chinta mohan
-
చంద్రబాబు పరమ పవిత్రుడు కాదు: చింతా మోహన్
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది అనేది అబద్ధమని.. పంది కొవ్వు, చేప నూనె కలిసిందనేది.. జరగని పని అంటూ మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తేల్చిచెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూపై చంద్రబాబు చూపించిన రిపోర్టులు తప్పు.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు పరమ పవిత్రుడు కాదన్నారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ మాటలు తీవ్ర అభ్యంతరకరమన్నారు.చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదు.. అమరావతిలో వేల కోట్లు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. కృష్ణా నదిలో రాజధానిని కట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా.. పోలవరంపై ఎవరు ఎంత ఖర్చు చేశారో లెక్కలు తేలాలి. పోలవరం రాజకీయ నాయకులకు వరంగా మారింది.. పోలవరం పెద్ద మోసం అంటూ చింతామోహన్ వ్యాఖ్యానించారు. -
ప్రసాదం శాంపిల్స్ ను ఇతర రాష్ట్రాల ల్యాబ్ లకు పంపాలి
-
త్వరలో ఏపీసీసీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉంది వీరే?
సాక్షి, ఢిల్లీ: ఏపీ కాంగ్రెస్ పార్టీకి త్వరలో అధ్యక్షుడిని నియమించనున్నారు. ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పనితీరు సరిగా లేదని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం అంతర్గతంగా కసరత్తు చేపట్టింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్ చాందీ ఈ అంశంపై పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి రాజీనామా చేసిన తర్వాత నియమితులైన శైలజానాథ్ ఆ స్థాయిలో పనితీరు కనబర్చలేదని హైకమాండ్ నిర్దారణకు వచ్చింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించి, కనీసం తాము ఉన్నామని చాటుకోవాలని భావిస్తోంది. చదవండి: ‘బీజేపీని చూస్తుంటే జాలేస్తుంది.. ఏపీలో అంతా రివర్స్’ ఇందుకోసం పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటారని అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్, ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీ పేర్లు ఏఐసిసి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేర్లపై ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను ఏపీ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్ చాందీ సేకరించనున్నారు. ఇందుకోసం త్వరలో హైదరాబాద్, విజయవాడలలో స్వయంగా పర్యటించేందుకు ఉమెన్ చాందీ పర్యటను ఖరారు చేసుకుంటున్నారు. మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, పల్లంరాజు తదితర నేతలను ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉంది. ఈ సీనియర్ల అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను జనవరి నెలాఖరులోగా హైకమాండ్‌కు అందించనున్నారు. ఏపిసిసి చీఫ్ పదవిపై సీనియర్లెవరు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, పోటీ కూడా నామమాత్రంగానే ఉంది. రాష్ట్ర రాజకీయ చిత్రంలో కనీసం కాంగ్రెస్ పార్టీని ఉనికినైనా చాటగలిగే నాయకుడు కావాలని హైకమాండ్ ప్రయత్నిస్తోంది. పీసీసీ రేసులో ఉన్న చింతామోహన్ కు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ప్లస్ పాయింట్ కాగా, 67 ఏళ్ల పై వయసు ఉండడంతో ఆయన రాష్ట్ర మంతటా చురుగ్గా తిరిగి పార్టీని గాడిలో పెట్టలేరనే వాదన ఉంది. అయితే గిడుగు రుద్రరాజు ఏఐసిసి కార్యదర్శిగా ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు వైఎస్సార్, కెవిపి సన్నిహితుడిగా పేరుపొందారు. చిన్ననాటి నుంచి కాంగ్రెస్‌లోనే పెరిగిన గిడుగు 52 ఏళ్ల వయసులో ఉండడంతో పార్టీ కోసం చురుగ్గా తిరగ గలుగుతారనే ప్రచారం జరుగుతోంది. మరీ ఈ ఇద్దరిలో పదవి ఎవరికి ఇస్తారో చూడాలి. -
రేసులో సాకే, చింతా మోహన్, పద్మశ్రీ!
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎన్.రఘువీరారెడ్డి ససేమిరా అంటున్నారు. సొంత పనులపై బిజీగా ఉన్నందున నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండలేనంటూ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి కావడంతో పలువురు నేతలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్‌లు ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. అయితే వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని పారీ్టలో అధిక శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీ మాజీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలసి విన్నవించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును ఎంపిక చేయాలని భావిస్తున్నా ఆయన సుముఖంగా లేనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోవాలంటూ ఎక్కువ మంది అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్‌చాందీకి అధిష్టానం సూచించింది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అవును రాజీనామా చేశాను: రఘువీరారెడ్డి -
వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందని, కేంద్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చింతా మోహన్ పేర్కొన్నారు. 35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా అంతకు ముందు దేవెగౌడ తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ‘పుట్టిన రోజు సందర్భంగా 35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా. ప్రధాని పదవిని ఎవరు అధిరోహిస్తారో తెలియదు. మేం మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం.’ అని అన్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి 18 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్య తీరాలని దేవుడిని ప్రార్థించానని ఆయన తెలిపారు. -
’టీటీడీలో ఆడిట్ అధికారులను నియమించాలి’
సాక్షి, తిరుపతి : టీటీడీ అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు మాజీ ఎంపీ చింతా మోహన్ లేఖ రాశారు. టీటీడీలో తక్షణమే ఆడిట్ అధికారులను, ఒక ఐఆర్ఎస్ అధికారిని నియమించాలని కోరారు. టీటీడీ సభ్యులు కుప్పం నుంచి వచ్చే కూరగాయలను అధిక రేట్లకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక రైతుల నుంచే కూరగాయలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ గోల్డ్ డిపాజిట్ తరలింపుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. తిరుమల, తిరుపతిలో వడ్డీ వ్యాపారులు ప్రజల్ని దోచుకుంటున్నారని, పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఈ విషయాలు అన్ని గవర్నర్, డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ నెల 23లో టీటీడీ స్పందించకపోతే ప్రత్యేక్ష ఆందోళన చేస్తానని హెచ్చరించారు. -
టీటీడీలో రోజురోజుకు ముదురుతున్న బంగారం వివాదం
-
కోట్లు దండుకునేందుకే ‘పోలవరం’ ప్రాజెక్ట్
నెల్లూరు(వీఆర్సీ సెంటర్): పోలవరం ప్రాజెక్ట్ పేరుతో నాయకులు కోట్లాది రూపాయలను దండుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఇందిరాభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసిన సొంటి రామ్మూర్తి అనే ఐఏఎస్ అధికారి రూ.200 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ప్రణాళికను రూపొందించగా, అది రూ.10 వేల కోట్లకు, ప్రస్తుతం రూ.56 వేల కోట్లకు పెరిగిపోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌కు రూ.ఆరు వేల కోట్లు కూడా ఖర్చు కాలేదన్నారు. చంద్రబాబు విదేశాలకు వెళ్లి ముడుపులు తీసుకుంటున్నారని, అవినీతితో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్డారు. దావోస్ పర్యటనలో చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. అంకెల గారడీ తప్ప కేంద్ర బడ్జెట్లో ఏమీ లేదని, అంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపారని విమర్శించారు. రైతులకు బడ్జెట్లో పెద్దపీట వేశామని బీజేపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, రైతులకు అప్పులివ్వడం.. తిరిగి వసూలు చేయడం గొప్ప విషయమేమీ కాదన్నారు. ఆత్మ గౌరవం పేరుతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పరువు మంటగలిసిందన్నారు. చంద్రబాబు రూ.లక్ష కోట్లను రాష్ట్రానికి తీసుకొచ్చారంటున్నారని, వాటి వివరాలను బహిరంగపర్చాలని డిమాండ్ చేశారు. దుగరాజపట్నం పోర్టు కోసం గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 100 మంది సంతకాలు చేసి మంజూరు చేయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం పదెకరాలనూ ఇవ్వక ఆగిపోయిందన్నారు. నాయకులు భవానీ నాగేంద్రప్రసాద్, చంద్రశేఖర్, వెంకటయ్య, రామచంద్రయ్య, పరిమల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కాగా చింతామోహన్‌కు పోటీగా జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గాలాజు శివాచారి మరో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. -
‘పవన్ ఎవరో నాకు తెలియదు’
సాక్షి, విజయనగరం: జన్మభూమి కార్యక్రమం పేదోడికి భరోసా ఇవ్వలేకపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని, జనసేన పార్టీకి చిహ్నం(సింబల్) లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవారని గతంలో చింతా మోహన్ వ్యాఖ్యానించారు. అప్పుడే రాజకీయాల్లోకి చిరంజీవిని రమ్మని తాను కోరినట్లు వెల్లడించారు. కాపులు, దళితులు ఏకమై రాజ్యాధికారం సాధించాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
1993లో చిరంజీవి రాజకీయాల్లో వచ్చి ఉంటే..
పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు అవినీతి వరంగా మారిపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. సొమ్మొకడిదీ సోకొకడిదీ అన్నట్టుగా పోలవరాన్ని మార్చేశారని అన్నారు. అవినీతి మచ్చ లేదంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి పోలవరంలో అవినీతే మరకగా మారిందని వ్యాఖ్యానించారు. పోలవరంలో 50శాతం పైగా అవినీతి ఉందని స్పష్టంగా చెప్పారు. నితిన్ గడ్కరీ కి పేరులోనే నీతి ఉందని కానీ ఆయన చేసేది అంతా అవినీతేనని తూర్పారబట్టారు. పోలవరం పేరుతో చంద్రబాబు కోట్లు దోచుకుంటున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవాడని చెప్పుకొచ్చారు. అప్పుడే రాజకీయాల్లోకి చిరంజీవిని రమ్మని తాను కోరినట్లు తెలిపారు. కాపులు, దళితులు ఏకమై రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు తన జీవితకాలంలో పూర్తి చేయలేరు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి చేయలేరని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో సినిమా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని పెట్టుబడులు తెచ్చారో వెల్లడించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఎక్కడ డబ్బుంటే అక్కడ చంద్రబాబు ఉంటారని విమర్శించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసన్మానాల పేరుతో ప్రజా«ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. వీటితో ఎవరికి ఉపయోగమో చెప్పాలన్నారు. అసలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోంది చంద్రబాబేనన్నారు. మరోవైపు లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు రాజధాని డిజైన్లపై నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో విడతల వారీగా సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణశైలి, డిజైన్లు అసాధారణ రీతిలో, అపూర్వంగా ఉండాలని ఆయన నార్మన్ ఫోస్టర్ సంస్థకు సూచించారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు నచ్చేలా రాజధాని డిజైన్లు ఉండాలని, అలా వాటిని తీర్చిదిద్దాలని చెప్పారు. -
'అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు'
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో అవినీతి తప్ప.. అభివద్ధి లేదని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆరోపించారు. తుళ్లూరు శపించబడ్డ ప్రాంతమని.. అక్కడ ఎవరు అడుగు పెట్టినా పతనమే అని వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని ఊదరకొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారన్నారు. తన ఇంటి వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పోలవరం పేరు చెప్పి తండ్రీ కొడుకులు కోట్లు సంపాదిస్తున్నారన్నారు. చెప్పులు లేకుండా తిరిగిన చంద్రబాబుకు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నంద్యాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించుకుంటానంటున్న ముద్రగడ యాత్ర పై ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు అందరికి ఉందని.. రాష్ట్ర డీజీపీ సాంబశివరావు టీడీపీ నాయకుడిలాగా మాట్లాడుతున్నారన్నారు. బెదిరించే వైఖరీలో మాట్లాడటం తప్పని అన్నారు. -
'చంద్రబాబు దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి'
తిరుపతి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలు పతనం దిశగా వెళుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రెండెకరాల స్థలంలో పంటలు పండించామని చెప్పుకొచ్చాడని గుర్తుచేశారు. అయితే వంకాయలు, బెండకాయలు, పాలు ఎక్కడ అమ్మారో చూపాలని ప్రశ్నించారు. తిరుపతిని లేక్ సిటీగా చేస్తానని చెప్పిన చంద్రబాబు దుగరాజపట్నం ఓడరేవుకు 200 ఎకరాలు ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్, దుగరాజపట్నం ఓడరేవును రద్దు చేసిన ఘనత బీజేపీ, టీడీపీలదేనని ఎద్దేవా చేశారు. ఇదే గనక తెలంగాణలో జరిగి ఉంటే అక్కడి ప్రజల్లో విప్లవం వచ్చి ఉండేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని, శ్రీకాళహస్తి–నడికుడి రైల్వే లైన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. సీఎంగా చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో తిరుపతి అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని, తిరుపతి అభివృద్ధి కోసం 13 రూపాయల పనులు కూడా చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే తిరుపతి అభివృద్ధి జరిగిందన్నారు. 300 పడకల ప్రసూతి ఆసుపత్రికి ‘చంద్ర’గ్రహణం పట్టుకుందని, క్యాన్సర్ ఆసుపత్రిని రద్దు చేశారని చెప్పారు. నోట్ల రద్దుతో ప్రధాని మోదీ ఒక్కరే లాభపడ్డారని, దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పక్కనుంటూనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేదల గొంతులు కోసి వేల కోట్ల రూపాయలు గడించారని ఆరోపించారు. ఈ సమావేశంలో నైనారు శ్రీనివాసులు, తాళ్లపాక గోపాల్, సావిత్రియాదవ్, శాంతి యాదవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దుగరాజపట్నం పోర్టుపై వెనక్కి తగ్గం
-మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కోట: వాకాడు మండలం దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ తెలిపారు. మంగళవారం ఆయన కోటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో పోర్టుకు అనుకూలంగా చట్టం చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పోర్టు రాకుండా అడ్డుపడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. పోర్టు సాధన కోసం ఉద్యమించనున్నట్లు చెప్పారు. గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల్ని చైతన్య పరుస్తామన్నారు. ఆయన వెంట పుచ్చలపల్లి సర్పంచ్ ఇంధ్రసేనయ్య, నాగరాజు, మాజీ ఎంపీటీసీ అంకయ్య, కోట, వాకాడు మండలాల నాయకులు ఉన్నారు. -
దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం తగదు
మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ వాకాడు: యూపీఏ ప్రభుత్వం విభజన చట్టం కింద మంజూరు చేసిన దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం తగదని –తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. వాకాడులో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పోర్టును అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు పోర్టు కోసం దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం భావితరాలకు ద్రోహం చేయడమేనన్నారు. ఓడరేవు వస్తే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చారిత్రిక నేపథ్యమున్న ఓడరేవు నిర్మాణం కోసం పోరాడుతామన్నారు. -
దుగ్గరాజపట్నం పోర్టుకు ఆ ఇద్దేరే అడ్డంకి
తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ధ్వజం చిట్టమూరు: వాకాడు మండలం దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడే అడ్డంకని కాంగ్రెస్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. చిట్టమూరులో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోర్టు వస్తే లక్షల మంది రైతులు, వేలాది మంది నిరుద్యోగులు బతుకులు బాగుపడతాయన్నారు. కానీ వెంకయ్యనాయుడు, చంద్రబాబులు ఇద్దరూ కమ్మక్కై పోర్టు రానివ్వకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ పోర్టుకు పక్కనే ఉన్న ఓ ప్రవేటు పోర్టు యజమానులకు లొంగిపోయి తమ స్వప్రయోజనాలకు పోర్టు ద్వారా హెలికాప్లర్లు వాడుకుంటూ ప్రభుత్వ పోర్టు నిర్మాణం చేపట్టకుండా చూస్తున్నారని ఆరోపించారు. రూ.25 వేల కోట్లతో నిర్మాణం జరిగే వి«దంగా ప్రణాళికలు తయారు చేశారన్నారు. డిసెంబర్ 31 లోపు పోర్టు నిర్మాణ పనులు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్టులో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయని చింతామోహన్ ఆరోపించారు. -
దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు
మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ నాయుడుపేట: దక్షణ భారతదేశంలోనే అత్యంత పెద్దదైన దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు. నాయుడుపేట ఆర్అండ్బి అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుగరాజపట్నం ఓడరేవును తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. వాకాడు, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, చిట్టమూరు ప్రాంతాలు దుగరాజపట్నం ఓడరేవుతో ఎంతో అభివృద్ధి చెందనుందని అభిప్రాయపడ్డారు. ఓడరేవుకు అనుబంధంగా వంద పరిశ్రమలు వచ్చే అవకాశ ఉందని తద్వారా లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందడంతో పాటు లక్షమంది రైతులు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రైవేటు పోర్టుల నుంచి హెలికాప్టర్లను వినియోగించుకుంటూ వారికి వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటుకు అమ్ముడు పోతున్న జిల్లా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిని చూస్తుంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, వెంకటయ్య, సుబ్బయ్య ఉన్నారు. -
