ఏడుకొండలవాడి కరుణ ఎవరికో | congress loss power in tirupathi | Sakshi
Sakshi News home page

ఏడుకొండలవాడి కరుణ ఎవరికో

Published Sun, May 4 2014 12:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఏడుకొండలవాడి కరుణ ఎవరికో - Sakshi

ఏడుకొండలవాడి కరుణ ఎవరికో

తిరుపతిలో తగ్గిన కాంగ్రెస్ పరపతి
 
తిరుపతి... ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం. అత్యంత ప్రాధాన్యవుున్న ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు వెళ్లడానికి అభ్యర్థులంతా ఉవ్విళ్లూరుతున్నారు. అరుుతే...ప్రధాన పోటీ వూత్రం వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ వుధ్యే నెలకొంది. ఈ త్రివుుఖ పోరులోనూ వైఎస్సార్ సీపీ వుుందుంది. సిటింగ్ ఎంపీగా ప్రజావ్యతిరేకత, పార్టీ దుస్థితి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు ప్రతికూలంగా వూరారుు. టీడీపీ శ్రేణుల సహాయు నిరాకరణ, పార్టీ కేడర్ బలహీనంగా ఉండటం బీజేపీ అభ్యర్థి జయురాంను కలవరపెడుతున్నారుు. ఇదే తరుణంలో బలమైన పార్టీ కేడర్, వైఎస్ జగన్ ప్రభంజనం వల్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు రేసులో వుుందు నిలిచారు.
 
 
 తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఏకంగా 12 సార్లు  గెలుపొందింది. ఒకసారి టీడీపీ, ఇంకొకసారి బీజేపీ విజయుం సాధించారుు. ఇక్కడి నుంచి రికార్డు స్థాయిలో ఆరుసార్లు గెలుపొందిన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ డాక్టర్ చింతామోహన్‌కు ఈ సారి  ఎదురుగాలి వీస్తోంది. బీజేపీ అభ్యర్థిగా పోలీసు అధికారి కె.జయరాం తొలిసారి ఎన్నికల్లో తలపడుతున్నారు.  గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాదరావు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, ఆయన మీద జనానికి ఉన్న అభిమానం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనం వరప్రసాద్‌కు సానుకూల వాతావరణాన్ని సృష్టించారుు.

 కాంగ్రెస్‌కు ‘చింత’!

 తిరుపతి నుంచి ఏడుసార్లు ఎంపీగా పోటీచేసిన చింతా మోహన్ ఆరుసార్లు విజయుం సాధించారు. 1984లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఆయున.. ఆ తర్వాత  ఐదుసార్లు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యూరు. 1991-96 మధ్య  కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డితో ఉన్న రాజకీయ వైరం కారణంగా 1996లో టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో  నెలవల సుబ్రహ్మణ్యంకు అవకాశం వచ్చింది. 1998లో చింతా మోహన్ మళ్లీ టికెట్ సాధించుకుని గెలుపొందారు.  1999లోనూ పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి ఎన్.వెంకటస్వామి చేతిలో ఓడిపోయారు.

 

2004 ఎన్నికల్లో 1,99,329 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన చింతామోహన్...  2009లో వూత్రం  చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు 19,280 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఎదురుకావడంతో ఈసారి చిత్తూరు జిల్లా సత్యవేడు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అరుుతే లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు కరువు కావడంతో సిటింగ్ ఎంపీ చింతా మోహన్‌నే కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి  బరిలోకి దించింది. దీంతో ఎనిమిదో సారి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల్లో ఎదురీతకు సిద్ధపడ్డారు.
 
 దూసుకెళుతున్న వెలగపల్లి

 తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీకి సానుకూల పవనాలు వీస్తున్నారుు. నియోజకవర్గ పరిధిలోని ఒక్క వెంకటగిరి మినహాయిస్తే మిగిలిన ఆరు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి జనంలో పరపతి ఉన్న అభ్యర్థులే దొరకలేదు. దీంతో పోటీ నామమాత్రమే కానుంది. ఇదే తరుణంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఏడాది కాలంగా లోక్‌సభ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో వుమేకవుయ్యూరు. ఇది ఆయనకు కలిసొచ్చే అంశం.
 
 బీజేపీ నామమాత్రపు పోటీ

 టీడీపీతో ఎన్నికల పొత్తులో భాగంగా దక్కించుకున్న ఈ స్థానానికి బీజేపీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయింది. చివరకు పోలీసు అధికారి జయరాంను బరిలోకి దించింది. ఆయునకు టీడీపీ కేడర్  సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బీజేపీ నామమాత్రపు పోటీకే పరిమితమైంది.
 
