
తప్పించుకు తిరుగువారు..
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జనాగ్రహానికి స్పం దించడం లేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమాలకు చలించ డం లేదు. ఓట్లేసి గెలి పించిన జనం ప్రయోజనాల కంటే, అధిష్టానం అనుగ్రహమే ముఖ్యమనుకొంటున్నారు. సాటి సీమాంధ్ర ఎంపీలతో కలసి సమైక్యాంధ్రను కాపాడేందుకు ఇసుమంత ప్రయత్నమూ చేయడం లేదు. తిరుపతి ఎంపీ చింతా మోహన్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నరసాపురం లోక్‌సభ సభ్యుడు కనుమూరి బాపిరాజులకు సమైక్యవాదం కంటే పార్టీ, పదవులే ముఖ్యమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినా వీరు స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పక్క నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు. అయితే తిరుపతికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అధిష్టానానికి ఎక్కడ ఆగ్రహం కలుగుతుందో అన్న భయంతో అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. వీరి వైఖరి పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
అవిశ్వాస తీర్మానాలపై సంతకాలు చేయని సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించాల్సిందిగా ఇప్పటికే ఏపీఎన్జీవోల సంఘం పిలుపునిచ్చింది. గతంలో సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో సమైక్య వాణి వినిపించి సస్పెండ్‌కాగా చింతా మోహన్ మాత్రం వారికి దూరంగా ఉన్నారు. కొందరు ఎంపీలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామాలు సమర్పించినా చింతా మోహన్ ఆ ఆలోచనే చేయలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మొదటి నుంచి దూరంగానే ఉంటున్న చింతా మోహన్ పార్లమెంటులోనూ ఉద్యమిస్తున్న సీమాంధ్ర ఎంపీలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. సాటి ఎంపీలతో కలసి ఒక్కసారి ఆంటోని కమిటీ సమావేశానికి వెళ్లడం మినహా సమైక్యాంధ్రకు సంబంధించి ఆయన ఇంతవరకూ చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జేఏసీ నేతలు ఆయన ఇంటిని ముట్టడించినా, రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. రాజీనామా చేస్తే తిరిగి గెలిపిస్తామంటూ ఎన్జీవోల జేఏసీ ప్రకటించినా ఆయన నుంచి స్పందన రాలేదు.
ఉద్యమానికి దూరంగా ఉన్న ఆయనకు ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి లభించడం ఉద్యమకారులను మరింతగా రెచ్చగొట్టింది. దీంతో, ఉద్యమకారులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలను పెంచాలని భావిస్తున్నారు. జిల్లాకే చెందిన మరో ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్‌లో హల్‌చల్ చేస్తుండగా చింతా మోహన్‌మాత్రం సమైక్యానికి మొహం చాటేస్తున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైఖరిలో మార్పురాకుంటే రానున్న ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కామెడీతో కాలక్షేపం చేస్తున్నారు. సమైక్య ఉద్యమంలో గ ట్టిగా పాల్గొంటే పదవి ఎక్కడ ఊడుతుందో అన్న భయంతో తప్పించుకు తిరుగుతున్నారు.
పిలుపునిచ్చింది. గతంలో సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో సమైక్య వాణి వినిపించి సస్పెండ్‌కాగా చింతా మోహన్ మాత్రం వారికి దూరంగా ఉన్నారు. కొందరు ఎంపీలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామాలు సమర్పించినా చింతామోహన్ ఆ ఆలోచనే చేయలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మొదటి నుంచి దూరంగానే ఉంటున్న చింతామోహన్ పార్లమెంటులోనూ ఉద్యమిస్తున్న సీమాం ధ్ర ఎంపీలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. సాటి ఎంపీలతో కలసి ఒక్కసారి ఆంటోని కమిటీ సమావేశానికి వెళ్లడం మినహా సమైక్యాంధ్రకు సంబంధించి ఆయన ఇంతవరకూ చేసిందేమీ లేదు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జేఏసీ నేతలు ఆయన ఇంటిని ముట్టడించినా, రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. రాజీనామా చేస్తే తిరిగి గెలిపిస్తామంటూ ఎన్జీవోల జేఏసీ ప్రకటించినా ఆయన నుంచి స్పందన రాలేదు. ఉద్యమానికి దూరంగా ఉన్న ఆయనకు ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి లభించడం ఉద్యమకారులను మరింతగా రెచ్చగొట్టింది. ఉద్యమకారులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలను పెంచాలని భావిస్తున్నారు. జిల్లాకే చెందిన మరో ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్‌లో హల్‌చల్ చేస్తుండగా చింతామోహన్ మాత్రం సమైక్యానికి మొహం చాటేస్తున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైఖరిలో మార్పురాకుంటే రానున్న ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కామెడీతో కాలక్షేపం చేస్తున్నారు. సమైక్య ఉద్యమంలో గట్టిగా పాల్గొంటే పదవి ఎక్కడ ఊడుతుందో అన్న భయంతో తప్పించుకు తిరుగుతున్నారు.