న్యాయవ్యవస్థలో మార్పులు రావాలి
-న్యాయమూర్తుల నియామకంలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ప్రాధాన్యం కరువు - తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సాక్షి ప్రతినిధి, తిరుపతి భారత న్యాయ వ్యవస్థలో మార్పులు ఎంతో అవసరమని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాలకు న్యాయం సులభంగా అందేలా మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మనది గొప్ప ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ అందరికీ న్యాయం అందడం లేదన్నారు. పవర్ ఫర్ ఎవర్ అన్న చందాన డబ్బున్న వారికే న్యాయం త్వరగా దొరుకుతుందన్నారు. బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతా మోహన్ మాట్లాడారు. 125 కోట్ల భారత జనాభాలో 109 కోట్ల మంది బీసీ, ఎస్సీ, గిరిజన,మైనార్టీలు ఉన్నారనీ, ఈ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కరికి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రాతినిధ్యం దొరకలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ముగ్గురు కీలక న్యాయమూర్తులుగా ఉన్నారన్నారు. న్యాయవాదుల ఫీజులు పెరగడంతో న్యాయం అనేది పేదలకు దూరమవుతుందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే రూ.1 కోటి, హైకోర్టుకు వెళ్లాలంటే రూ.10 లక్షలు ఉండాల్సిందేనన్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం దక్కడం లేదన్నారు. తాను వ్యక్తులను తప్పుపట్టడం లేదనీ, వ్యవస్థలోని లోపాలను చెబుతున్నానన్నారు. ఇదేనా సామాజిక న్యాయం? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై తాను వ్యక్తిగా పోరాటం చేయాలనుకుంటున్నట్లు మోహన్ చెప్పారు. అవసరమైతే భారత రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు. -
'స్వర్ణభారతి ట్రస్ట్ కు రూ. 160 కోట్లు మళ్లించారు'
తిరుపతి కల్చరల్: పదవుల్లో ఉండి అడ్డంగా వేలకోట్లు దోపిడీ చేస్తున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడులపై తక్షణమే సీబీఐ విచారణ జరపించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని అంబేడ్కర్ భవన్లో మం గళవారం నిర్వహించిన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 160 కోట్ల కేంద్ర నిధులు స్వర్ణభారతి ట్రస్ట్‌కు మళ్లించిన ఘనత వెంకయ్య నాయుడిదేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, తీసుకొచ్చిన దుగ్గరాజట్నం, కేన్సర్ ఆసుపత్రి, మన్నవరం, 7,008 నిరుపేదల నివాస గృహాలను రద్దు చేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చింతామోహన్ హెచ్చరించారు. ఎలాంటి పదవులు లేకుండా తన వ్యాపార మేథస్సుతో ఆస్తులు సంపాదించిన వైఎస్ జగన్‌పై సీబీఐ విచారణ చేయడం సరికాదన్నారు. అనంతరం చింతామోహన్ వినూత్నంగా రోడ్డుపైకి వచ్చి చేతిలో చీపురు పట్టి చెత్త ఊడ్చి నిరసన తెలిపారు. రోడ్డులో చెత్త ఊడ్చినట్లు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఊడ్చేస్తానంటూ చింతామోహన్ సంకేతాలిచ్చారు. -
'దోచుకున్న భూముల కోసమే సెక్షన్ 8 డిమాండ్'
సత్యవేడు: హైదరాబాద్‌లో రూ. లక్ష కోట్ల విలువజేసే 1,000 ఎకరాల భూమిని దోచుకున్న భూ రాబందుల బాగోతం టీఆర్ఎస్ పార్టీ బయట పెట్టుతుందన్న భయంతోనే సెక్షన్ 8 అమలును టీడీపీ కోరుతోందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో సత్యవేడులో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకోలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పనులను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తే, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఆ పార్టీ నాయకుల సంక్షేమం కోసమే నీరు -చెట్టు పేరుతో వెచ్చిస్తోందన్నారు. ఉపాధి పథకం టీడీపీ నాయకుల ఆర్ధికాభివృద్ధి పథకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఆగస్టు నెలలో రాజకీయ సంక్షోభం తప్పదని ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చని, చంద్రబాబు స్థానంలో నారా లోకేష్‌బాబు సీఎంగా రావవచ్చని జోస్యం చెప్పారు. తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ. 120 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఈ హాస్పిటల్‌ను విజయవాడకు తరలించేందుకు సదరు మంత్రి ప్రయత్నిస్తుంటే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే.. కాంగ్రెస్ ఊరుకోబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఓ అధికారి రూ. 15 లక్షలు ఓ పెద్ద నేతకు సమర్పించి సత్యవేడుకు వచ్చారన్నారు. -
‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక మరో కథుంది!
తిరుపతి కల్చరల్: ‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక అసలు కథ మరొకటి ఉందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ మంత్రులు తమకు హైదరాబాద్‌లో ఉన్న వెయ్యి ఎకరాల భూములను కాపాడుకునేందుకు ప్రయత్నించారన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డు తగలడంతో దాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర పడిందన్నారు. కానీ టీడీపీ నేతలు ఏసీబీకి దొరికిపోవడంతో వారి నిజస్వరూపం బయట పడిందని చెప్పారు. ఏపీలో ఆగస్టు చివరికల్లా రాజకీయ సంక్షోభం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. అధికార పార్టీ నాయకులే తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే చిత్తూరు, కడప జిల్లాలు అభివృద్ధి చెందడంతోపాటు లక్ష ఉద్యోగాలు వస్తాయని, అయినా ప్రభుత్వం దానిపై దృష్టి సారించడంలేదన్నారు. -
'త్వరలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ శనివారం తిరుపతిలో జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నిలకు మాత్రం తథ్యమన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చిన ఓ ఒక్క హామీ అమలు చేయలేకపోయారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజుపట్నం ఓడరేవు సాధన కోసం పోరాటం చేస్తానని చింతా మోహన్ తెలిపారు. అందుకోసం సోమవారం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు చింతా మోహన్ ప్రకటించారు. -
'దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయింది'
తిరుపతి : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతి పట్ల తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయిందని, దేశ రాజకీయాల్లో జేబీ పట్నాయక్ కీలక పాత్ర పోషించారని అన్నారు. కాగా గుండెపోటుతో తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ జేబీ పట్నాయక్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. జేబీ పట్నాయక్ మృతదేహం మరికాసేపట్లో సాంస్కృతిక విద్యాపీఠం వద్దకు తీసుకెళ్లి.. అనంతరం ప్రత్యేవ విమానంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు తరలిస్తారు. -
'రిగ్గింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి'
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని... టీడీపీ అక్రమ పద్దతులు అనుసరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. శుక్రవారం తిరుపతిలో చింతామోహన్ మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడానికి టీడీపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఒంటి గంట తర్వాత రిగ్గింగ్ చేయడానికి టీడీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుందని విమర్శించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే టీడీపీ మట్టికరుస్తుందని... కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో గతేడాది డిసెంబర్ 15న మరణించారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ తమ అభ్యర్థిగా వెంకటరమణ సతీమణి సుగుణమ్మను నిలిపింది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నిక శుక్రవారం ప్రారంభమైంది. -
ఏకగ్రీవం కోసం పాట్లు
ఎన్నికల హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి పార్టీ కేడర్‌లో అసంతృప్తి కాంగ్రెస్ మాటల యుద్ధం తెలుగుదేశం అధినాయకత్వంలో ఆందోళన తిరుపతి: ఉప ఎన్నికను ఎలాగైనా ఏకగ్రీవం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ తంటాలు పడుతోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో ఆందోళనకు గురవుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థిపై కేడర్‌లో అసంతృప్తి గుబులు. దీంతో ఏకగ్రీవం వైపే ఆలోచి స్తోంది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థి సుగుణమ్మ బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అగ్రనేతలు పైకి నటిస్తూన్నారే తప్ప చిత్తశుద్ధితో పనిచేయలేదని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, అభ్యర్థి అల్లుడు సంజయ్ సైతం ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే జన్మభూమి కమిటీల్లో పూర్తిగా కాంగ్రెస్ నుంచి తన వెంట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం.. పూర్వం నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న వారి అసంతృప్తికి కారణమైనట్లుగా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే కొంతమంది నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా మద్యం షాపులు, రిక్రియేషన్ క్లబ్‌లను సైతం వదలకుండా ముఖ్యనేత మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రభావం ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై పడుతోందేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్లో ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, పనుల కేటాయింపుల్లో సైతం అభ్యర్థి బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిణామాలతో గడచిన ఏడు నెలల్లోనే పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలామంది కార్యకర్తలు పార్టీ అభ్యర్థికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కీలక నేతలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి వంటి సీనియర్ నేతలు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మాటల యుద్ధం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్, ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి, దేశం అభ్యర్థిపై మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా చింతామోహన్ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ఏమైనా మహనీయులా? పొట్టిశ్రీరాములా? ప్రకాశం పంతులా? అల్లూరి సీతారామరాజా?.. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని 500 కోట్లు సంపాదించారు. ’’ అంటూ వ్యాఖ్యానించడం టీడీపీ నాయకులను ఇరుకున పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా రాజధాని విషయంలో అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్? శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం నాయకుడు పీఆర్‌మోహన్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్‌గా నియమితులైనట్లు తెలిసింది. చైర్మన్‌తో పాటు మరో ఆరుగురిని కమిటీ సభ్యులుగా నియమించడానికి ఎంపిక చేసినట్లు తెలిసింది. వారిలో సభ్యులుగా వెయిట్‌లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరితో పాటు మరో ఐదుగురిని నియమించినట్లు సమాచారం. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా పీఆర్ మోహన్ శాప్ చైర్మన్‌గా పనిచేశారు. ఏకగ్రీవం కోసం పాట్లు అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే కొంతమంది నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా మద్యం షాపులు, రిక్రియేషన్ క్లబ్‌లను సైతం వదలకుండా ముఖ్యనేత మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రభావం ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై పడుతోందేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్లో ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, పనుల కేటాయింపుల సైతం అభ్యర్థి బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిమాణాలతో గడచిన ఏడు నెలల్లోనే పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలామంది కార్యకర్తలు పార్టీ అభ్యర్థికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కీలక నేతలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి వంటి సీనియర్ నేతలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మాటల యుద్ధం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్, ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి, దేశం అభ్యర్థిపై మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా చింతామోహన్ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ఏమైనా మహనీయులా? పొట్టిశ్రీరాములా? ప్రకాశం పంతులా? అల్లూరి సీతారామరాజా?.. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని 500 కోట్లు సంపాదించారు. ’’ అంటూ వ్యాఖ్యానించడం టీడీపీ నాయకులను ఇరుకున పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా రాజధాని విషయంలో అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. -
మోదీ-బాబుది నయవంచన
తిరుపతితుడా: ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన అధికార పార్టీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ర్టంలో సీఎం చంద్రబాబు వంచనకు పాలప్పడ్డారని ఆయన అన్నా రు. హామీల అమలు, జాతీయ ప్రాజెక్టుల పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ డీసీసీ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ మోదీ వస్తే మంచిరోజులు వస్తాని తప్పుడు ప్రచారం చేశారన్నారు. మంచి రోజులు కాదు మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులతో పాటు అభివృద్ధికి గడ్డుకాలం వచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక విప్లవం వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి ఉపాధి హామీని పూర్తిగా తొలగించారని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల కారణంగా ఆరు నెలలకే ప్రజలను కన్నీటిపర్యంతం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే దురుద్దేశంతో జిల్లాకు తీసుకొచ్చిన జాతీయ ప్రాజెక్ట్‌లైన మన్నవరం, దుగరాజపట్నం రేవు, భెల్ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతానికి చెందిన చంద్రబాబు సీఎం అయ్యాడు. మంచి జరుగుతుందిలే అనుకుంటే తన నైజాన్ని మరోసారి ప్రజలపై రుద్దారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.450గా ఉన్న గ్యాస్ ధరను కేంద్రం ఏకంగా రూ.1000 చేసిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులను, మహిళలను మోసం చేసినవారెవ్వరూ బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. అనంతరం గ్యాస్ ధర పెరుగుదలను నిరసిస్తూ మహిళలు ఆర్డీవో కార్యాలయంలో వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమార్, ప్రమీలమ్మ, ఆనందమ్మ, గుండ్లూరు వెంకటరమణ, శ్రీని వాసులు, పెనుబాల చంద్రశేఖర్, ప్రభాకర్, గుంటూరు రాజేశ్వరి, నాగభూషణం, అశోక్‌సామ్రాట్, మునాఫ్, బ్రహ్మానందం పాల్గొన్నారు. -
డబ్బు కోసం బారులు తీరిన ఓటర్లు
తిరుపతి: ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చేశారు. ఓటర్లను ఏదోఒక విధంగా ప్రలోభాలకు లోను చేస్తున్నారు. కులం, డబ్బు ... ఎక్కడ ఏది అవసరమైతే దానిని వాడేసుకుంటున్నారు. వారికి గెలవటమే ధేయం తప్ప మరోటిలేదు. తిరుపతిలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి చింతా మోహన్ ఓటర్లకు డబ్బు ఎరవేశారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఏకంగా తన తన ఇంటి వద్దే డబ్బు పంపిణీ మొదలు పెట్టారని సమాచారం. ఓటర్లు డబ్బుల కోసం చింతా ఇంటి వద్ద బారులు తీరారు. ఇదిలా ఉంటే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుపతి ఈసారి ఎన్నికలలో తరచూ వార్తలకెక్కుతోంది. బిజెపి-టిడిపి కూటమి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా తమ ఎన్నికల ప్రచార కరపత్రాలలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఫొటోను ముద్రించారు. ఈ రోజు ఈ సంఘటన మరో సంచలనం. -
పట్టుబడిన ‘పచ్చ’ మద్యం
జిల్లా వ్యాప్తంగా 5,485 మద్యం సీసాలు స్వాధీనం పొదలకూరు, న్యూస్‌లైన్ : పోలింగ్ సమయం ముంచుకొస్తుండటంతో గెలుపే లక్ష్యంగా పచ్చ పార్టీ ప్రలోభాలకు తెగబడుతోంది. పంపిణీ చేసేందుకు తరలిసు ్తన్న, దాచి ఉంచిన భారీ స్థా యిలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జి ల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో 5, 485 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. పొదలకూరు పట్టణంలో వేర్వేరు ప్రాంతాల్లో అక్రంగా మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ ఎం.హైమారావు, ఎస్సై ఎం.అంజిరెడ్డి తమ సిబ్బందితో ఓ పాడుబడిన ఇంట్లో ఉన్న 1700 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ బస్టాండ్‌కు సమీపంలోని కామాక్షి వైన్స్ మిద్దెపైన ఓ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 800 మద్యం సీసాలను పట్టుకున్నారు. అయితే పోలీసులు స్వా ధీనం చేసుకున్న మద్యం సీసాలు టీడీపీకి చెందినవిగా ప్రచారం జరుగుతోంది. ఇస్కపాళెంలో 1,884 బాటిళ్లు..: వెంకటాచలం : ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెటేందుకు టీడీపీ నాయకులు తరలిస్తున్న 1,884 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఫ్లయింగ్ స్కాడ్ అధికారి శివకుమార్ ఇస్కపాళెం గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించారు. మద్యం షాపు నుంచి ఆటోలో అక్రమంగా ఏడు బస్తాల్లో తరలిస్తున్న 1,884 బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఆటో డైవర్ తురక హరిని అదుపులోకి తీసుకున్నారు. తాటిపర్తిపాళెం, ఎగువమిట్ట, పూడిపర్తి గ్రామాలకు తరలించేందుకు ప్రయత్నించగా సమాచారంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు. 866 మద్యం బాటిళ్లు..: ఓజిలి : మండలంలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి 866 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో టీడీపీ నేత ఇంట్లో 526 సీసాలు పట్టుబడ్డాయి. ఇనుగుంట పంచాయతీ వజ్జవారిపాళెంకు చెందిన టీడీపీ నేత వర్మారెడ్డి నివాసంలో మద్యం అక్రమ నిల్వ ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఇంట్లో 526 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి ఫ్లయింగ్ స్క్వాడ్ కాంతారావు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జాతీయ రహదారి రాజుపాళెం క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై జేపీ శ్రీనివాసులురెడ్డి తనిఖీలు నిర్వహిస్తుండ గా, ఇద్దరు వ్యక్తులు బైక్‌పై రెండు గోతాల్లో మద్యం సీసాలను తరలిస్తున్నారు. బైక్‌పై వెళుతున్న వ్యక్తి పోలీసులను చూసి బైక్ వేగంను పెం చాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి బైక్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కొద్ది దూరం వెళ్లే సరికి బైక్‌పై ఉన్న రెండు బస్తాలను పొలాల్లో పడేసి వెళ్లారు. బస్తాలను పరిశీలించి అందులోని 340 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పొలాల్లో 424 మద్యం సీసాలు.. : ముత్తుకూరు : ముత్తుకూరు సమీపంలోని చలివేంద్ర రోడ్డులోని పొలాల్లో దాచి ఉంచిన 424 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పొలాల్లోని ఓ గదిలో దాచిన మద్యం సీసాల బస్తాను ఓ వ్యక్తి సైకిల్‌పై తీసుకువెళుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బయపడిన అతను మద్యం సీసాల బస్తాను అక్కడే పడేసి వెళ్లిపోయాడు. పోలీసులు వచ్చి గదికి వేసిన తాళం పగులగొట్టి లెక్కించగా 424 మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించారు. మరో 811 మద్యం బాటిళ్లు.. : జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో మల్లమ్మగుడి వీధిలో 426 మద్యం బాటిళ్లను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, కాలేజీ మిట్టలో మరో 95 మద్యంబాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుత్తలూరు మండలంలో దుత్తలూరు, నర్రవాడ, చింతలగుంట ప్రాంతాల్లో 220 మద్యం బాటిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయగిరి నుంచి వివిధ గ్రామాలకు తరలిస్తున్న 70 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లుగా మారిన ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు వాకాడు న్యూస్‌లైన్ : మండలంలో పనిచేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. పని దినాలు తక్కువ కావడంతో కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇటీవల విధుల నుంచి తొలగించారు. వీరికి చింతామోహన్ ఎరవేసి తాను అండగా ఉండి మళ్లీ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని చింతామోహన్ ఇటీవల దుగరాజపట్నంలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా విధుల్లో ఉన్నవారిని కూడా పర్మినెంట్ చేయిస్తామని వారికి ఆశ కల్పించడంతో వారు కూడా కాంగ్రెస్ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. వీరే పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా నిలవనున్నారని సమాచారం. డబ్బు, మద్యం పంపకాలు కూడా వీరి చేతికే కాంగ్రెస్ నాయుకులు పగ్గాలు పట్టించినట్లు పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. -
ఏడుకొండలవాడి కరుణ ఎవరికో
తిరుపతిలో తగ్గిన కాంగ్రెస్ పరపతి తిరుపతి... ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం. అత్యంత ప్రాధాన్యవుున్న ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు వెళ్లడానికి అభ్యర్థులంతా ఉవ్విళ్లూరుతున్నారు. అరుుతే...ప్రధాన పోటీ వూత్రం వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ వుధ్యే నెలకొంది. ఈ త్రివుుఖ పోరులోనూ వైఎస్సార్ సీపీ వుుందుంది. సిటింగ్ ఎంపీగా ప్రజావ్యతిరేకత, పార్టీ దుస్థితి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు ప్రతికూలంగా వూరారుు. టీడీపీ శ్రేణుల సహాయు నిరాకరణ, పార్టీ కేడర్ బలహీనంగా ఉండటం బీజేపీ అభ్యర్థి జయురాంను కలవరపెడుతున్నారుు. ఇదే తరుణంలో బలమైన పార్టీ కేడర్, వైఎస్ జగన్ ప్రభంజనం వల్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు రేసులో వుుందు నిలిచారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఏకంగా 12 సార్లు గెలుపొందింది. ఒకసారి టీడీపీ, ఇంకొకసారి బీజేపీ విజయుం సాధించారుు. ఇక్కడి నుంచి రికార్డు స్థాయిలో ఆరుసార్లు గెలుపొందిన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ డాక్టర్ చింతామోహన్‌కు ఈ సారి ఎదురుగాలి వీస్తోంది. బీజేపీ అభ్యర్థిగా పోలీసు అధికారి కె.జయరాం తొలిసారి ఎన్నికల్లో తలపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాదరావు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, ఆయన మీద జనానికి ఉన్న అభిమానం, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం వరప్రసాద్‌కు సానుకూల వాతావరణాన్ని సృష్టించారుు. కాంగ్రెస్‌కు ‘చింత’! తిరుపతి నుంచి ఏడుసార్లు ఎంపీగా పోటీచేసిన చింతా మోహన్ ఆరుసార్లు విజయుం సాధించారు. 1984లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఆయున.. ఆ తర్వాత ఐదుసార్లు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యూరు. 1991-96 మధ్య కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డితో ఉన్న రాజకీయ వైరం కారణంగా 1996లో టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో నెలవల సుబ్రహ్మణ్యంకు అవకాశం వచ్చింది. 1998లో చింతా మోహన్ మళ్లీ టికెట్ సాధించుకుని గెలుపొందారు. 1999లోనూ పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి ఎన్.వెంకటస్వామి చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో 1,99,329 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన చింతామోహన్... 2009లో వూత్రం చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు 19,280 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఎదురుకావడంతో ఈసారి చిత్తూరు జిల్లా సత్యవేడు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అరుుతే లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు కరువు కావడంతో సిటింగ్ ఎంపీ చింతా మోహన్నే కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి బరిలోకి దించింది. దీంతో ఎనిమిదో సారి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల్లో ఎదురీతకు సిద్ధపడ్డారు. దూసుకెళుతున్న వెలగపల్లి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీకి సానుకూల పవనాలు వీస్తున్నారుు. నియోజకవర్గ పరిధిలోని ఒక్క వెంకటగిరి మినహాయిస్తే మిగిలిన ఆరు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి జనంలో పరపతి ఉన్న అభ్యర్థులే దొరకలేదు. దీంతో పోటీ నామమాత్రమే కానుంది. ఇదే తరుణంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఏడాది కాలంగా లోక్‌సభ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో వుమేకవుయ్యూరు. ఇది ఆయనకు కలిసొచ్చే అంశం. బీజేపీ నామమాత్రపు పోటీ టీడీపీతో ఎన్నికల పొత్తులో భాగంగా దక్కించుకున్న ఈ స్థానానికి బీజేపీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయింది. చివరకు పోలీసు అధికారి జయరాంను బరిలోకి దించింది. ఆయునకు టీడీపీ కేడర్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బీజేపీ నామమాత్రపు పోటీకే పరిమితమైంది. ఇదీ చరిత్ర తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అదే ఏడాది జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అనంతశయనం అయ్యంగార్ తన ప్రత్యర్థి, కేఎల్పీ అభ్యర్థి ఎల్బీ నాయుడుపై 6,037 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయున తొలి లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌గాను, రెండో స్పీకర్‌గాను పని చేశారు. ఈ లోక్‌సభ స్థానం 1957లో రద్దరుు్యంది. 1962లో మళ్లీ ఆవిర్భవించింది. అప్పట్నుంచి ఎస్సీలకు రిజర్వు అరుు్యంది. అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధి మారినా లోక్‌సభ స్థానం మాత్రం రిజర్వ్ స్థానంగా కొనసాగుతూ వస్తోంది. ఈ స్థానం నుంచి సి.దాస్ (1962, 1967) టి.బాలకృష్ణయ్య (1971, 1977), పసల పెంచలయ్య (1980), డాక్టర్ చింతామోహన్ ( 1984, 1989, 1991, 1998, 2004, 2009), నెలవల సుబ్రహ్మణ్యం (1996), డాక్టర్ ఎన్. వెంకటస్వామి (1999) ఎంపీలుగా పనిచేశారు. తిరుపతి 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి 18 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనే బరిలోకి దిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు టీడీపీపై వ్యతిరేకతతో ఉన్నారు. జయాపజయాలను ప్రభావితం చేసే టీటీడీ ఉద్యోగులు వైఎస్సార్ సీపీ పట్ల అభిమానంతో ఉండటం కరుణాకరరెడ్డికి లాభిస్తుంది. పైగా ఆయున గత రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. టీడీపీ అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేస్తున్నారు. ఆయన భూకబ్జాకోరని గత ఎన్నికలప్పుడు చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున వుబ్బు దేవనారాయుణరెడ్డి పోటీ చేస్తున్నారు. శ్రీకాళహస్తి తాజా వూజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ ఐదేళ్లలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే రైతులు, బీసీలు వైఎస్సార్ సీపీపై అభిమానం చూపుతున్నారు. యువ నాయకుడు బియ్యపు మధుసూదనరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయునకు ప్రజల్లో వుంచి పేరుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బత్తయ్యు నాయుుడు బరిలో ఉన్నారు. సత్యవేడు రైతులు, తమిళ ఎస్సీలు, బీసీలు గెలుపోటములను నిర్ణరుుస్తారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం రెండేళ్లుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ జనంలో గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. స్థానికులకు పరిచయుం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా టి.చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా నావువూత్రపు పోటీకే పరిమితవుని ప్రజలు చర్చించుకుంటున్నారు. సూళ్లూరుపేట ఇంజనీర్ కిలివేటి సంజీవయ్య వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయున చాలాకాలంగా జనంతో వుమేకమై ఉన్నారు. టీడీపీ అభ్యర్థి, తాజా వూజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నంపై వ్యతిరేకత ఉంది. టీడీపీలోని అంతర్గత విభేదాలూ ఆయున్ను కలవరపెడుతున్నారుు. కాంగ్రెస్ అభ్యర్థి డి.వుధుసూదనరావు ప్రభావం చూపే పరిస్థితి లేదు. ఇవన్నీ వైఎస్సార్ సీపీకి లాభించనున్నాయి. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో వైఎస్‌పై జనానికి ఉన్న అభిమానం, పటిష్టమైన పార్టీ నాయకత్వం సంజీవయ్య విజయూవకాశాలను మెరుగుపరుస్తున్నాయి. గూడూరు తాజా వూజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌పై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో డాక్టర్ జ్యోత్స్నలతను టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమె రాజకీయాలకు కొత్త. మునిసిపల్ మాజీ చైర్మన్ పాశం సునీల్‌కుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ రైతులు, ఎస్సీలు వైఎస్సార్ సీపీకి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ తరఫున పనబాక క్రిష్ణయ్యు పోటీ నామమాతమే. సర్వేపల్లి నెల్లూరు జెడ్పీ మాజీ చైర్మన్ కాకాణి గోవర్దన్‌రెడ్డి రెండేళ్లుగా వైఎస్సార్ సీపీ తరఫున జనంతో మమేకవుయ్యూరు. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. టీడీపీ అభ్యర్థిగా వూజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కె.పట్టాభిరావుయ్యు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీకి తిరుగులేదన్న భావన ప్రజల్లో ఉంది. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నుంచి తాజా వూజీ ఎమ్మెల్యే రామకృష్ణ పోటీలో నిలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రామకృష్ణ ఈ ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయులేదన్న భావన జనం లో కన్పిస్తోంది. ఇవన్నీ వైఎస్సార్ సీపీకి కలసిరానున్నారుు. వైఎస్సార్ సీపీ బలం, కొమ్మి లక్ష్మయ్యనాయుడుకు వ్యక్తిగతంగా జనంలో ఉన్న మంచి పేరు మిగిలిన రెండు పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. అభివృద్ధికి ఆనవాళ్లు * వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుపతిలో ఎస్వీ పశువైద్య, వేద విశ్వవిద్యాలయూలు ఏర్పాటు చేరుుంచారు. * తిరుపతి నగరాన్ని జేఎన్‌ఎన్‌యుూఆర్‌ఎం పథకంలో చేర్పించి రూ.వేల కోట్ల నిధులు విడుదల చేయించారు. * తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి పరిచారు. * గాలేరు - నగరి ప్రాజెక్టు పూర్తి చేయించారు. * శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరందించే తెలుగుగంగ ప్రాజెక్టు పనులు 90 శాతానికి పైగా పూర్తి చేయించారు. * సోమశిల-స్వర్ణముఖి కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. కృష్ణపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేయించారు. * మన్నవరంలో రూ.6 వేల కోట్లతో ఎన్బీపీపీఎల్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల విడిభాగాల తయారీ ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. కేంద్రంతో పోట్లాడి మరీ ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు తన్నుకు పోకుండా చూశారు. దీనివల్ల 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. * సత్యవేడు సెజ్‌లో దేశీయ, విదేశీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. * ముత్తుకూరు మండలం నేలటూరులో 1,600 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేరుుంచారు. * సోమశిల జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని 36 టీఎంసీల నుంచి 72 టీఎంసీలకు పెంచారు. దీనివల్ల శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తాగునీరు, 2.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. సమాధి రాళ్లు 1. చంద్రబాబు వుుఖ్యవుంత్రిగా ఉన్నప్పుడు 1996లో కృష్ణపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత దాన్ని పట్టించుకోలేదు. 2. గాలేరు -నగరి ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారు. అప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించి...రైతులకు అన్యాయుం చేశారు. 3. ఉబ్బలవుడుగు రిజర్వాయుర్ ఆధునికీకరణకు హామీ ఇచ్చినా.. రూపారుు కూడా విడుదల చేయులేదు. 4. వుుత్తుకూరు వద్ద 1991లో అప్పటి సీఎం నేదురువుల్లి జనార్దనరెడ్డి ప్రారంభించిన ఫిషరీస్ సైన్స్ కళాశాలను చంద్రబాబు 1996లో వురోసారి ప్రారంభించి షో చేశారు. జీవనాడి కుటుంబానికి ప్రాణదాత.. విద్యాప్రదాత నేను స్టిక్కరింగ్ చేసుకుంటూ బతుకుతున్నా. ఈ పనితోనే కుటుంబాన్ని పోషిస్తున్నా. మా అమ్మ అరవంబేటి గురవమ్మకు గతంలో గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. రెండు రక్త నాళాలు దెబ్బతిన్నాయని, ఆపరేషన్ చేయూలని డాక్టర్లు చెప్పారు. చేతిలో రూపాయి లేదు. ఏమి చేయూలో పాలుపోలేదు. 2007 మార్చిలో సవుస్య వురింత తీవ్రమైంది. చివరకు ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఈ పథకం కింద విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేశారు. ఐదేళ్ల తరువాత నాకు కూడా గుండెనొప్పి వచ్చింది. అర్జంట్‌గా ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. తిరుపతి స్విమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నా. ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా. ఇదంతా వైఎస్ చలవే. ఆయున పుణ్యమా అని నా కొడుకు విశ్వతేజను కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా కార్పొరేట్ కాలేజీలో చదివించా. ప్రస్తుతం నాయుడుపేట దగ్గర ఉన్న గ్రీన్‌టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు విష్ణుప్రియ హ్యాండ్లూమ్ అండ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. వూ కుటుంబం మొత్తం వైఎస్‌కు రుణపడి ఉంది. - అవరంబేటి వీరప్రసాద్, నాయుడుపేట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) -
2016లో మధ్యంతర ఎన్నికలు: ఎంపీ చింతా
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, 2016లో మధ్యంతర ఎన్నికలు తప్పవని తిరుపతి ఎంపీ చింతా మోహన్ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ తప్పదన్నారు. ముందున్న రెండు పార్టీలకు ఒక్కోదానికి 70, కాంగ్రెస్‌కు 25 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చింతా మోహన్ చెప్పారు. తెలంగాణలో 119 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని అధికారాన్ని చేపడుతుందన్నారు. -
ఐదేళ్లుగా మాకేం చేశారు?