  ఇదీ చరిత్ర
 
 తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అదే ఏడాది జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అనంతశయనం అయ్యంగార్ తన ప్రత్యర్థి, కేఎల్‌పీ అభ్యర్థి ఎల్‌బీ నాయుడుపై 6,037 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయున తొలి లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌గాను, రెండో స్పీకర్‌గాను పని చేశారు. ఈ లోక్‌సభ స్థానం 1957లో రద్దరుు్యంది. 1962లో మళ్లీ ఆవిర్భవించింది. అప్పట్నుంచి ఎస్సీలకు రిజర్వు అరుు్యంది. అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధి మారినా లోక్‌సభ స్థానం మాత్రం  రిజర్వ్ స్థానంగా కొనసాగుతూ వస్తోంది. ఈ స్థానం నుంచి  సి.దాస్ (1962, 1967) టి.బాలకృష్ణయ్య (1971, 1977), పసల పెంచలయ్య (1980), డాక్టర్ చింతామోహన్ ( 1984,  1989,  1991, 1998, 2004, 2009), నెలవల సుబ్రహ్మణ్యం (1996), డాక్టర్ ఎన్. వెంకటస్వామి (1999) ఎంపీలుగా పనిచేశారు.
 
 తిరుపతి  
 
 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి 18 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనే బరిలోకి దిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు టీడీపీపై వ్యతిరేకతతో ఉన్నారు. జయాపజయాలను ప్రభావితం చేసే టీటీడీ ఉద్యోగులు  వైఎస్సార్ సీపీ పట్ల అభిమానంతో ఉండటం కరుణాకరరెడ్డికి లాభిస్తుంది. పైగా ఆయున గత రెండేళ్లలో  ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.  టీడీపీ అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేస్తున్నారు. ఆయన భూకబ్జాకోరని గత ఎన్నికలప్పుడు  చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున వుబ్బు దేవనారాయుణరెడ్డి పోటీ చేస్తున్నారు.
 
 శ్రీకాళహస్తి
 
 తాజా వూజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ ఐదేళ్లలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే రైతులు, బీసీలు వైఎస్సార్ సీపీపై అభిమానం చూపుతున్నారు. యువ నాయకుడు బియ్యపు మధుసూదనరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయునకు ప్రజల్లో వుంచి పేరుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బత్తయ్యు నాయుుడు బరిలో ఉన్నారు.
 
 సత్యవేడు
 
 రైతులు, తమిళ ఎస్సీలు, బీసీలు గెలుపోటములను నిర్ణరుుస్తారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం రెండేళ్లుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ జనంలో గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. స్థానికులకు పరిచయుం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా టి.చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీతో పాటు  కాంగ్రెస్ కూడా నావువూత్రపు పోటీకే పరిమితవుని ప్రజలు చర్చించుకుంటున్నారు.
 
 సూళ్లూరుపేట

 
 ఇంజనీర్ కిలివేటి సంజీవయ్య వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయున చాలాకాలంగా  జనంతో వుమేకమై ఉన్నారు. టీడీపీ అభ్యర్థి, తాజా వూజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నంపై వ్యతిరేకత ఉంది. టీడీపీలోని అంతర్గత విభేదాలూ ఆయున్ను కలవరపెడుతున్నారుు. కాంగ్రెస్ అభ్యర్థి  డి.వుధుసూదనరావు  ప్రభావం చూపే పరిస్థితి లేదు. ఇవన్నీ వైఎస్సార్ సీపీకి లాభించనున్నాయి. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో వైఎస్‌పై జనానికి ఉన్న అభిమానం, పటిష్టమైన పార్టీ నాయకత్వం సంజీవయ్య విజయూవకాశాలను మెరుగుపరుస్తున్నాయి.
 
 గూడూరు
 
 తాజా వూజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌పై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో డాక్టర్ జ్యోత్స్నలతను టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమె రాజకీయాలకు కొత్త. మునిసిపల్ మాజీ చైర్మన్ పాశం సునీల్‌కుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ రైతులు, ఎస్సీలు వైఎస్సార్ సీపీకి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ తరఫున పనబాక క్రిష్ణయ్యు పోటీ నామమాతమే.
 
 సర్వేపల్లి
 
 నెల్లూరు జెడ్పీ మాజీ చైర్మన్ కాకాణి గోవర్దన్‌రెడ్డి రెండేళ్లుగా వైఎస్సార్ సీపీ తరఫున జనంతో మమేకవుయ్యూరు. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. టీడీపీ అభ్యర్థిగా వూజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కె.పట్టాభిరావుయ్యు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీకి తిరుగులేదన్న భావన ప్రజల్లో ఉంది.
 
