నిజాన్ని రాబట్టామని తెలిపారు. మే రెండో తేదీన శ్రీనివాసరెడ్డి, స్వాతి పిన్నికొడుకు సత్తిరెడ్డి కలిసి తమ వద్ద ఉన్న వ్యాగన్ ఆర్ కారులో స్వాతిని లింగరాజపల్లికి తీసుకెళ్లారని, అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో తమ ఇంటి దగ్గర ఒక మోటార్ సైకిల్ తచ్చాడుతుండటంతో అది చూసి శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చారని సీపీ చెప్పారు. తమ వద్ద ఉన్న హోండా బైకును శ్రీనివాసరెడ్డి డ్రైవ్ చేస్తుండగా, సత్తిరెడ్డి వెనకాల కూర్చుని వెళ్లారని, అర కిలోమీటరు దూరంలో వాళ్లకు నరేష్ కనిపించడంతో అతడిని మధ్యలో కూర్చోబెట్టుకుని తమ పొలానికి తీసుకెళ్లారని వివరించారు. అక్కడ నరేష్‌తో సత్తిరెడ్డి మాట్లాడుతూ ఉండగా శ్రీనివాసరెడ్డి వెనక నుంచి రాడ్‌తో తల వెనక భాగంలో ఒకే దెబ్బ కొట్టాడని, దాంతో నరేష్ అక్కడికక్కడే మరణించాడని చెప్పారు. అక్కడే శవాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించగా, అది పూర్తిగా కాలలేదని, దాంతో ఆత్మకూరు వెళ్లి అక్కడ 5 లీటర్ల పెట్రోలును క్యానులో కొనుక్కుని తీసుకొచ్చి శవానికి పైన, కింద కొన్ని టైర్లు పెట్టి, పెట్రోలు పోసి శవాన్ని తగలబెట్టారని ఆయన తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ బోడుప్పల్ బాలాజీ హిల్స్ ప్రాంతంలో ఉన్న తన ఇంటికి నరేష్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని సత్తిరెడ్డి వచ్చాడన్నారు. మర్నాడు.. అంటే మూడోతేదీ ఉదయం శ్రీనివాసరెడ్డి వచ్చి అస్థికలను ఒక గోనెసంచిలో సేకరించి, మూసీ నదిలో కలిపేశారని చెప్పారు. మొత్తం హత్య, దానికి సంబంధించిన ఆధారాలను మాయం చేయడం అన్నీ మే 2, 3 తేదీలలో జరిగాయన్నారు. శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డి ఇద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించగా ఇద్దరూ ఇవే విషయాలు చెప్పారని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే.. ఈనెల 16వ తేదీన స్వాతి ఆత్మహత్య చేసుకుందని, అయితే ఆమె తీసుకుందని చెబుతున్న సెల్ఫీ వీడియోపై అనుమానాలు ఉండటంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని సీపీ చెప్పారు. భువనగిరి నుంచి ఒక విలేకరి తమ ఇంటికి వచ్చి ఆమెను అసభ్యంగా ప్రశ్నించడంతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయిందని అంటున్నారని తెలిపారు. అయితే అసలు ఈ కేసులో విషయాలన్నీ చాలా నాటకీయంగా ఉన్నాయని, దర్యాప్తులో కూడా తమకు చాలా సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. పెళ్లయిన తర్వాత ముంబైలోని వర్లి పోలీసు స్టేషన్లో స్వాతి, నరేష్ ఇద్దరూ కలిసి వెళ్లి తమకు స్వాతి తండ్రి నుంచి ముప్పు ఉందని స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత స్వాతి మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి తన పరిస్థితి ఏమీ బాగోలేదని, తన సెల్ఫోన్లో బ్యాలెన్స్ వేయించాలని అడిగిందని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. తాను రెండుమూడు సార్లు అలా బ్యాలెన్స్ వేయించినట్లు శ్రీనివాసరెడ్డి చెప్పారన్నారు. నరేష్ సోదరి షోలాపూర్‌లో ఉంటారని, ఆమెతో కూడా శ్రీనివాసరెడ్డి టచ్‌లో ఉన్నారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
స్వాతిది ఆత్మహత్యా.. హత్యా?
-
స్వాతిది ఆత్మహత్యా.. హత్యా?
ప్రేమజంట స్వాతి- నరేష్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో సరికొత్త అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఈనెల ఒకటో తేదీ నుంచే నరేష్ కనిపించడం లేదు. ఆ తర్వాత.. దాదాపు పది రోజుల క్రితం స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. నరేష్ గురించి కూడా చాలా కాలం పాటు అసలు ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియలేదు. ఎట్టకేలకు అతడిని హతమార్చినట్లు తెలియడంతో ఒక్కసారిగా అంతా నివ్వెరపోయారు. దాంతోపాటే అసలు స్వాతి కూడా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఆమెను సైతం హతమార్చారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంబోజు నరేష్ అదృశ్యం అయిన సుమారు 15 రోజుల తర్వాత స్వాతి మరణించింది. ఇద్దరికీ పెళ్లి చేస్తామని పిలిపించడంతో ఆమె నమ్మకంగా ఇంటికి వచ్చింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఇప్పుడు నరేష్ హత్యకు గురైనట్లు తేలడంతో.. స్వాతి మరణం కూడా సహజమా, అసహజమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నరేష్ మరణించిన విషయం స్వాతికి తెలిసి ఉంటుందని, దానిపై ఆమె గొడవ చేయడంతో విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని ఆమెను కూడా చంపేసి ఉండొచ్చని స్థానికులు గట్టిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం మీద కూడా మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన హత్యలతో పాటు ఇప్పుడు సంభవించిన ఈ రెండు మరణాల మీద కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.