Lucky Lakshman Movie
-
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన లక్కీ లక్ష్మణ్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన చిత్రం లక్కీ లక్ష్మణ్. మోక్ష కథానాయికగా నటించింది. ఎఆర్ అభి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సోహైల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూసేస్తామని కామెంట్లు చేస్తున్నారు. కథేంటంటే.. లక్ష్మణ్(సోహైల్) మధ్య తరగతి యువకుడు. చిన్నప్పటి నుంచి ఏదడిగినా డబ్బులు లేవని చెప్పే తండ్రిపై కోపం పెంచుకుంటాడు. అమ్మాయిలకు దూరంగా ఉంటూ బుద్ధిగా చదువుకుంటాడు. అయితే బీటెక్‌లో చేరిన తొలిరోజే శ్రేయ(మోక్ష) పరిచయం అవుతుంది. పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆమె ధనవంతురాలు కావడంతో లక్కీకి కావాల్సినవన్నీ ఇస్తుంది. ఓ విషయంలో వీరు బ్రేకప్ చెప్పుకుంటారు. తర్వాత లక్ష్మణ్ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడు. కట్ చేస్తే ఓరోజు స్టోర్ మేనేజర్లో పని చేస్తున్న శ్రేయను చూసి లక్కీ షాకవుతాడు. అసలు వీరికి బ్రేకప్ ఎందుకైంది? ధనవంతురాలైన శ్రేయ స్టోర్ మేనేజర్‌గా ఎందుకు పని చేస్తుంది? లక్ష్మణ్ కోసం తండ్రి చేసిన త్యాగం ఏంటి? తండ్రి విలువను హీరో ఎప్పుడు తెలుసుకుంటాడు? అనేదే కథ. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: కొడుకే నా భర్తను హత్య చేసి ఆ నింద నాపై వేశాడు -
‘లక్కీ లక్ష్మణ్’ మూవీ రివ్యూ
టైటిల్: లక్కీ లక్ష్మణ్ నటీనటులు: సయ్యద్ సోహైల్, మోక్ష, దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని తదితరులు నిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత: హరిత గోగినేని కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.అభి సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: ఐ.అండ్రూ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేది: డిసెంబర్ 30, 2022 బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. నేడు(డిసెంబర్ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. లక్ష్మణ్(సోహైల్) ఓ మధ్య తరగతి యువకుడు. చిన్నప్పటి నుంచి తండ్రి(దేవీ ప్రసాద్) ఏది అడిగినా..డబ్బులు లేవని చెబుతాడు. దీంతో తండ్రిపై లక్ష్మణ్‌కు కోపం ఏర్పడుతుంది. పెద్దయ్యాక తన తండ్రిలాగా ఉండొద్దని, చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన విలాసవంతమైన జీవితం అనుభవించాలనుకుంటాడు. అందుకే అమ్మాయిలకు దూరంగా ఉంటూ బుద్దిగా చదువుకుంటాడు. అయితే బీటెక్‌లో చేరిన తొలి రోజే అతనికి శ్రేయ(మోక్ష) పరిచయం అవుతుంది. ఆమె బాగా ధనవంతురాలు. అయినా ఆ పొగరు ఎక్కడా చూపించదు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి..