నేటి నుంచి రచ్చబండ | Rachabanda scheme starts from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రచ్చబండ

Published Mon, Nov 11 2013 5:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM

Rachabanda scheme starts from today

ఒంగోలు, న్యూస్‌లైన్:  జిల్లాలో మూడో విడత రచ్చబండ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కలెక్టర్ విజయకుమార్ చినగంజాంలో రచ్చబండ గ్రామసభ నిర్వహించనున్నారు. గత రచ్చబండలో వచ్చిన అర్జీలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఈ రచ్చబండలో వారికి ప్రయోజనాలు కల్పించాలని తీర్మానించారు. దీనికిగాను మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 1,60,341గా జిల్లా యంత్రాంగం పేర్కొంది. వీటిలో జిల్లా పౌరసరఫరాల శాఖ ద్వారా 51,942 మందికి రేషన్ కార్డులు, 33,683 మందికి పెన్షన్లు, 1813 మందికి బంగారు తల్లి సర్టిఫికెట్ల పంపిణీ చేయనున్నారు.

హౌసింగ్ ద్వారా 2062 మంది లబ్ధిదారుల గుర్తింపు, సాంఘిక సంక్షేమశాఖకు చెందిన 38, గిరిజన సంక్షేమశాఖకు చెందిన 2 భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు సాంఘిక సంక్షేమశాఖ ద్వారా 66,262 మంది ఎస్సీ గృహ వినియోగదారులకు రూ 1.47 కోట్లు, 4579 గిరిజన కుటుంబాలకు కరెంటు బకాయిలను గిరిజన సంక్షేమశాఖ ద్వారా చెల్లించాలని నిర్ణయించారు.
 17,081 మంది రేషన్ కార్డులకు అనర్హులు:
 రేషన్ కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 69,023 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో 51,942 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. 17081 మందిని అనర్హులుగా పేర్కొన్నారు. యర్రగొండపాలెం 1536, దర్శి 1550, పర్చూరు 1323, అద్దంకి 941, చీరాల 1194, సంతనూతలపాడు 1160, ఒంగోలు 536, కందుకూరు 1147, కొండపి 1416, మార్కాపురం 2424, గిద్దలూరు 1627, కనిగిరి 2227 కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. అత్యధికంగా మార్కాపురం నియోజకవర్గంలో 43.3 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం గమనార్హం. ఒంగోలులో అర్హులైన దరఖాస్తుదారులకు మొండిచేయి చూపడంపై
 విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మంజూరైన వారికి కూడా రేషన్ కార్డులను పంపిణీ చేసే పరిస్థితి కనిపించడంలేదు. కేవలం తెల్లకార్డుదారుల ప్రయోజనాలను పొందేందు కు వీలుగా రేషన్‌కూపన్‌లు ఈ రచ్చబండలో ఇవ్వాలని నిర్ణయించారు.  
 33,683 మందికి పెన్షన్లు:
 జిల్లా వ్యాప్తంగా 33,683 మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే యర్రగొండపాలెం 2993, దర్శి 3231, పర్చూరు 2500, అద్దంకి 3826, చీరాల 2617, కొండపి 3661, మార్కాపురం 2349, గిద్దలూరు 3447, కనిగిరి 3206 మంది వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేతలు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ ఈ రచ్చబండలో చేయాలని నిర్ణయించారు.
 1813 మందికి బంగారు తల్లి
 నమోదుపత్రాలు:
