బిగ్‌బాస్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన చిత్రం లక్కీ లక్ష్మణ్. మోక్ష కథానాయికగా నటించింది. ఎఆర్ అభి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సోహైల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. థియేటర్‌లో సినిమా చూడటం మిస్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూసేస్తామని కామెంట్లు చేస్తున్నారు.
కథేంటంటే..
లక్ష్మణ్(సోహైల్) మధ్య తరగతి యువకుడు. చిన్నప్పటి నుంచి ఏదడిగినా డబ్బులు లేవని చెప్పే తండ్రిపై కోపం పెంచుకుంటాడు. అమ్మాయిలకు దూరంగా ఉంటూ బుద్ధిగా చదువుకుంటాడు. అయితే బీటెక్‌లో చేరిన తొలిరోజే శ్రేయ(మోక్ష) పరిచయం అవుతుంది. పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆమె ధనవంతురాలు కావడంతో లక్కీకి కావాల్సినవన్నీ ఇస్తుంది. ఓ విషయంలో వీరు బ్రేకప్ చెప్పుకుంటారు. తర్వాత లక్ష్మణ్ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడు. కట్ చేస్తే ఓరోజు స్టోర్ మేనేజర్‌లో పని చేస్తున్న శ్రేయను చూసి లక్కీ షాకవుతాడు. అసలు వీరికి బ్రేకప్ ఎందుకైంది? ధనవంతురాలైన శ్రేయ స్టోర్ మేనేజర్‌గా ఎందుకు పని చేస్తుంది? లక్ష్మణ్ కోసం తండ్రి చేసిన త్యాగం ఏంటి? తండ్రి విలువను హీరో ఎప్పుడు తెలుసుకుంటాడు? అనేదే కథ.
Comments
Please login to add a commentAdd a comment