 వెంకటగిరి

మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నుంచి తాజా వూజీ ఎమ్మెల్యే రామకృష్ణ పోటీలో నిలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.   రామకృష్ణ ఈ ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయులేదన్న భావన జనం లో కన్పిస్తోంది. ఇవన్నీ వైఎస్సార్ సీపీకి కలసిరానున్నారుు. వైఎస్సార్ సీపీ బలం, కొమ్మి లక్ష్మయ్యనాయుడుకు వ్యక్తిగతంగా జనంలో ఉన్న మంచి పేరు మిగిలిన రెండు పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి.
 
 అభివృద్ధికి ఆనవాళ్లు
 
* వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుపతిలో ఎస్వీ పశువైద్య, వేద విశ్వవిద్యాలయూలు ఏర్పాటు చేరుుంచారు.
* తిరుపతి నగరాన్ని జేఎన్‌ఎన్‌యుూఆర్‌ఎం పథకంలో చేర్పించి రూ.వేల కోట్ల నిధులు విడుదల చేయించారు.
* తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి పరిచారు.
* గాలేరు - నగరి ప్రాజెక్టు పూర్తి చేయించారు.
* శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరందించే తెలుగుగంగ ప్రాజెక్టు  పనులు 90 శాతానికి పైగా పూర్తి చేయించారు.
* సోమశిల-స్వర్ణముఖి కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. కృష్ణపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేయించారు.
* మన్నవరంలో రూ.6 వేల కోట్లతో ఎన్‌బీపీపీఎల్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల విడిభాగాల తయారీ ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. కేంద్రంతో పోట్లాడి మరీ ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు తన్నుకు పోకుండా చూశారు. దీనివల్ల 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
* సత్యవేడు సెజ్‌లో దేశీయ, విదేశీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు.
* ముత్తుకూరు మండలం నేలటూరులో 1,600 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేరుుంచారు.
* సోమశిల జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని 36 టీఎంసీల నుంచి 72 టీఎంసీలకు పెంచారు. దీనివల్ల శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తాగునీరు, 2.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
 
 సమాధి రాళ్లు

1. చంద్రబాబు వుుఖ్యవుంత్రిగా ఉన్నప్పుడు 1996లో కృష్ణపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత దాన్ని పట్టించుకోలేదు.
2. గాలేరు -నగరి ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారు. అప్రాధాన్య    ప్రాజెక్టుగా గుర్తించి...రైతులకు అన్యాయుం చేశారు.
3.  ఉబ్బలవుడుగు రిజర్వాయుర్ ఆధునికీకరణకు హామీ ఇచ్చినా.. రూపారుు కూడా విడుదల చేయులేదు.
4. వుుత్తుకూరు వద్ద 1991లో అప్పటి సీఎం నేదురువుల్లి జనార్దనరెడ్డి ప్రారంభించిన ఫిషరీస్ సైన్స్ కళాశాలను చంద్రబాబు 1996లో వురోసారి ప్రారంభించి షో చేశారు.
 
 జీవనాడి
 
కుటుంబానికి ప్రాణదాత.. విద్యాప్రదాత
 
నేను స్టిక్కరింగ్ చేసుకుంటూ బతుకుతున్నా. ఈ పనితోనే కుటుంబాన్ని పోషిస్తున్నా. మా అమ్మ అరవంబేటి గురవమ్మకు గతంలో గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. రెండు రక్త నాళాలు దెబ్బతిన్నాయని, ఆపరేషన్ చేయూలని డాక్టర్లు చెప్పారు.  చేతిలో రూపాయి లేదు. ఏమి చేయూలో పాలుపోలేదు. 2007 మార్చిలో సవుస్య వురింత తీవ్రమైంది. చివరకు ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఈ పథకం కింద విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేశారు. ఐదేళ్ల తరువాత నాకు కూడా గుండెనొప్పి వచ్చింది. అర్జంట్‌గా ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. తిరుపతి స్విమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నా.  ఇప్పుడు  నా పని నేను చేసుకుంటున్నా.  ఇదంతా వైఎస్  చలవే. ఆయున పుణ్యమా అని నా కొడుకు విశ్వతేజను కూడా  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా కార్పొరేట్ కాలేజీలో చదివించా. ప్రస్తుతం నాయుడుపేట దగ్గర ఉన్న గ్రీన్‌టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు విష్ణుప్రియ హ్యాండ్లూమ్ అండ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. వూ కుటుంబం మొత్తం వైఎస్‌కు రుణపడి ఉంది.  
 - అవరంబేటి వీరప్రసాద్, నాయుడుపేట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement