sullurpet
-
చిన్న ఉపగ్రహాల కోసం ఎస్ఎస్ఎల్వీ
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వదేశీ, విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ఉపగ్రహ వాహకనౌక రూపకల్పన పూర్తి చేసి ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.గత ఏడాదిలోనే ప్రయోగం చేపట్టాలని అనుకున్నప్పటికి కోవిడ్–19 లాక్డౌన్ ప్రభావంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మాత్రం ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రాకెట్ డిజైన్ చేసి చిన్న తరహా ఉపగ్రహాలను రెగ్యులర్‌గా ప్రయోగించేందుకు రూపొందించారు. ప్రపంచ మార్కెట్లో అత్యంత చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయం భారత్ నేడు ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా అవతరించింది. 2022 ఆఖరు నాటికి ఎస్ఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా వంద కిలోలు నుంచి 500 కిలోలు బరువు కలిగిన 6000 వేలు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే పీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా 33 దేశాలకు చెందిన 328 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవిర్భవించింది. నూతన ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కృషి కొత్త ప్రయోగాల కోసం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో కులశేఖర పట్నం అనే ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ప్రయోగ వేదికను నిర్మించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థల పరిశీలన చేసి భూసేకరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాన్ని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించాలని అనేక దేశాల నుంచి వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను పంపించాల్సిన వ్యవహారానికి మంచి డిమాండ్ ఉండడంతో దీనికోసమే ప్రత్యేకంగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను రూపొందిస్తున్నారు. ఎస్ఎస్ఎల్వీ రూపు రేఖలు ఇలా.. స్మాల్ శాటిలైట్ లాంఛింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. 34 మీటర్లు ఎత్తు, రెండు మీటర్లు వ్యాసార్థం కలిగి వుంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు దాకా వుంటుంది. 500 కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టే విధంగా డిజైన్ చేశారు. ఈ రాకెట్‌ను వర్టికల్ పొజిషన్లో పెట్టి ప్రయోగించనున్నారు. అంటే ఇస్రో మొదటి రోజుల్లో ఎస్ఎల్వీ రాకెట్‌ను కూడా వర్టికల్ పొజిషన్లోనే పెట్టి ప్రయోగించారు. దీనికి షార్ కేంద్రంలో పాత లాంచ్‌ప్యాడ్ కూడా సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ను కూడా పీఎస్ఎల్వీ రాకెట్ లాగానే నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్‌కు మొదటి, మూడో దశలు ఘన ఇంధనం, రెండు, నాలుగో దశలు ద్రవ ఇంధనంతో ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను మాత్రం మొదటి, రెండు, మూడు దశలు ఘన ఇంధనంతోనే చేస్తారు. ఇందులో ద్రవ ఇంధనం దశమాత్రం వుండదు. నాలుగోదశలో మాత్రం వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశ కొత్తగా అమర్చారు. ఆ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెడతారన్నమాట. 2022 ఆఖరు నాటికి 6000 చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఈ రాకెట్‌ను రూపొందించారు. ఇక విదేశీ ఉపగ్రహాలన్నింటిని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించనుండడం కొసమెరుపు. ఆస్ట్రోనాట్ విద్యార్థులకు అనుగుణంగా... దేశీయంగా పలు యూనివర్శిటీలకు చెందిన ఆస్ట్రోనాట్ విద్యార్థులు ఎక్స్ఫర్మెంటల్గా చిన్న చిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. వాణిజ్యపరంగా విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భవిష్యత్తులో ఈ రాకెట్ ఉపయోగపడనుంది. విద్యార్థులను అంతరిక్ష ప్రయోగాలల్లో విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించి శాస్త్రవేత్తలుగా మార్చాలన్న లక్ష్యంతో ఇస్రో దృష్టిసారించింది. ఆ మేరకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. దేశ, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తోంది. చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేసుకుని ముందుకొస్తే ఇస్రో ఉచితంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ఎస్‌ఎఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగంతో పాటు విద్యార్థులు తయారు చేసిన ఆనంద్–01 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్
సూళ్లూరుపేట : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మంగళవారం ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇక్కడి పులికాట్ సరస్సుకు ఏటా ఈ శీతాకాలంలో పక్షులు విదేశాల నుంచి వలస వస్తుంటాయి. ఈ సందర్భంగానే స్థానిక ప్రభుత్వ పాఠశాల వేదికగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. -
నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం
-
రేషన్ బియ్యం లారీ పట్టివేత
దొరవారిసత్రం : అక్రమంగా లారీలో 329 బస్తాల రేషన్ బియ్యంతో నెల్లూరు వైపు వెళ్తున్న లారీని దొరవారిసత్రం పోలీసులు తల్లంపాడులోని స్వర్ణా టోల్‌ప్లాజా వద్ద శనివారం రాత్రి పట్టుకున్నారు. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు.. రేషన్ బియ్యంతో సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వైపు లారీ వెళ్తున్న విషయం ఫోన్ ద్వారా సమాచారం రావడంతో తమ సిబ్బందితో ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించామన్నారు. రేషన్ బియ్యంతో వెళ్లే లారీని గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్రిడ్జిని ఢీకొన్న కారు
వ్యక్తి దుర్మరణం సూళ్లూరుపేట : కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొన్న ప్రమాదంలో ఇస్రో విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డులో కుదిరి–అటకానితిప్ప మధ్యలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నైలోని ఇస్రో అతిథి భవనంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన శివాజీ (64), ఝాన్సీరాణి దంపతులు శ్రీహరికోటలోని కామాక్షమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసుకునేందుకు చెన్నై నుంచి ఈ నెల 1న సూళ్లూరుపేటలోని తన స్నేహితుడు వీరాస్వామి ఇంటికి వచ్చారు. రెండు రోజులు ఇక్కడే ఉన్నారు. బుధవారం శివాజీ, ఝాన్సీరాణి, వీరాస్వామి,వాణి దంపతులు శ్రీహరికోటలోని కామాక్షమ్మకు పూజలు చేసుకుని తిరిగి కారులో వస్తుండగా అదుపుతప్పి బ్రిడ్జికి ఢీకొంది. కారు డ్రైవింగ్ చేస్తున్న శివాజీ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న ఝాన్సీరాణి, వీరాస్వామి, వాణితో పాటు మరో గుర్తు తెలియని మహిళ తీవ్రంగా గాయపడ్డారు. కారులో వస్తుండగా పేరు తెలియని ఓ మహిళ లిప్ట్ అడగడంతో ఎక్కించుకున్నారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా షార్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన శివాజీ మృతదేహాన్ని స్థానిక గ్లోబల్ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి కుమారుడు, కుమార్తె ఇద్దరు అమెరికాలో ఉండడంతో వారు వచ్చేవరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచి వారు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని ఎస్సై జీ గంగాధర్‌రావు తెలిపారు. -
టీడీపీలో నాలుగు స్తంభాలాట!
నేతల మధ్య ముదిరిన విబేధాలు నామినేటెడ్ పదవుల కోసం పోటాపోటీ మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుందనే చందంగా తయారైంది టీడీపీలో పరిస్థితి. పదవుల సంఖ్య పరిమితంగా ఉండటం వాటిని ఆశించే నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వర్గవిబేధాలు ముదిరిపాకాన పడుతున్నాయి. నామినేటెడ్ పదవుల నేతల మధ్య పోటీ తీవ్రమైంది. నాలుగు వర్గాలుగా విడిపోయి పదవులు, పనుల కోసం లోలోన పోట్లాడుకుంటున్నారు. సూళ్లూరుపేట: మొదటి నుంచి వేనాటి రామచంద్రారెడ్డి, కొండేపాటి గంగాప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి మరో గ్రూపుగా మారారు. వీరితో పాటు మొదటి నుంచి పరసా వెంకటరత్నయ్య వర్గం ఎలాగూ ఉంది. రెండో విడత నీరు–చెట్టు పనుల పంపకాల్లో తలెత్తిన వివాదం ప్రస్తుతం ఆలయ పాలక మండళ్ల నియామకంలో ఎక్కువైంది. కొండేపాటి తన వర్గీయులకు పనులు కేటాయించాలని ప్రతిపాదించారు. అయితే వేనాటి వర్గీయులు 40 శాతం, వాకాటి వర్గీయులు 40 శాతం, పరసా వర్గీయులు 20 శాతం పనులను పంచుకున్నారు. ఈ విషయంలో కొండేపాటి అసంతృప్తికి గురయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీ నేపథ్యంలో వివాదం: నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఈ విబేధాలు తారాస్థాయికి చేరాయి. మొదటి నుంచి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవిని వేనాటి పరంధామిరెడ్డి ఆశిస్తున్నారు. తాజాగా కొండేపాటి వర్గీయులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి పేరును వ్యవసాయ మార్కెటింగ్ కమిటీకి, ఆకుతోట రమేష్ పేరును నాగేశ్వరస్వామి దేవస్థానానికి చైర్మన్లుగా సీఎం నుంచి ఆర్డర్ వేయించుకున్నారని తెలిసింది. దీంతో వేనాటి, వాకాటి, ఇసనాక, పరసా కలిసి ముఖ్యమంత్రి వద్దనే పంచాయతీ పెట్టినట్టుగా సమాచారం. వేనాటి వర్గీయులకు ఆ పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొండేపాటి తన బావమరిదికి పెంచలకోన నరసింహస్వామి ఆలయం, వియ్యంకుడికి శ్రీ కాళహస్తి శివాలయం ౖచైర్మన్, నాయుడుపేట మార్కెట్ కమిటీకి శిరసనంబేటి విజయభాస్కర్‌రెడ్డికి తెచ్చుకున్నారు కదా! మళ్లీ వీటిల్లో కూడా ఆయన పెత్తనమేనా! అని వేనాటి, వాకాటి వర్గీయుల ప్రశ్నిస్తున్నారు. వర్గ విభేదాలు బహిర్గతం: గురువారం నెల్లూరులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పరసా పనితీరుపై నాయుడుపేట, సూళ్లూరుపేట నాయకులు ధ్వజమెత్తారు. గురువారం జరిగిన మున్సిపల్ సమావేశంలో విభేదాలు స్పష్టంగా కనిపించాయి. ప్రస్తుతం చైర్పర్సన్ వేనాటి వర్గాన్ని విస్మరించి కొండేపాటి వర్గంగా మారిపోవడంతో ఈ విభేదాల సెగ మున్సిపాలిటీకి తాకింది. దీంతో గురువారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో వేనాటి కుమారుడు సుమంత్‌రెడ్డి చైర్‌పర్సన్‌పై పరోక్షంగా విమర్శించి సమావేశాన్ని బాయ్‌కాట్ చేయడంతో పాలకపక్షంలోని వేనాటి వర్గానికి చెందిన కౌన్సిలర్లు అందరూ బయటకు వచ్చేశారు. కొండేపాటి వర్గీయులు మాత్రమే సమావేశంలో ఉన్నారు. టీడీపీలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి మధ్య అధిపత్య పోరు జరుగుతుండడం కొసమెరుపు. -
మినీలారీ చోరీ
సూళ్లూరుపేట: పట్టణంలోని మున్నాబాయ్ దాబాహోటల్ సమీపంలో శనివారం రాత్రి నిలిపిన మినీ లారీ చోరీకి గురైందని దాని యజమాని అరుణాచలం సెల్వం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం నుంచే వాహనం కనిపించలేదని, పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని బాధితుడు తెలిపారు. ఎస్సై గంగాధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శాలివాహన కార్పొరేషన్‌కు నిధుల విడుదల
సూళ్లూరుపేట : కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ సొసైటీస్ ఫెడరేషన్ బోర్డుకు ఈ సంవత్సరం ముఖ్యమంత్రి చం రూ.200 కోట్లు నిధులు విడుదల చేయనున్నారని ఫెడరేషన్ బోర్డు డైరెక్టర్ కోట శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని వినాయకుడి గుడి సెంటర్లో ఓ ప్రైవేట్ భవనంలో కుమ్మరి శాలివానుల ఆదివారం సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘాన్ని ఏర్పాటుచేసుకుని దానికి నాగేంద్ర అనే వ్యక్తిని చైర్మన్‌గా ఎన్నుకుని 13 జిల్లాలకు డైరెక్టర్లను నియమించారని తెలిపారు. ఈ ఏడాది విడుదల చేయబోయే రూ.200 కోట్లలో జిల్లాకు రూ.15 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. కొత్తగా ఎన్నుకున్న నూతన ఫెడరేషన్ కార్యవర్గం ఈనెల 30వ తేదీన విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మేడా సాయి నారాయణ, గౌరవాధ్యక్షుడు మస్తానయ్య, ఉపాధ్యక్షుడు ఏ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ప్రియవర్ధన్‌బాబు పాల్గొన్నారు. -