 జిల్లాలోని 1813 మందికి రచ్చబండ కార్యక్రమంలో బంగారుతల్లి పథకం నమోదు పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. వై.పాలెంలో 187, దర్శి 134, పర్చూరు 164, అద్దంకి 167, చీరాల 77, సంతనూతలపాడు 106, ఒంగోలు 35, కందుకూరు 167, కొండపి 122, మార్కాపురం 158, గిద్దలూరు 252, కనిగిరిలో 244 మందిని ఎంపిక చేశారు.
 గృహనిర్మాణశాఖ రుణాలు
 83,396 మందికే:
 గృహనిర్మాణశాఖ ద్వారా రుణాల కోసం 99,125 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 83,396 మంది మాత్రమే అర్హులని అధికారులు తేల్చారు. అంటే 15,729 మంది అనర్హులుగా నిర్ణయించారు. ఇక రచ్చబండ 1,2ల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికీ 43,951 మంది అర్హులకు రుణాలు అందించాల్సి ఉంది. వీరిలో ఎస్సీలు 10,190, ఎస్టీలు 1331, మైనార్టీలు 2,235, బీసీ, ఇతరులు 30,195 మంది ఉన్నారు. తొలి, రెండో విడత రచ్చబండలోనివారే ఇంత మంది పెండింగ్‌లో ఉంటే మరి కొత్తగా అర్హులుగా గుర్తించిన వారికి రుణాలు ఇక ఎప్పుడు అందజేస్తారనేది వేచిచూడాల్సిందే.
 శిలాఫలకాలు:
 పీ.దోర్నాల, మారెళ్ల, దొనకొండ, మార్టూరు, అద్దంకి, వేటపాలెం, ఒంగోలు, ఉలవపాడు, గిద్దలూరుల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్మాణాల కోసం ఒక్కోదానికి రూ 80 లక్షలు కేటాయిస్తూ శిలాఫలాకాలు వేయనున్నారు. వీటితోపాటు రూ 7.50 లక్షల చొప్పున 12 నియోజకవర్గాల్లో 24 సామాజిక భవనాలకు, ఒంగోలులో ఒక్కోటి  రూ 2 కోట్లతో ఎస్సీ బాలికల, బాలుర హాస్టళ్లు, కందుకూరు బాలుర, మార్కాపురంలో బాలికల కోసం హాస్టళ్లు నిర్మించేందుకు శిలాఫలకాలు వేయాలని నిర్ణయించారు. కనిగిరిలో రూ 3 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు వీటిలో చాలావాటికి తహసీల్దార్లు స్థలాన్ని కూడా మంజూరు చేయలేదు. అయినప్పటికీ శిలాఫలకాలు వేసుకొని తృప్తి చెందేందుకే అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 రచ్చబండ షెడ్యూలు ఇదీ:  
 11వ తేదీ చినగంజాం, పుల్లలచెరువు, 12న ఇంకొల్లు, కారంచేడు, కురిచేడు, 13న హనుమంతునిపాడు, 15న మార్టూరు, యద్దనపూడి, సీఎస్‌పురం, తర్లుపాడు, గిద్దలూరు, 16న ఒంగోలు, బల్లికురవ, జరుగుమల్లి, వెలిగండ్ల, కొమరోలు, 19న కొత్తపట్నం, కొండపి, పామూరు, ముండ్లమూరు, చీరాల మున్సిపాలిటీ, గిద్దలూరు నగర పంచాయతీ, 20న కొరిశపాడు, కందుకూరు, పొన్నలూరు, కనిగిరి, బేస్తవారిపేట, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీ, కనిగిరి నగర పంచాయతీ, 21న నాగులుప్పలపాడు, సంతమాగులూరు, వలేటివారిపాలెం, త్రిపురాంతకం, అర్ధవీడు, 22న మద్దిపాడు, జే పంగులూరు, లింగసముద్రం, పొదిలి, దొనకొండ, కంభం, 23న సంత నూతలపాడు, అద్దంకి, గుడ్లూరు, మర్రిపూడి, తాళ్లూరు, దోర్నాల, మార్కాపురం మున్సిపాలిటీ, అద్దంకి నగర పంచాయతీ, 24న ఉలవపాడు, 25న చీమకుర్తి, సింగరాయకొండ, దర్శి, మార్కాపురం, చీమకుర్తి నగర పంచాయతీ, 26న చీరాల, వేటపాలెం, కొనకనమిట్ల, పెద్దారవీడు మండల కేంద్రాల్లో రచ్చబండ గ్రామసభలు జరుగుతాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement