వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు హీరోహీరోయిన్లుగా అంజిరామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమా టైటిల్, పోస్టర్‌ను చిత్ర నిర్మాత ఎమ్. సుధాకర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ‘‘చదువుకునే టైమ్‌లోనే సినిమా తీయాలనే కల ఉండేది. మంచి టీమ్‌తో ‘నీతోనే నేను’ తీశాను’’ అన్నారు ఎమ్. సుధాకర్ రెడ్డి. ‘‘ఈ సినిమా కోసం టీమ్ ప్రాణం పెట్టి పని చేశారు’’ అన్నారు అంజిరామ్. ‘‘ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది’’ అన్నారు వికాస్. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ నవీన్, కెమెరామేన్ మురళీ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి. కడగండ్ల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment