కిరాణ షాపుకు వెళ్లిన ఓ యువతి అదృశ్యం అయింది.
కిరాణ షాపుకు వెళ్లిన ఓ యువతి అదృశ్యం అయింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాటేదాన్ బాబుల్‌రెడ్డినగర్ ప్రాంతానికి చెందిన పి.అంజమ్మ కుమార్తె స్వాతి(19). అదే ప్రాంతంలోని నానమ్మ ఇంటికి శనివారం మధ్యాహ్నం వెళ్లింది. అక్కడి నుంచి కిరాణా షాపుకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన స్వాతి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.