అది కాస్త ప్రేమగా మారుతుంది. లక్ష్మణ్ కుటుంబ నేపథ్యం తెలుకున్న శ్రేయ.. అతనికి కావాల్సినవన్నీ ఇస్తుంది. లక్ష్మణ్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఒక్కడే ఓ అపార్ట్మెంట్లో ఉంటాడు. ఓ విషయంలో శ్రేయ, లక్ష్మణ్ మధ్య గొడవ జరిగి బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ తర్వాత లక్ష్మణ్ ఓ మ్యారేజ్ బ్యూరో స్టార్ చేసి నాలుగేళ్లలో బాగా డబ్బులు సంపాదిస్తాడు. కట్ చేస్తే.. ఓ రోజు ఒక స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రేయను చూసి లక్ష్మణ్ షాకవుతాడు. బాగా డబ్బులున్న శ్రేయ స్టోర్ మేనేజర్‌గా ఎందుకు ఉద్యోగం చేస్తుంది? లక్ష్మణ్, శ్రేయల బ్రేకప్‌కి కారణం ఏంటి? ఒకప్పుడు మంచి ఇల్లు.. ఆస్తులు ఉన్న లక్ష్మణ్ తల్లిదండ్రులు ఇప్పుడు ఎందుకు అద్దె ఇంట్లో ఉన్నారు? లక్ష్మణ్ కోసం తండ్రి చేసిన త్యాగం ఏంటి? పేరెంట్స్ విలువను లక్ష్మణ్ ఎప్పుడు తెలుసుకున్నాడు? చివరకు శ్రేయ, లక్ష్మణ్‌లు మళ్లీ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘డబ్బులు ఉంటే చాలు.. అన్ని వచ్చేస్తాయి. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత సుఖంగా బతుకుతాం’అని చాలా మంది భావిస్తారు. అలా అనుకున్న ఓ యువకుడి కథే ఈ ‘లక్కీ లక్ష్మణ్’. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు.. అమ్మాయి ప్రేమ ... ఏదీ తక్కువ కాదు. అలాంటి వాటి కంటే డబ్బు గొప్పది కాదనే ఓ మంచి సందేశాన్ని అందించిన సినిమా ఇది. దర్శకనిర్మాతలు కమర్షియల్‌గా ఆలోచించకుండా ఓ మంచి సందేశాన్ని అందించారు. ఈ విషయంలో వారిని మెచ్చుకోవాల్సిందే. అయితే ఈ మూవీ కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కాలేజీ నేపథ్యం.. ప్రేమ.. బ్రేకప్ ఇలా ప్రతీది గత సినిమాలలో చూసిన సన్నివేశాలే. కొన్ని చోట్ల లాజిక్ లేకుండా కొన్ని సీన్స్ వచ్చిపోతుంటాయి. మధుతో లక్ష్మణ్ ఫోన్ కాల్ సీన్ నవ్విస్తుంది. ఇంటర్వెల్ వరకూ రొటీన్‌గా సాగే ఈ కథ.. సెకండాఫ్ నుంచి టర్న్ తీసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఫస్టాఫ్‌కు సెకండాఫ్‌కు సంబంధమే లేదన్నట్లుగా కథనం సాగుతుంది. లక్ష్మణ్ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేయడం.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి జరిపించడం..బాగా డబ్బులు సంపాదించన తర్వాత పెరెంట్స్ విలువ తెలుకొవడం..ఇలా సెకండాఫ్ సాగుతుంది. క్లైమాక్స్‌కు 20 నిమిషాల ముందు ప్రేక్షలు కథలో లీనం అవుతారు. క్లైమాక్స్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో సోహైల్ నటన సింప్లీ సూపర్బ్. లక్ష్మణ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. శ్రీ పాత్రకు మోక్ష న్యాయం చేసింది. కాలేజీ సీన్స్‌లో తెరపై అందంగా కనిపిస్తుంది. హీరో తండ్రి స్నేహితుడిగా కాబందరి ఒకే ఒక సీన్లో కనిపిస్తాడు. కానీ అతను చెప్పే సంభాషణలు అలా గుర్తిండిపోతాయి. ఇక హీరో తండ్రిగా దేవి ప్రసాద్ తన పాత్రకు న్యాయం చేశాడు. హీరో స్నేహితులు కిరణ్, చరణ్ పాత్రలు పోషించిన వారి నటన, కామెడీ బాగుంది. ఎమ్మెల్యేగా రాజా రవీంద్ర, కాలేజీ స్టూడెంట్‌గా యాదమ్మ రాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనూబ్ రూబెన్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ ఐ.అండ్రూ పనితీరు బాగుంది. నిర్మాత హరిత గోగినేని ఖర్చుకు వెనకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించారు. -
లక్కీ లక్ష్మణ్ మూవీ పబ్లిక్ టాక్
-
‘ఇచ్చిపడేస్తా కొడకల్లారా’ అంటే లక్షా ఇరవై వేల వ్యూస్, 700 కామెంట్స్: సోహైల్
‘‘ఇండస్ట్రీలో అందరిలానే మేం కూడా మంచి హిట్ సాధించాలనే ‘లక్కీ లక్ష్మణ్’ తీశాం. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అయితే మా సినిమా ప్రివ్యూ చూసిన ఓ సీనియర్ నిర్మాత ‘సోహైల్ నువ్వు సేఫ్’ అన్నారు.. ఆ మాట చాలనిపించింది’’ అని సయ్యద్ సోహైల్ అన్నారు. ఏఆర్ అభి దర్శకత్వంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా తెరకెక్కిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. హరిత గోగినేని నిర్మించిన ఈ సినిమా నేడు(డిసెంబర్ 30) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ – ‘‘బిగ్‌బాస్’ షో తర్వాత నేను కమిట్ అయిన తొలి చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఇంకా రిలీజ్ కాకపోవడంతో డిప్రెషన్‌కి లోనయ్యాను. ఆ తర్వాత ‘బూట్‌కట్ బాలరాజు’, ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాలు చేశాను. అయితే ‘లక్కీ లక్ష్మణ్’ ముందు విడుదలవుతోంది. ఫ్యామిలీతో సహా యూత్‌కు నచ్చే అందమైన ప్రేమకథ ఇది. మన లైఫ్‌లో కష్టంతో పాటు అదృష్టం కూడా కావాలి. నేను సినిమాల్లోకి వెళతానన్నప్పుడు మా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎవరూ నన్ను సపోర్ట్ చేయలేదు. కానీ, మా నాన్న సలీం మాత్రం నాపై నమ్మకంతో వెళ్లమన్నారు. హైదరాబాద్ వచ్చాక సీరియల్స్‌లో నటిస్తూ నెలకు 40 వేలు సంపాదించేవాణ్ణి. అందులో సగం ఇంటికి పంపేవాణ్ణి. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ చాన్స్ వచ్చింది.. ఆ షో తర్వాత సినిమా చాన్స్‌లు వస్తున్నాయి. అభిగారు ‘లక్కీ లక్ష్మణ్’ని బాగా తీశారు. మా నిర్మాత హరితగారు సినిమాపై నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’లో హీరోగా నన్ను తీసుకోవద్దని కొందరు చెప్పినా నాకే అవకాశం ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డిగారి మేలు ఎప్పటికీ మరచిపోలేను. వ్యక్తిగతంగా ‘సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్’ పేరుతో నాతో పాటు 30 మంది స్నేహితులు కలిసి సాయం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురికి గుండె ఆపరేషన్ చేయించాం. ఏడు కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. 10 మంది పిల్లల విద్యకి సాయం చేస్తున్నాం. ఇప్పుడు నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి’’ అన్నారు. ‘ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కొంత మంది నెగటివ్‌గా తీసుకుంటున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో మా ఇంట్లోని వాళ్లను కూడా తిడుతున్నారు.. అందుకే నేను రియాక్ట్ అయ్యాను. అలా అవటం సమస్య అవుతోంది. ‘నా సక్సెస్‌కు మా నాన్నే కారణం’ అని ప్రీ రిలీజ్లో మాట్లాడిన ΄పాజిటివ్ వార్తకి కేవలం 500 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అదే ‘ఇచ్చిపడేస్తా కొడకల్లారా’ అని అన్న మాటకు లక్షా ఇరవై వేల వ్యూస్, 700 కామెంట్స్, షేర్స్ వచ్చాయి. నెగిటివ్‌ని అంతగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు’ అని సోహైల్ అన్నారు.