వాకాడు: తిరుపతి ఎంపీ చింతామోహన్‌కు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగరాజపట్నంలో ప్రజల నుంచి చుక్కెదురైంది. సోమవారం ఆయన దుగరాజపట్నంలో పర్యటించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఈ ప్రాంతానికి ఏం చేశావని స్థానికులు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక మౌనం దాల్చారు. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ నుంచి దుగరాజపట్నం చెరువుకు సాగునీటి సరఫరా చేసే కాలువకు నిధులు మంజూరైనా, పనులు చేపట్టకపోవడంపై నిలదీశారు. స్థానికులు ఏమి అడిగినా ఆయన నుంచి సమాధానం కరువైంది. కాగా, బుధవారం నెల్లూరు పర్యటనకు రానున్న కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ను దుగరాజపట్నం సమీపంలోని అంజి లాపురానికి తీసుకొచ్చేందుకు చింతా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నేదురుమల్లి అనుచరులతో వచ్చిన ఆయన జైరాం రమేశ్‌తో పాటు ఆనం రామనారాయణరెడ్డి తదితర నేతలతో ఇక్కడ సభ నిర్వహించే విషయమై చర్చించారు. -
అరచేతిలో పథకం
ఎన్నికలు వస్తే చాలు తిరుపతిపై ఆయన చాలా ప్రేమ కురిపిస్తారు. వందల వేల కోట్ల పథకాలకు హామీలు ఇస్తారు. ఆ తర్వాత తిరుపతివాసులకు మిగిలేది గుండు సున్న మాత్రమే. ఆయన పేరు చింతా మోహన్. తిరుపతి పార్లమెంట్ సభ్యులు. సాక్షి, తిరుపతి: చింతా మోహన్ అరచేతి లో స్వర్గం చూపుతున్నారు. ఆయ న చెప్పే మాటలకు చేతలకు పొంతనే ఉండదు. వందలు వేల కోట్ల రూపాయలతో కొత్త కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇట్టే ప్రకటిస్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెచ్చినట్టు చెప్పుకుంటారు. వీటిలో చాలా వాటికి క్షేత్రస్థాయిలో దిక్కూమొక్కూ ఉండదు. కొన్ని మాత్రం మొక్కుబడిగా అమల్లో ఉంటాయి. అధికారులను నయానోభయానో గుప్పెట్లోకి తెచ్చుకుని తాను ఏదో చేస్తున్నట్టు వారి చేత కూడా చెప్పిస్తారు. అక్కరకు రాకపోతే వారిపైనే అభాండాలు వేయడానికి వెనుకాడరు. జిల్లా స్థాయి ముఖ్యమైన సమావేశాలను ఇందుకు వేదిక చేసుకుంటారు. ఆ సమావేశాల్లో సంబంధిత అధికారులపై విమర్శలు గుప్పించి వారిని చులకన చేయడం, వివాదాస్పదం చేయడం ఆయనకు మహా సరదా అంటే అతిశయోక్తి కాదు. ఇక ఎన్నికల ముందు ఇచ్చే హామీలకు అంతే ఉండదు. ఆ హామీలను నెరవేర్చడంలో ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించక తప్పదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో తిరుపతి కార్పొరేషన్‌కు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసింది. ఆయన మరణానంతరం ఆ పథకం అమలు నీరుగారిపోయింది. ప్రస్తుతం ఇందిరా ఆవాస్ యోజన కింద 7,004 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం జేఎన్ఎన్యూఆర్ఎంలో భాగమే. అయితే దీనిని కొత్త పథకంగా సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. కాగా తిరుపతి నగరానికి సంబంధించి చింతామోహన్ ఇచ్చిన హామీలు, అమల్లోకి వచ్చిన అంశాలు మచ్చుకు కొన్ని ... హామీలు... రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరిస్తాం. తిరుపతిలో ఇంటర్నేషనల్ క్రికెట్స్టేడియం ఏర్పాటు. రూ.400 కోట్లతో తిరుపతి నగరాభివృద్ధికి కృషి(కిందటి ఏడాది తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో) మహిళా సంఘాల ద్వారా టీడీడీకి చక్కెర కొనుగోలు అప్పగింత. తిరుమలలో నిరుపేదలకు షాపుల కేటాయింపు, స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో మహిళలకు మెడికల్ షాపుల నిర్వహణకు అనుమతి.. నెరవేర్చిన తీరు... రేణిగుంట విమానాశ్రయం ఆధునికీకరణ ఏ మాత్రం ముందుకు సాగలేదు. కేవలం రాత్రివేళల్లో విమానాల ల్యాండింగ్‌కు పరిమితం. తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. కేవలం మోడల్ స్టేషన్‌కు పరిమితం చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఊసే లేదు. రూ.400 కోట్లు కాదు కదా ప్రత్యేకంగా నాలుగు రూపాయలు తెచ్చిన దాఖలాలు లేవు. టీటీడీకి చక్కెర కొనుగోలు బాధ్యత మహిళలకు అప్పగించే విషయంలో పురోగతి శూన్యం. తిరుమలలో షాపులు, స్విమ్స్, రుయాల్లో మెడికల్ షాపుల కేటాయింపుల్లోనూ చర్యలు లేవు. -
వ్యవసాయం, వ్యాపారం దండగ: ఎంపీ చింతా
సూళ్లూరుపేట: రాష్ట్రంలో వ్యవసాయం, వ్యాపారం దండగని తిరుపతి ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో శనివారం రాత్రి నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమన్నారు. పక్షుల కోసం 1.05 లక్షల ఎకరాలు పులికాట్ సరస్సుకు అవసరమా అని ప్రశ్నించారు. ఐదువేల ఎకరాలు మాత్రం సరస్సుకు కేటాయించి, మిగిలిన విస్తీర్ణాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి పండగలు అవరసమే అయినా దుగరాజపట్నం లాంటి నౌకాశ్రయం కావాలని చెప్పారు. ఎన్ని రాకెట్లు అడ్డువచ్చినా, ఎన్ని కమ్యూనిస్టు కొంగలు అడ్డు వచ్చినా 2018 నాటికి పోర్టు ఏర్పాటుచేసి తీరుతామని పేర్కొన్నారు. పక్షుల పేర్లు చెప్పి తీర గ్రామాల్లో రోడ్డు వేయకుండా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. -
తప్పించుకు తిరుగువారు..
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జనాగ్రహానికి స్పం దించడం లేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమాలకు చలించ డం లేదు. ఓట్లేసి గెలి పించిన జనం ప్రయోజనాల కంటే, అధిష్టానం అనుగ్రహమే ముఖ్యమనుకొంటున్నారు. సాటి సీమాంధ్ర ఎంపీలతో కలసి సమైక్యాంధ్రను కాపాడేందుకు ఇసుమంత ప్రయత్నమూ చేయడం లేదు. తిరుపతి ఎంపీ చింతా మోహన్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నరసాపురం లోక్‌సభ సభ్యుడు కనుమూరి బాపిరాజులకు సమైక్యవాదం కంటే పార్టీ, పదవులే ముఖ్యమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినా వీరు స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పక్క నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు. అయితే తిరుపతికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అధిష్టానానికి ఎక్కడ ఆగ్రహం కలుగుతుందో అన్న భయంతో అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. వీరి వైఖరి పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అవిశ్వాస తీర్మానాలపై సంతకాలు చేయని సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించాల్సిందిగా ఇప్పటికే ఏపీఎన్జీవోల సంఘం పిలుపునిచ్చింది. గతంలో సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో సమైక్య వాణి వినిపించి సస్పెండ్‌కాగా చింతా మోహన్ మాత్రం వారికి దూరంగా ఉన్నారు. కొందరు ఎంపీలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామాలు సమర్పించినా చింతా మోహన్ ఆ ఆలోచనే చేయలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మొదటి నుంచి దూరంగానే ఉంటున్న చింతా మోహన్ పార్లమెంటులోనూ ఉద్యమిస్తున్న సీమాంధ్ర ఎంపీలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. సాటి ఎంపీలతో కలసి ఒక్కసారి ఆంటోని కమిటీ సమావేశానికి వెళ్లడం మినహా సమైక్యాంధ్రకు సంబంధించి ఆయన ఇంతవరకూ చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జేఏసీ నేతలు ఆయన ఇంటిని ముట్టడించినా, రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. రాజీనామా చేస్తే తిరిగి గెలిపిస్తామంటూ ఎన్జీవోల జేఏసీ ప్రకటించినా ఆయన నుంచి స్పందన రాలేదు. ఉద్యమానికి దూరంగా ఉన్న ఆయనకు ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి లభించడం ఉద్యమకారులను మరింతగా రెచ్చగొట్టింది. దీంతో, ఉద్యమకారులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలను పెంచాలని భావిస్తున్నారు. జిల్లాకే చెందిన మరో ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్లో హల్చల్ చేస్తుండగా చింతా మోహన్మాత్రం సమైక్యానికి మొహం చాటేస్తున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైఖరిలో మార్పురాకుంటే రానున్న ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కామెడీతో కాలక్షేపం చేస్తున్నారు. సమైక్య ఉద్యమంలో గ ట్టిగా పాల్గొంటే పదవి ఎక్కడ ఊడుతుందో అన్న భయంతో తప్పించుకు తిరుగుతున్నారు. పిలుపునిచ్చింది. గతంలో సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో సమైక్య వాణి వినిపించి సస్పెండ్‌కాగా చింతా మోహన్ మాత్రం వారికి దూరంగా ఉన్నారు. కొందరు ఎంపీలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామాలు సమర్పించినా చింతామోహన్ ఆ ఆలోచనే చేయలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మొదటి నుంచి దూరంగానే ఉంటున్న చింతామోహన్ పార్లమెంటులోనూ ఉద్యమిస్తున్న సీమాం ధ్ర ఎంపీలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. సాటి ఎంపీలతో కలసి ఒక్కసారి ఆంటోని కమిటీ సమావేశానికి వెళ్లడం మినహా సమైక్యాంధ్రకు సంబంధించి ఆయన ఇంతవరకూ చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జేఏసీ నేతలు ఆయన ఇంటిని ముట్టడించినా, రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. రాజీనామా చేస్తే తిరిగి గెలిపిస్తామంటూ ఎన్జీవోల జేఏసీ ప్రకటించినా ఆయన నుంచి స్పందన రాలేదు. ఉద్యమానికి దూరంగా ఉన్న ఆయనకు ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి లభించడం ఉద్యమకారులను మరింతగా రెచ్చగొట్టింది. ఉద్యమకారులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలను పెంచాలని భావిస్తున్నారు. జిల్లాకే చెందిన మరో ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్లో హల్చల్ చేస్తుండగా చింతామోహన్ మాత్రం సమైక్యానికి మొహం చాటేస్తున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైఖరిలో మార్పురాకుంటే రానున్న ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కామెడీతో కాలక్షేపం చేస్తున్నారు. సమైక్య ఉద్యమంలో గట్టిగా పాల్గొంటే పదవి ఎక్కడ ఊడుతుందో అన్న భయంతో తప్పించుకు తిరుగుతున్నారు. -
రచ్చగా ముగిసిన ‘రచ్చబండ’
సాక్షి, తిరుపతి: రచ్చబండ కార్యక్రమం జిల్లాలో రచ్చ రచ్చగా జరిగింది. ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగిన ర చ్చబండకు పలు చోట్ల సమైక్య సెగ తగిలింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న రచ్చబండ కార్యక్రమాలు ఒక మోస్తరుగా జరిగినా మిగి లిన సమావేశాలు మాత్రం తూతూమంత్రంగా సాగాయి. కొన్ని చోట్ల దరఖాస్తులు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండు విడతలుగా పర్యటిం చి, మూడు ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి గల్లా అరుణ కుమారి తిరుచానూరులోని అర్బ న్ హట్లో రచ్చబండ కార్యక్రమం చేపట్టగా, గత హామీలను ప్రశ్నించేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరిలో రచ్చబండను నిర్వహించడానికి ముందే వైఎస్ఆర్ సీపీ నాయకులు కొటాల చంద్రశేఖ ర్ రెడ్డి, యుగంధర్ రెడ్డిని అరెస్టు చేశా రు. తిరుపతి ఎంపీ చింతా మోహన్‌కు వెళ్లిన ప్రతి చోటా సమైక్య సెగ తగి లింది. నాగలాపురం, పిచ్చాటూరులో ఆయన పాల్గొనగా సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే పరిస్థితి తిరుపతిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలోను ఎంపీకి ఎదురయింది. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో ఈనెల 21వ తేదీన జరిగిన రచ్చబండలో ముందు తమ సమస్యలు వినాలంటూ ప్రజలు పట్టుబట్టడంతో ఎంపీ అర్ధంతరంగా వెనుదిరిగారు. దీనికి నిరసనగా రోడ్డుపై బైఠాయించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని అరెస్టు చేసి విడుదల చేశారు. ఎంపీపై వాటర్ బాటిల్ విసిరారనే ఆరోపణపై మరో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీదేవి టేబుల్‌పైకి ఎక్కి వీరంగం చేసినా, ఆమెపై కేసు నమోదు చేయలేదు. అధికార పార్టీ నిర్వహించిన అన్ని రచ్చబండ కార్యక్రమాల్లోను తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. కాగా పుత్తూరులో రూ.25 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా, ప్రారంభించక పోవడంతో నగిరి ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడును స్థానికులు రచ్చబండలో అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతల కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారంటూ ప్రజలు ఆరోపించడంతో, ముద్దుకృష్ణమ నాయుడు వెళ్లి ఆ బ్రిడ్జిని ప్రారంభించారు. కలెక్టర్ రాంగోపాల్ రచ్చబండ షెడ్యూలును ముందుగా ప్రకటించినా, దాని ప్రకారం అధికారులు కార్యక్రమాలు నిర్వహించలేదు. -
తిరుపతిలో రచ్చబండ రచ్చరచ్చ
సాక్షి, తిరుపతి : తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అధికారులు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. కార్యక్రమం ప్రారంభం కాగానే కార్పొరేషన్ కమిషనర్ గత రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల వివరాలు తెలిపి, ఎంపీ చింతామోహన్ మాట్లాడతారని ప్రకటించారు. ముందుగా తమ సమస్యలు విని, తరువాత ఎంపీ మాట్లాడాలని వైఎస్ఆర్ సీపీ నాయకులు కోరారు. దీనికి ఆయన అంగీకరించకుండా మాట్లాడే ప్రయత్నం చేయడంతో ‘చింతా మోహన్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నగర నాయకురాలు శ్రీదేవి, వేదికపై ఉన్న టేబుల్పెకైక్కి ఎంపీని ప్రశ్నిస్తున్న వారితో వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకునే యత్నం చేశారు. ఈ నేపథ్యంలో చింతా మోహన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ‘సమైక్య ఉద్యమంలో కనిపించని చింతా’ అంటూ నినాదాలు చేస్తూ, గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై వాటర్ బాటిల్ విసిరాడు. ఈలోపు అధికారులు కూడా నిష్ర్కమించడంతో రచ్చబండ నిలిచిపోయింది. ఎమ్మెల్యే అరెస్టు : మరోవైపు అధికారులు రచ్చబండను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు రాకపోవడంతో అక్కడినుంచి వెళ్లి ఎదురుగా రోడ్డుపై పడుకుని గంటపాటు ఆందోళన చేశారు. పోలీసులు ఎమ్మెల్యేని, కార్యకర్తలను అరెస్టు చేశారు. సొంత పూచీకత్తుపై భూమనను విడుదల చేయగా, కార్యకర్తలపై కేసు నమోదుచేశారు. -
తిరుపతిలో రచ్చబండ రసాభాస
తిరుపతి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యాక్రమం ముఖ్యమంత్రి కిరణ్ సొంత జిల్లాలో రచ్చ రచ్చ అయ్యింది. అధికార పార్టీ ఎంపీ చింతా మోహన్‌కు రచ్చబండలో చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో గురువారం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీని సమస్యలు పరిష్కరించాలంటూ నిలదీశారు. సమస్యలపై సరైన సమాధానం రాకపోవటంతో ఆగ్రహించిన మహిళలు.... ఎంపీపై బాటిళ్లు విసిరి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో చింతా మోహన్ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇదే రచ్చబండ కార్యక్రమంలోనే సీపీఎం కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఎంపీ చింతా మోహన్ సమైక్యవాదుల నుంచి నిరసనలు ఎదుర్కొన్నారు. కాగా సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాళహస్తి సమీపంలో చింతా మోహన్‌కు సమైక్య సెగ
కాంగ్రెస్ పార్టీ ఎంపీ చింతా మోహన్‌కు ఆదివారం సమైక్య సెగ తగిలింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి శ్రీకాళహస్తికి వెళ్తున్న చింతామోహన్‌ను ఏపీఎన్జీవోలతోపాటు సమైక్యవాదులు ఆదివారం ఉదయం అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే పదవికి రాజీనామా చేయాలని వారు చింతా మోహన్‌ను డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందులోభాగంగా ఎంపీ వాహనాన్ని అడ్డగించి రోడ్డుపై వారంతా బైఠాయించారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి, చింతా మోహన్ వాహనాన్ని అక్కడి నుంచి పంపివేశారు.