సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిరసనలు, ఉద్రిక్తతల నడుమ జిల్లాలో రచ్చబండ మూడో విడత ముగింపు దశకు చేరుకుంది. తొలుత ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు రచ్చబండ నిర్వహించేలా షెడ్యూలు రూపొందించారు. మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించేలా మార్గదర్శకాలు ఖారారు చేశారు. లెహెర్ తుపాను ద ృష్టిలో పెట్టుకుని 30వ తేదీ వరకు రచ్చబండ గడువు పొడిగించారు. అయితే దుబ్బాక, గజ్వేల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు సొంత షెడ్యూలును అనుసరించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కాకుండా గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ‘రచ్చబండ’కు దూరంగా ఉన్నారు.
తొలి, రెండో విడత రచ్చబండలో జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మూడో విడతలో సొంత పార్టీ నేతలే మొండిచేయి చూపారు. తొలి విడతలో వర్గల్, రెండో విడతలో మనూరు మండలం బోరంచలో జరిగిన రచ్చబండ సమావేశంలో సీఎం కిరణ్ పాల్గొన్నారు. మూడో విడత రచ్చబండలో భాగంగా సదాశివపేట మండలం వెల్టూరులో నవంబర్ 13న సీఎం కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి మినహా మిగతా కాంగ్రెస్ నేతలందరూ సీఎం కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై సీఎం కిరణ్ వైఖరికి నిరసనగా సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం తన పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. పలు చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే రచ్చబండ సమావేశాలను అడ్డుకున్నారు. ఫ్లెక్సీలపై సీఎం ఫొటోలను తొలగించి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఫొటోలను అతికించారు. సీఎం సందేశాలను చదవకుండా అడ్డుకున్నారు.
నామమాత్ర స్పందన
మూడో విడత రచ్చబండకు ప్రజల నుంచి నామమాత్ర స్పందన కనిపించింది. రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్‌కార్డులు, పింఛన్లు తదితరాలు మంజూరులో ప్రభుత్వం తాత్సారం చేసింది. దీంతో మూడో విడత రచ్చబండ సమావేశాలపై లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక్కరు కూడా గ ృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు కోరుతూ దరఖాస్తు చేసుకోలేదు. పటాన్‌చెరులో 40, సంగారెడ్డిలో 131 మంది మాత్రమే ఇళ్లు మంజూరు కోరుతూ దరఖాస్తులు సమర్పించడం రచ్చబండ నిర్వహణ తీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది. రచ్చబండలో జిల్లా వ్యాప్తంగా అందిన దరఖాస్తుల సంఖ్య, వివరాలను అధికారులు కంప్యూటరీకరిస్తున్నారు. మండల పరిషత్ అభివ ృద్ధి అధికారుల నుంచి నివేదికలు ఇంకా అందాల్సి ఉందని జిల్లా ప్రణాళిక విభాగం కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి.
నేటితో ముగియనున్న ‘రచ్చ’!
Published Sat, Nov 30 2013 5:07 AM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM
Advertisement