చెంగాళమ్మ గుడిలో వైభవంగా కలశపూజ
సూళ్లూరుపేట: గురుపూర్ణిమ ఉత్సవాల్లో భాగంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం 108 కలశాలను ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహించారు. ఇప్పటికే 45 కలశాలను కాళంగి పరివాహక ప్రాంతంలోని ఆలయాలకు పంపిన సంగతి తెలిసిందే. 19వ తేదీన మొత్తం 153 కలశాల్లోని పవిత్రజలాలతో అమ్మవారికి అభిషేకం చేయనున్నారు. అషాడ పౌర్ణమిని పురస్కరించుకుని అదేరోజు అమ్మవారికి మహాచండీయాగం చేస్తారు. -
2వ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్
-
నేలపట్టులో విదేశీ అతిథుల సందడి
-
సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం
-
సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం
నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌ను రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, శిద్దా రాఘవరావు ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. అయితే ఈ ఫెస్టివల్‌కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కాగా ఫ్లెమింగో ఫెస్టివల్‌ను కార్యక్రమ చిత్రీకరణను ఏఎస్పీ గంగాధర్ అడ్డుకున్నారు. కెమెరామన్, ఫొటోగ్రాఫర్లను స్టేజీ మధ్యలోంచి పోలీసులు లాగేశారు. దీంతో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పాత్రికేయులు ప్రకటించారు. అనంతరం పాత్రికేయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
షార్‌లో గుర్తు తెలియని వ్యక్తి సంచారం
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని షార్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం రెండవ లాంచ్‌ప్యాడ్ వద్ద సుమారు 25 ఏళ్ల వయసున్న వ్యక్తి సంచరిస్తుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. తన పేరు వెంకటేష్ అని అతడు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం. మతిస్థిమితం లేనివాడిగా భావిస్తున్నారు. తమిళనాడులోని వేలూరుకి చెందిన వ్యక్తి అని ప్రాథమికంగా తెలిసింది. కాగా, ఈ నెల 27న జీఎస్ఎల్వీ డీ 6 ప్రయోగం ఉన్న నేపథ్యంలో ఇలా ఓ వ్యక్తి పట్టుబడడం అధికారుల్లో అలజడి రేపింది. -
సుళ్లూరుపేటలో షర్మిల వైయస్ఆర్ జనభేరి
-
వ్యవసాయం, వ్యాపారం దండగ: ఎంపీ చింతా
సూళ్లూరుపేట: రాష్ట్రంలో వ్యవసాయం, వ్యాపారం దండగని తిరుపతి ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో శనివారం రాత్రి నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమన్నారు. పక్షుల కోసం 1.05 లక్షల ఎకరాలు పులికాట్ సరస్సుకు అవసరమా అని ప్రశ్నించారు. ఐదువేల ఎకరాలు మాత్రం సరస్సుకు కేటాయించి, మిగిలిన విస్తీర్ణాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి పండగలు అవరసమే అయినా దుగరాజపట్నం లాంటి నౌకాశ్రయం కావాలని చెప్పారు. ఎన్ని రాకెట్లు అడ్డువచ్చినా, ఎన్ని కమ్యూనిస్టు కొంగలు అడ్డు వచ్చినా 2018 నాటికి పోర్టు ఏర్పాటుచేసి తీరుతామని పేర్కొన్నారు. పక్షుల పేర్లు చెప్పి తీర గ్రామాల్లో రోడ్డు వేయకుండా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. -
ఎమ్మెల్సీ నారాయణరెడ్డి నివాసంపై ఐటీ దాడులు
నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆయన అనుచరుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే సూళ్లూరుపేట, చీనిగుంటల్లోని నారాయణరెడ్డి బంధువుల నివాసాలపై కూడా అదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నారాయణరెడ్డి నివాసంలో పలు కీలక పత్రాలను ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.