సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎన్.రఘువీరారెడ్డి ససేమిరా అంటున్నారు. సొంత పనులపై బిజీగా ఉన్నందున నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండలేనంటూ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక తప్పనిసరి కావడంతో పలువురు నేతలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్‌లు ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. అయితే వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని పారీ్టలో అధిక శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.
ఈ సారి మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీ మాజీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలసి విన్నవించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును ఎంపిక చేయాలని భావిస్తున్నా ఆయన సుముఖంగా లేనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోవాలంటూ ఎక్కువ మంది అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీకి అధిష్టానం సూచించింది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment