కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను అత్తవారింటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన తల్లిదండ్రులపై మేడిపల్లి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను అత్తవారింటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన తల్లిదండ్రులపై మేడిపల్లి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా హనుమంతల గూడెంకు చెందిన స్వాతి(19), సూరోజ్ భీష్మాచారి(28) ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం సంతోష్‌నగర్‌లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. భీష్మాచారి నారాయణగూడలోని విజయా డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. భీష్మాచారి డ్యూటీకి వెళ్లిన తరువాత స్వాతి తల్లిదండ్రులు అలివేలు, సైదిరెడ్డి వచ్చి స్వాతిని బలవంతంగా తీసుకెళ్లారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న భీష్మాచారి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.