రేషన్ బియ్యం లారీ పట్టివేత
దొరవారిసత్రం : అక్రమంగా లారీలో 329 బస్తాల రేషన్ బియ్యంతో నెల్లూరు వైపు వెళ్తున్న లారీని దొరవారిసత్రం పోలీసులు తల్లంపాడులోని స్వర్ణా టోల్‌ప్లాజా వద్ద శనివారం రాత్రి పట్టుకున్నారు. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు.. రేషన్ బియ్యంతో సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వైపు లారీ వెళ్తున్న విషయం ఫోన్ ద్వారా సమాచారం రావడంతో తమ సిబ్బందితో ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించామన్నారు. రేషన్ బియ్యంతో వెళ్లే లారీని గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.