Published
Sat, Sep 24 2016 1:31 AM
| Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం తగదు
మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్
వాకాడు: యూపీఏ ప్రభుత్వం విభజన చట్టం కింద మంజూరు చేసిన దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం తగదని –తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. వాకాడులో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పోర్టును అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు పోర్టు కోసం దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం భావితరాలకు ద్రోహం చేయడమేనన్నారు. ఓడరేవు వస్తే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చారిత్రిక నేపథ్యమున్న ఓడరేవు నిర్మాణం కోసం పోరాడుతామన్నారు.