వ్యవసాయం, వ్యాపారం దండగ: ఎంపీ చింతా | Agriculture, Business Waste: MP Chinta Mohan | Sakshi
Sakshi News home page

వ్యవసాయం, వ్యాపారం దండగ: ఎంపీ చింతా

Published Sun, Jan 12 2014 10:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

వ్యవసాయం, వ్యాపారం దండగ: ఎంపీ చింతా - Sakshi

వ్యవసాయం, వ్యాపారం దండగ: ఎంపీ చింతా

సూళ్లూరుపేట: రాష్ట్రంలో వ్యవసాయం, వ్యాపారం దండగని తిరుపతి ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో శనివారం రాత్రి నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమన్నారు. పక్షుల కోసం 1.05 లక్షల ఎకరాలు పులికాట్ సరస్సుకు అవసరమా అని ప్రశ్నించారు.

ఐదువేల ఎకరాలు మాత్రం సరస్సుకు కేటాయించి, మిగిలిన విస్తీర్ణాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి పండగలు అవరసమే అయినా దుగరాజపట్నం లాంటి నౌకాశ్రయం కావాలని చెప్పారు. ఎన్ని రాకెట్లు అడ్డువచ్చినా, ఎన్ని కమ్యూనిస్టు కొంగలు అడ్డు వచ్చినా 2018 నాటికి పోర్టు ఏర్పాటుచేసి తీరుతామని పేర్కొన్నారు. పక్షుల పేర్లు చెప్పి తీర గ్రామాల్లో రోడ్డు వేయకుండా అడ్డుకోవడం మంచిది కాదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement