తిరుపతి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యాక్రమం ముఖ్యమంత్రి కిరణ్ సొంత జిల్లాలో రచ్చ రచ్చ అయ్యింది. అధికార పార్టీ ఎంపీ చింతా మోహన్కు రచ్చబండలో చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో గురువారం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీని సమస్యలు పరిష్కరించాలంటూ నిలదీశారు. సమస్యలపై సరైన సమాధానం రాకపోవటంతో ఆగ్రహించిన మహిళలు.... ఎంపీపై బాటిళ్లు విసిరి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో చింతా మోహన్ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.
ఇదే రచ్చబండ కార్యక్రమంలోనే సీపీఎం కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఎంపీ చింతా మోహన్ సమైక్యవాదుల నుంచి నిరసనలు ఎదుర్కొన్నారు. కాగా సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతిలో రచ్చబండ రసాభాస
Published Thu, Nov 21 2013 4:54 PM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement