‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక మరో కథుంది! | Another Fowl Play Behind Cash For Vote Scam | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక మరో కథుంది!

Published Sun, Jul 12 2015 10:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక మరో కథుంది!

‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక మరో కథుంది!

తిరుపతి కల్చరల్: ‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక అసలు కథ మరొకటి ఉందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ మంత్రులు తమకు హైదరాబాద్‌లో ఉన్న వెయ్యి ఎకరాల భూములను కాపాడుకునేందుకు ప్రయత్నించారన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డు తగలడంతో దాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర పడిందన్నారు.

కానీ టీడీపీ నేతలు ఏసీబీకి దొరికిపోవడంతో వారి నిజస్వరూపం బయట పడిందని చెప్పారు. ఏపీలో ఆగస్టు చివరికల్లా రాజకీయ సంక్షోభం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. అధికార పార్టీ నాయకులే తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే చిత్తూరు, కడప జిల్లాలు అభివృద్ధి చెందడంతోపాటు లక్ష ఉద్యోగాలు వస్తాయని, అయినా ప్రభుత్వం దానిపై దృష్టి సారించడంలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement