ఐదేళ్లుగా మాకేం చేశారు? | Dugarajapatnam Villagers questioned Chinta Mohan | Sakshi
Sakshi News home page

ఐదేళ్లుగా మాకేం చేశారు?

Published Tue, Mar 11 2014 3:56 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

ఐదేళ్లుగా మాకేం చేశారు? - Sakshi

ఐదేళ్లుగా మాకేం చేశారు?

వాకాడు: తిరుపతి ఎంపీ చింతామోహన్‌కు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగరాజపట్నంలో ప్రజల నుంచి చుక్కెదురైంది. సోమవారం ఆయన దుగరాజపట్నంలో పర్యటించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఈ ప్రాంతానికి ఏం చేశావని స్థానికులు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక మౌనం దాల్చారు. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ నుంచి దుగరాజపట్నం చెరువుకు సాగునీటి సరఫరా చేసే కాలువకు నిధులు మంజూరైనా, పనులు చేపట్టకపోవడంపై నిలదీశారు.

స్థానికులు ఏమి అడిగినా ఆయన నుంచి సమాధానం కరువైంది. కాగా, బుధవారం నెల్లూరు పర్యటనకు రానున్న కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ను దుగరాజపట్నం సమీపంలోని అంజి లాపురానికి తీసుకొచ్చేందుకు చింతా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నేదురుమల్లి అనుచరులతో వచ్చిన ఆయన జైరాం రమేశ్‌తో పాటు ఆనం రామనారాయణరెడ్డి తదితర నేతలతో ఇక్కడ సభ నిర్వహించే విషయమై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement