'రిగ్గింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి' | Rigging in tirupati by elections, says chinta mohan | Sakshi
Sakshi News home page

'రిగ్గింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి'

Published Fri, Feb 13 2015 8:40 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

'రిగ్గింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి' - Sakshi

'రిగ్గింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి'

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని... టీడీపీ అక్రమ పద్దతులు అనుసరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.  శుక్రవారం తిరుపతిలో చింతామోహన్ మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడానికి టీడీపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఒంటి గంట తర్వాత రిగ్గింగ్ చేయడానికి టీడీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుందని విమర్శించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే టీడీపీ మట్టికరుస్తుందని... కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు.

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో గతేడాది డిసెంబర్ 15న మరణించారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ తమ అభ్యర్థిగా వెంకటరమణ సతీమణి సుగుణమ్మను నిలిపింది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నిక శుక్రవారం ప్రారంభమైంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement