వైభవోపేతం..స్వాతి ఉత్సవం
ఆళ్లగడ్డ: శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రమన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం అహోబిలంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజలనంతరం ఉత్సవమూర్తులను శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి అహోబిలం మఠం ప్రతినిధి సంపత్ ఆధ్వర్యంలో అభిషేకం జరిపారు. అర్చన, తిరుమంజనం అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నావనారసింహ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.